థియేటర్‌కి ఎందుకు వెళ్ళారంటే….

థియేటర్‌కి వెళ్లారు హీరో మహేశ్‌ బాబు. ఏ థియేటర్‌కి వెళ్లారు? ఆ థియేటర్‌ ఎక్కడుంది? అంటే.. హైదరాబాద్‌లో ఓ థియేటర్‌కి వెళ్లారు.

ఏ సినిమా చూడ్డానికి వెళ్లారు? అంటే.. తన సినిమా కోసమే. మహేశ్‌బాబు సినిమా ఏ థియేటర్‌లోనూ ఆడటంలేదు కదా అనుకుంటున్నారా? మహేశ్‌ వెళ్లింది..

సినిమా చూడ్డానికి కాదు.. షూటింగ్‌ చేయడానికి. ‘శ్రీమంతుడు’ వంటి బ్లాక్‌ బస్టర్‌ మూవీ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో మహేశ్‌బాబు హీరోగా ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే.

ఒమెన్‌ విహార యాత్రల తర్వాత షూట్‌లో పాల్గొన్నారు మహేశ్‌. హైదరాబాద్‌లో మహేశ్, కియారాలపై సాంగ్‌ షూట్‌ చేశారు.

ఆ సాంగ్‌ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే థియేటర్‌ సీక్వెన్స్‌లో మహేశ్‌బాబు పాల్గొన్నారట. థియేటర్లో గానా బజానా అదిరిపోయిందట. అసలు విషయం అది.

సంక్రాంతి కి ఫస్ట్ లుక్ లేదా టీజర్ ఉంటుందని ఎక్కడా అఫీషియల్ గ డిక్లేర్ చేయలేదు కాబట్టి ఈ సంక్రాంతి కి ఇలాంటివి ఏం ఉండవు అని అర్దం అవుతుంది. ఈ చిత్రానికి దేవీశ్రీ ప్రసాద్‌ స్వరకర్త.

‘భరత్‌ అనే నేను’ టైటిల్‌ను పరిశీలిస్తున్నారట. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో కియారా అద్వాని కథానాయిక.

మహేష్, కొరటాల తిరిగి కలిసి చేస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. రచయితగా, దర్శకుడిగా కొరటాల శివ చిత్రాలు అంతర్లీనంగా సందేశాన్ని కలిగి ఉంటాయి.

మాస్‌, కమర్షియల్‌ అంశాలను టచ్‌ చేస్తూనే అందులో సందేశానికీ ప్రాధాన్యం ఇస్తారు. ఇప్పుడు ఈ చిత్రంలో ఎలాంటి సందేశం ఇవ్వబోతున్నారా? అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ప్రకాష్ రాజ్ – శరత్ కుమార్ – రావు రమేష్ – పోసాని కృష్ణ మురళి – దేవరాజ్ లాంటి సీనియర్ నటులంతా వాల్ల పాత్రల్లో అదరగొట్టేస్తారని యూనిట్ నమ్మకంగా ఉంది.

సూపర్ స్టార్ మహేష్ బాబు తన ట్విట్టర్ ద్వారా మంగళవారం సాయంత్రం ‘మనసుకు నచ్చింది’ ట్రైలర్ విడుదల చేశారు.

జాయ్ రైడ్ ఆఫ్ ఎమోషన్స్. చూడటానికి చాలా బావుంది. నా సోదరికి బెస్ట్ విషెస్ తెలుపుతున్నాను అంటూ ట్వీట్ చేసారు.

Share

Leave a Comment