క్రేజీ అప్డేట్ ఇచ్చిన మ‌హేష్‌..

సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు చేస్తున్న క్రేజీ ప్రాజెక్టు సర్కారు వారి పాటపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. పరశురామ్ పెట్లా దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి మహేష్ కు జోడీగా ఎవరు నటిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో అనేకమంది హీరోయిన్ల పేర్లు తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే

అయితే ఇప్పటి వరకు సర్కారు వారి పాట మేకర్స్ నుంచి హీరోయిన్ గురించి ఆఫీసియల్ కన్ఫర్మేషన్ ఇవ్వలేదు. మ‌హాన‌టి చిత్రంతో నేష‌న‌ల్ అవార్డ్ ద‌క్కించుకున్న అందాల ముద్దుగుమ్మ కీర్తి సురేష్‌. ఈ రోజు ఆమె పుట్టినరోజును జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో ఆమెకు శుభాకాంక్షలు చెబుతూ ఈ చిత్రంలో కి ఆహ్వానిస్తున్నట్లు ప్రకటించారు మహేష్

మహేష్ బాబు ట్వీట్ చేస్తూ సూపర్ టాలెంటెడ్ కీర్తి సురేష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు. సర్కారు వారి పాట టీమ్ మీకు స్వాగతం పలుకుతోంది. ఇది మీ మరపురాని చిత్రాలలో ఒకటిగా నిలుస్తుంది అని పేర్కొన్నారు. కాగా ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ వచ్చే ఏడాది ప్రారంభం చేయడానికి సన్నాహకాలు చేస్తున్నారు. మహేష్ కెరీర్లో 27వ చిత్రంగా రానున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి

ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన మహేష్ ప్రీ లుక్ పోస్టర్ విశేషమైన స్పందన తెచ్చుకుంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ – జీఎమ్బీ ఎంటర్టైన్మెంట్స్ – 14 రీల్స్ ప్లస్ నిర్మాణ సంస్థలు కలిసి నిర్మించనున్నాయి. ఈ మూవీకి థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి

కీర్తి సురేష్ ఒక ఇంటర్వ్యూ లో ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి తెలియజేస్తూ తెలుగు హీరోలలో మహేష్ అంటే తనకి చాలా ఇష్టం అని వెల్లడించింది. మీకు సెలెబ్రిటీ క్రష్ ఎవరైనా ఉన్నారా, ఉంటే వారి పేరు చెప్పండి అని అడిగిన ప్రశ్నకు మరో మాట లేకుండా మహేష్ బాబు అని సమాధానం ఇచ్చారు కీర్తి. చిన్నప్పటి నుండి మహేష్ అంటే తనకి ఎంతో ఇష్టం అని, ఆయనతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకునే ఛాన్స్ వస్తే ఎందుకు వదులుకుంటా అని నవ్వేసింది

ఆయనతో నటించే అవకాసం కోసం ఎదురుచూస్తున్నాను, ఆయన నటన ఎంతో నాచురల్ గా ఉంటుందని, అదే మహేష్ ని అందరిలో స్పెషల్ గా నిలబెడుతుంది. అందుకే మహేషే నా మోస్ట్ ఫ్యావరెట్ హీరో అని మహేష్ మీద తనకున్న అభిమానాన్ని వెల్లడించారు కీర్తి సురేష్. అంతే కాదు రానా వ్యాఖ్యానించే షో లో కూడా కీర్తి మహేష్ ని ఇమిటేట్ చేసి తమకున్న అభిమానాన్ని తెలియజేసారు

నాని మహేష్ ని అనుకరిస్తూ కీర్తి కి క్లూస్ ఇచ్చాడు. వెంటనే కీర్తి మహేష్ బాబు అని చెప్పింది. హమ్మయ్యా ఈ పేరు మాత్రం చెప్తావు నీ ఫేవరెట్ హీరో కదా అని నాని చెప్పారు ఈ షోలో. ఎలాంటి వివాదాల జోలికి వెళ్లకుండా, సింపుల్‌గా ఉండే మహేష్‌ కు కేవలం మాములు ప్రేక్షకులే కాకుండా సెలబ్రిటీస్ లో కూడా చాలా మంచి ఫాలోయింగి ఉంది. అందరూ మహేష్ వ్యక్తిత్వాన్ని చాలా ఇష్టపడతారు

ఇప్పుడు నిజంగా మహేష్ తో సినిమాలో నటించే చాన్స్ రావడంతో కీర్తి సురేష్ ఎంత ఆనదంగా ఉండి ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తెలుగులో చాలా తక్కువ సినిమాలే చేసిన హీరోయిన్ కీర్తి సురేష్‌. కానీ ఒకే ఒక్క సినిమా మహానటితో తానేంటో నిరూపించుకుంది. అలనాటి నటి సావిత్రిని అనుకరణ చేస్తూ ఏకంగా జాతీయ ఉత్తమ నటిగా నిలిచారు

అస‌లు కీర్తిలో స్పెషాలిటీ ఏమిటంటే తన నటనతోనే అందరినీ ఆకట్టుకుంటారు. అయినా కుర్ర హీరోల‌తో పాటు పెద్ద హీరోలు, ద‌ర్శ‌క నిర్మాత‌లు ఆమె వెంట ప‌డుతున్నారు. అటు తమిళం, ఇటు తెలుగు లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా ఎదిగారు కీర్తి సురేష్

Share

Leave a Comment