స్టయిలిష్ గా షురూ ..!!

మహర్షి సక్సెస్‌తో మంచి జోష్‌లో ఉన్న మహేష్ బాబు తన తదుపరి సినిమాను మొదలు పెట్టేశాడు. మహేష్ బాబు కెరీర్‌లో 26 వ సినిమాగా రానున్న ఈ సినిమాకు ‘సరిలేరు నీకెవ్వరు’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ కంఫర్మ్ చేశారు. చిత్రంలో మహేష్ బాబు ఆర్మీ ఆఫీసర్ రోల్ పోషిస్తున్నాడు. ఈ ఏడాది సంక్రాంతికి సక్సెస్ సాధించిన అనిల్ రావిపూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.

ఇటీవలే పూజా కార్యక్రమాలు నిర్వహించుకున్న ఈ చిత్రం ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది. ఎటువంటి హంగామా లేకుండా సైలెంట్ గా ఈ సినిమా షూటింగ్ షురూ అయిపోయింది. ఫస్ట్ షెడ్యూల్‌లో భాగంగా కాశ్మీర్ లోని అందమైన ప్రదేశాల్లో చిత్రంలోని కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది.

కాగా తాజాగా ఈ సెట్స్‌పై ఆర్మీ డ్రెస్‌లో మహేష్ బాబు షూటింగ్ లో పాల్గొన్నాడని అక్కడ చూసిన వారు చెప్పడంతో ఇప్పుడు అభిమానులు చాలా ఆతురతతో ఎప్పుడెప్పుడు మహేష్ ని ఆ స్టైలిష్ లుక్ లో చుద్దామా అని ఎదురుచూస్తున్నారు.. షూటింగ్‌లో భాగంగా సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ కూడా గారు కూడా ఈ షెడ్యూల్ లో పాల్గొంటున్నారు.

మహేష్ బాబును పవర్ ఫుల్ రోల్ లో చూపిస్తూనే కామెడీ ట్రాక్ అద్భుతంగా ఉండేలా స్క్రిప్ట్ రెడీ చేశారట అనిల్ రావిపూడి. ప్రతి సినిమాలో రాజేంద్ర ప్రసాద్ కు ఒక కీలకమైన పాత్ర ఇస్తుంటాడు అనిల్. సరిలేరు నీకెవ్వరు లో కూడా మహేష్ బాబు, రాజేంద్రప్రసాద్ మధ్యలో అద్భుతమైన కామెడీ సీన్స్ ఉంటాయని తెలుస్తుంది.

దానికి తోడు మహేష్ బాబు కామెడీ టైమింగ్ కూడా అద్భుతంగా ఉంటుందని.. వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు అందరినీ అలరిస్తాయని అనడంతో అవి హైలైట్ గా నిలవనున్నాయని దర్శకుడి కాంఫిడెన్స్ చూస్తే ఇట్టే అర్ధం అయిపోతుంది. కచ్చితంగా సరిలేరు నీకెవ్వరు కూడా సంచలన విజయం సాధించడం ఖాయం అంటున్నారు విశ్లేషకులు.

ఈ సినిమా ప్రీరిలీజ్ బిజినెస్ గురించి ఆసక్తికర చర్చ సాగుతోంది. ఇప్పటికే ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ చానల్ జెమినీ టివి భారీ సరిలేరు నీకెవ్వరు శాటిలైట్ హక్కులను సొంతం చేసుకుంది. సూపర్ స్టార్ సినిమాకి ఉన్న క్రేజ్‌ని బట్టి భారీ రేటుకు జెమినీ టివి ఈ సినిమా హక్కులను దక్కించుకున్నట్లు వాళ్లు అధికారికంగా తమ ట్విట్టర్ ఖాతా ద్వారా ధృవీకరించారు.

కేవలం శాటిలైట్ రైట్స్ మాత్రమే కాదు ఇతరత్రా బిజినెస్ లోనూ సరిలేరు నీకెవ్వరూ స్పీడ్ చూపిస్తుందనడంలో సందేహమేం లేదు. ఈ సినిమాపై భారీ బిజినెస్ జరగడం తథ్యం అని ఇప్పటికే ట్రేడ్ లోనూ చర్చ సాగుతోంది. ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ మాట అటుంచితే నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో దాదాపు 50 కోట్లు పైగానే గిట్టుబాటు అయ్యే వీలుందని తెలుస్తోంది.

సూపర్ స్టార్ మహేష్ సినిమా హక్కులు దక్కించుకోవడానికి బయ్యర్లు కాచుకుని మరీ కూర్చుంటారు. ఇప్పుడు సరిలేరు నీకెవ్వరు సినిమా విషయంలో కూడా అదే జరుగుతోంది. ప్రీ రిలీజ్ లో రికార్డులు సృష్టిస్తున్న మహేష్, సరిలేరు నీకెవ్వరు సినిమాతో కచ్చితంగా హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ అందుకుంటాడని అభిమానులు చాలా కాంఫిడెన్స్ తో ఉన్నారు.

సరిలేరు నీకెవ్వరు చిత్రంలో మహేష్ బాబు సరసన క్రేజీ హీరోయిన్ రష్మిక మందన్న నటిస్తుండగా.. సీనియర్ హీరోయిన్ విజయశాంతి కీలక పాత్ర పోషిస్తోంది. దాదాపు 15 ఏళ్ల తర్వాత విజయశాంతి రీ ఎంట్రీ ఇస్తుండటం ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని నింపుతోంది. అలాగే జ‌గ‌ప‌తి బాబు గారు కూడా మంచి ప్రాత‌లో న‌టిస్తున్నారు.

దేవీ శ్రీ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. నేనొక్క‌డినే, శ్రీ‌మంతుడు, మ‌హ‌ర్షి లాంటి సినిమాల త‌ర్వాత మ‌రోసారి మ‌హేష్ సినిమాకు ప‌ని చేస్తున్నాడు ఈయ‌న‌. అంతే కాకుండా ఈ సారి ఖచ్చితంగా మాస్ సాంగ్ ఇస్తా అని ప్రెస్‌మీట్ లో ప్రామిస్ చేసి మరీ చెప్పడంతో అభిమానులు ఈ సినిమా పాటల కోసం ఆతురతతో ఎదురుచూస్తున్నారు.

25 వ సినిమా మహర్షి ప్రశంసలతో పాటు భారీ వసూళ్ళతో రికార్డు సృష్టించి మహేష్ అభిమానుల్లో నూతనోత్సాహం నింపింది. చాలా కాలంగా ఎంటర్‌టైన్‌మెంట్ సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్న ప్రిన్స్ ఈ సినిమాతో అవుట్ ఆండ్ అవుట్ కమర్షియల్ కంటెంట్ తో రాబోతున్నాడని దర్శకుడు చెప్పడంతో హైప్ పెరిగింది.

వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా సరిలేరు నీకెవ్వరు చిత్రాన్ని విడుదల చేయాలని భావిస్తున్నారు దర్శకనిర్మాతలు. దానికి తగ్గట్టే అనిల్ రావిపూడి పక్కా ప్రణాళికతో సిద్ధంగా ఉన్నట్టు తెలిసింది..స‌రిలేరు నీకెవ్వ‌రు పై భారీ ఎక్స్ పెక్టేష‌న్సే ఏర్పాడ్డాయి. మ‌రి ఈ సినిమా ఎలా ఉండబోతుందో తెలియాలంటే 2020 సంక్రాంతి వ‌ర‌కు వెయిట్ చేయాల్సిందే.

Share

Leave a Comment