కొత్త సినిమాలో ఆసక్తికరమైన ఫైట్‌….

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు, ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో భరత్‌ అనే నేను సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. పొలిటికల్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా సాగుతోంది.

ఈ సినిమాలో మహేష్‌ ముఖ్యమంత్రి కనిపించనున్నాడన్న ప్రచారం జరుగుతోంది. కొరటాల శివ తన ప్రతీ సినిమాలోనూ ఓ ఆసక్తికరమైన కాన్సెప్ట్‌తో ఫైట్‌ ఉండేలా ప్లాన్‌ చేస్తాడు. అదే తరహాలో భరత్‌ అనే నేను కోసం కూడా ఓ ఫైట్‌ ను డిజైన్‌ చేశాడట.

మిర్చి సినిమాలో వానలో ఫైట్‌, శ్రీమంతుడు సినిమా కోసం మామిడి తోటలో ఫైట్‌, జనతా గ్యారేజ్‌లో గవర్నమెంట్‌ ఆఫీస్‌లో ఫైట్‌ సీన్స్‌ ఆ సినిమాలకే హైలెట్‌ గా నిలిచాయి.

అదే తరహాలో భరత్‌ అనే నేను సినిమా కోసం హోలీ వేడుకల్లో పోరాట సన్నివేశాలు ప్లాన్‌ చేశాడట.

ఈమధ్యే ఈ యాక్షన్ ఎపిసోడ్ షూటింగ్ కంప్లీట్ చేశారు. ఆ ఫైట్ సీక్వెన్స్ పూర్తి చేసి మహేష్ థమ్స్ అప్ యాడ్ షూట్ కోసం అమెరికా వెళ్లడం జరిగింది.

మహేష్‌ సరసన కైరా అద్వానీ హీరోయిన్‌ గా నటిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్‌ 27న రిలీజ్‌ చేయనున్నట్లు చిత్రనిర్మాత దానయ్య ప్రకటించిన సంగతి తెలిసిందే.

నెక్ట్స్ షెడ్యూల్ పొలాచ్చిలో ఈనెల 26 నుంచి ప్రారంభం అవుతుంది. అక్కడ కూడా మహేష్ పై ఓ భారీ ఫైట్ తో పాటు కొన్ని సాంగ్ బిట్స్ పిక్చరైజ్ చేయబోతున్నారు.

అభిమానుల అంచనాల ప్రకారమే ఎక్కడా తగ్గకుండా గ్రాండ్ గా సినిమాను రూపొందిస్తున్నారు కొరటాల. ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్‌ సంగీతాన్ని అందిస్తున్నారు.

– సాక్షి

Share

Leave a Comment