క్లారిటీ ఇచ్చేసారు..

సరిలేరు నీకెవ్వరు సూపర్ హిట్ తర్వాత మహేష్ బాబు సినిమా సర్కారు వారి పాట సినిమాతో మరో కొత్త కథ తో కొత్త లుక్ ‌లో రాబోతున్నాడు. ఈ సినిమాకు ఇప్పటి వరకు హీరోయిన్ ఎవరు అనే సందిగ్ధత ఉండేది. కానీ తాజాగా వాటికి చెక్ పెడుతూ చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చేసారు

అగ్ర నటీమణులల్లో ఆమెకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. ఆమె చేసే ప్రతి సినిమాలో ఎదో ఒక కొత్తదనం ఖచ్చితంగా ఉంటుందనే చెప్పాలి. ఆమే మరెవరో కాదు, ఉత్తమ నటిగా నేషనల్ అవార్డ్ అందుకున్న నేచురల్ యాక్ట్రెస్ కీర్తి సురేష్‌

కీర్తి సురేష్ పుట్టినరోజు కావడంతో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఆమెకు స్పెషల్ విషెస్‌ని చెప్పి, సర్కారు వారి పాటలోకి ఆహ్వానించారు. ప్రస్తుతం నెట్టింట ఇది వైరల్ అవుతుంది. దీంతో ఆమెకు అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు

సూప‌ర్ టాలెంటెడ్‌ కీర్తి సురేష్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. సర్కారు వారి పాట టీమ్ మీకు స్వాగతం పలుకుతోంది. ఈ సినిమా కచ్చితంగా మీ కెరీర్‌లో ఎప్పటికీ గుర్తిండిపోయే ఒక మంచి జ్ఞాపకంగా నిలుస్తుంది అని సూపర్ స్టార్ మహేష్ బాబు ట్వీట్ చేశారు

దీనికి కీర్తి సురేష్‌, ధన్యవాదాలు మహేష్‌ బాబు గారు. మీతో తొలిసారి నటించే అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఆ క్ష‌ణం కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నాను అని తనకు చాలా సంతోషంగా ఉందని స్పందించారు

కీర్తి సురేష్ చాలా ఇంటర్వ్యూలలో మహేష్ బాబు తో నటించాలని ఉందని చెప్పింది. ఇప్పుడు నిజంగా మహేష్ తో సర్కారు వారి పాట సినిమాలో నటించే చాన్స్ రావడంతో కీర్తి సురేష్ ఎంత ఆనదంగా ఉండి ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు

దర్శకుడు పరశురామ్ తో మొదటి సారి మహేష్ నటిస్తుండగా ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనికి ముందు వరుసగా మూడు భారీ హిట్లు అందుకున్న మహేష్ దీనితో ఇంకో హ్యాట్రిక్ కు నాంధి పలకడానికి రెడీగా ఉన్నారు

మహేష్ పరుశురామ్ సర్కారు వారి పాట సినిమా తొందరగా కంప్లీట్ చేయడానికి పక్కా షెడ్యూల్ ప్రిపేర్ చేసుకున్నారట. కరోనా ఎఫెక్ట్ షూటింగులు వాయిదా పడ్డాయి. అయితే ఈలోగా సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ పూర్తి చేసేద్దాం అని దర్శకుడు పరశురామ్ చెప్పినట్లు సమాచారం

ఇప్పటికే విడుదలైన మోషన్‌ పోస్టర్‌ అంచనాలు పెంచుతుంది. త్వరలోనే చిత్రీకరణ ప్రారంభం కానుంది. లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేష‌న్ థమన్ ఎస్‌.ఎస్‌ సంగీతం అందిస్తుండ‌గా మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్ బి ఎంటర్టైన్మెంట్ 14 రీల్స్ ప్లస్ సంస్థలు ఈ ప్రెస్టీజియస్ మూవీని నిర్మిస్తున్నాయి

Share

Leave a Comment