థాంక్యూ మై ల‌వ్‌ అంటూ ప్రత్యేకంగా

స్ట‌న్నింగ్.. మైండ్ బ్లోయింగ్‌.. మిరాకిల్‌.. ఈ ఫోటో చూశాక అభిమానుల ఫీలింగ్ ఇది. సూప‌ర్‌స్టార్ మ‌హేష్ – న‌మ్ర‌త ఇలా తమ ప్రేమ ని వ్యక్తపరచడం ఓ సెన్సేష‌న్‌.. ప్ర‌స్తుతం ఫిలింన‌గ‌ర్‌ని, తెలుగు రాష్ట్రాల్ని షేక్ చేస్తున్న ఫోటో ఇది.

వాస్త‌వానికి మ‌హేష్ అస‌లు ప‌ర్స‌న‌ల్ లైఫ్‌ని ఇలా సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం చేయాల‌ని అనుకోడు. కానీ స‌డెన్‌గా అత‌డు ఈ అరుదైన ఫోటోని ఇన్‌స్టాగ్ర‌మ్‌లో పోస్ట్ చేసి షాకిచ్చారు. ప్ర‌స్తుతం ఇంటా బ‌య‌టా ఈ ఫోటో గురించే ఆస‌క్తిక‌ర ముచ్చ‌ట్లు సాగుతున్నాయి.

మ‌హేష్ ఎంత ఆనందంలో ఉంటే ఇలా త‌న భార్య‌కు ముద్దు పెట్టి, ఆ ఫోటోని ఇలా సోష‌ల్ మీడియా లో పోస్ట్ చేస్తారు? ఆనందం ఆవ‌ర్ణ‌మైన వేళ.. ఉద్వేగాన్ని అదుపులో పెట్టుకోలేని వేళ మాత్ర‌మే ఇది సాధ్యం!

అయితే ఈ ఆనందం వెన‌క‌.. ఈ ఉద్వేగం వెన‌క ఎంతో పెద్ద మ్యాట‌రే దాగి ఉంది. మ‌హేష్ త‌న కెరీర్‌ లోనే ది బెస్ట్ పొజిష‌న్‌లో ఉన్నాడు. కెరీర్ బెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్‌ని అందుకున్నాడు. అదీ `భ‌ర‌త్ అనే నేను` రూపంలో.

అత‌డు `రాజ‌కుమారుడు` సినిమాతో తెరంగేట్రం చేసి, అటుపై కెరీర్ ప‌రంగా ఎన్నో ఉత్థాన‌ప‌త‌నాలు చూశాడు. ఆ క్ర‌మంలోనే `వంశీ` సినిమాతో ప‌రిచ‌య‌మైన ముంబై నాయిక న‌మ్ర‌త‌తో ప్రేమ‌లో ప‌డ్డాడు.

ఆ ఇరువురి ప్రేమ విజ‌య‌వంత‌మైంది. పెళ్లి బంధంతో ఒక్క‌ట‌య్యాక‌.. మ‌హేష్‌కి అన్నీ తానే అయ్యి.. అత‌డి కెరీర్‌ని తీర్చిదిద్దడంలో న‌మ్ర‌త‌ పోషించిన పాత్ర ఎంతో గొప్ప‌ది అని చెబుతారు.

భార్య స‌గం బ‌లం అంటారు! ఆ పాత్ర‌ను న‌మ్ర‌త ఎంతో స‌క్సెస్‌ఫుల్‌గా నిర్వ‌ర్తించ‌డం వ‌ల్ల‌నే మ‌హేష్ ఈ స‌క్సెస్‌లు అందుకోగ‌లిగారు. అందుకే ఇలా ఆనందంగా ముద్దు పెట్టి, అభిమానులకు దానిని తెలిపారిలా.

ఫిలింన‌గ‌ర్ లోని మ‌హేష్‌ ఇంట్లోని దృశ్య‌మిది. ఫోటో క్యాప్ష‌న్‌గా.. రాసుకున్న “థాంక్యూ .. మై ల‌వ్‌..“ అన్న ఒక్క ప‌దంలో ఎంతో ఉద్విగ్న‌త దాగి ఉంది.. స‌రిగా గ‌మ‌నిస్తే!! ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ ఫోటోపై అభిమానులు ‘ఎటర్నల్ లవ్’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. భరత్‌కు భారీ విజయాన్ని కట్టబెట్టిన అభిమానులకు ఈ సందర్భంగా ప్రిన్స్ ట్విట్టర్ ద్వారా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాడు.

Share

Leave a Comment