సూపర్‌స్టార్ మనసులో మాట

చైల్డ్ ఆర్టిస్ట్ గా టాలీవుడ్ లో ప్రవేశించి , రాజకుమారుడు మూవీ తో హీరో గా మారిన ప్రిన్స్ మహేష్ బాబు మురారి, ఒక్కడు, అతడు, పోకిరి, దూకుడు, సీతమ్మ వాకిట్లో సిరి మల్లె చెట్టు, శ్రీమంతుడు, భరత్ అనే నేను, మహర్షి వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను, అభిమానులను అలరించారు. సూపర్ స్టార్ సిల్వర్ జూబ్లీ మూవీ మహర్షి ఘనవిజయం సాధించి మహేష్ బాబు సినీ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన మహర్షి ఎన్నో కొత్త రికార్డులను సృష్టించింది. మహర్షి సినిమాకు కలెక్షన్లతో పాటుగా ప్రేక్షకుల నుంచి ప్రశంసలు కూడా దక్కాయి. మహర్షి తర్వాత మహేష్ బాబు కొత్త చిత్రం ప్రారంభమైంది. మహేష్ సక్సెస్ ఫుల్ మూవీస్ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న సూపర్ ఎంటర్ టైనర్ సరిలేరు నీకెవ్వరు మూవీ లో నటిస్తున్నారు.

రష్మిక హీరోయిన్ కాగా విజయశాంతి ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. దాదాపు 13 సంవత్సరాల గ్యాప్ తర్వాత సరిలేరు నీకెవ్వరు చిత్రం ద్వారా ఆమె రీ ఎంట్రీ ఇస్తున్నారు. సరిలేరు నీకెవ్వరు మూవీ షూటింగ్ ప్రస్తుతం కాశ్మీర్ లో జరుగుతున్న విషయం తెలిసిందే. కాశ్మీర్ లో ఒక మూవీ రిపోర్టర్ తో మాట్లాడుతూ మహేష్ బాబు ఇలా చెప్పుకొచ్చారు.

మాస్ మూవీస్ లో నటించడానికి తనకు అంత ఆశక్తిగా లేదని, అన్ని వర్గాల ప్రజలను సంతృప్తి పరచడం తన బాధ్యతని, మాస్ మూవీస్ తో ఫ్యామిలీ ఆడియెన్స్ ను థియేటర్స్ కు రప్పించలేమని, ఎంటర్ టైన్ మెంట్ మూవీస్ తోనే సాధ్యమని, సరిలేరు నీకెవ్వరు మూవీ అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైనర్ మూవీ అని మహేష్ బాబు చెప్పారు.

మహేష్ కెరీర్ బెస్ట్ ఎంటర్ టైనర్ ఈ సినిమా అంటూ అనిల్ రావిపూడి ప్రారంభోత్సవంలో వెల్లడించిన సంగతి తెలిసిందే. అనిల్ రావిపూడి సినిమాల్లో కామెడీకి కొదవే ఉండదు. అదే తరహాలో తన రెగ్యులర్ పంథాలోనే సరిలేరు నీకెవ్వరులో కూడా కామెడీ పండించాలని ఆయన భావిస్తున్నారట. మహేష్ బాబును హైలైట్ చేస్తూ గతంలో ఏ సినిమాలో చూడని విధంగా కామెడీ ఉండేలా జాగ్రత్త తీసుకుంటున్నారట డైరెక్టర్.

తొలిసారి మహేష్ ఓ మిలటరీ అధికారిగా నటిస్తుండడం ఆసక్తిని పెంచుతోంది. మేజర్ అజయ్ కృష్ణ గా మహేష్ ఈ సినిమాలో కనిపించనున్నారని అభిమానులతో ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు అనిల్ రావిపూడి. కశ్మీర్‌లో మేజర్‌ అజయ్‌కృష్ణ ఆపరేషన్‌ ఏంటి అని అప్పుడే అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాకి మహేష్ ఫేవరెట్ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు పని చేస్తున్నారు. రత్నవేలు ఇటీవల చిరంజీవి నటిస్తున్న సైరా చిత్రానికి పని చేసిన సంగతి తెలిసిందే. ఆ సినిమా చిత్రీకరణ పూర్తయ్యింది కాబట్టి పూర్తిగా సరిలేరు నీకెవ్వరు టీమ్ కి అందుబాటులోకి వచ్చారని తెలిసింది. రత్నవేలు జాతీయ స్థాయి అత్యుత్తమ ఛాయాగ్రాహకుడు అనడంలో సందేహం లేదు.

మహేష్ తో 1 నేనొక్కడినే, బ్రహ్మోత్సవం చిత్రాలకు రత్నవేలు ఇప్పటికే ఛాయాగ్రహణం అందించారు. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి మహేష్ సరిలేరు నీకెవ్వరు సినిమాకి పని చేస్తున్నారన మాట. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. భరత్ అనే నేను, మ‌హ‌ర్షి సినిమాల త‌ర్వాత వరుసగా మ‌హేష్ మూడో సినిమాకు కూడా ప‌ని చేస్తున్నాడు ఈయ‌న‌.

ఈ సినిమా షూటింగ్ ను శెరవేగంగా షూట్ చేస్తున్నారు. కాశ్మీర్ షూట్ పూర్తవ్వగానే హైదరాబాద్ లో మరో షెడ్యూల్ జరుగుతుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, ఎ.కె ఎంటర్ టైన్ మెంట్స్, జి.ఎం.బి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై దిల్ రాజు, అనిల్ సుంకర, మహేష్ బాబు సంయుక్తంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా సరిలేరు నీకెవ్వరు చిత్రాన్ని విడుదల చేయనున్నారు.

Share

Leave a Comment