మహేష్…రియల్ శ్రీమంతుడు !!!

సూపర్ స్టార్ మహేష్ బాబు, కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ‘శ్రీమంతుడు’ చిత్రం తర్వాత మహేష్ బాబు రెండు గ్రామాలను దత్తత తీసుకున్న విషయం తెలిసిందే.

అందులో ఒకటి ఆంధ్రప్రదేశ్‌లోని సూపర్ స్టార్ కృష్ణ సొంత ఊరైన బుర్రెపాలెం కాగా, రెండోది తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లా, కొత్తూరు మండలంలోని సిద్ధాపురం గ్రామం.

అయితే ఏపీలోని బుర్రెపాలెం గ్రామాన్ని అన్ని సౌకర్యాలతో అద్భుతంగా తీర్చిదిద్దిన మహేష్ బాబు ప్రస్తుతం తెలంగాణలోని సిద్ధాపురంని ఎక్కడా తగ్గకుండా అన్ని సౌకర్యాలు ఉండేలా అభివృద్ధి చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

రీల్ లోనే కాదు.. రియల్ గా కూడా అసలుసిసలు శ్రీమంతుడు మహేష్ బాబు అనిపించేలా వ్యవహరిస్తున్న వైనం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

ఏదో దత్తత తీసుకున్నామంటే.. ప్రచారం కోసం తీసుకున్నామన్న ధోరణికి భిన్నంగా మహేష్ వ్యవహరిస్తున్నారు. అభివృద్ధి కార్యక్రమాల్ని సమీక్షించటం.. పెద్ద ఎత్తున చేపట్టటం చేస్తున్నారు.

మహేష్ భార్య నమ్రతా శిరోద్కర్ దగ్గరుండి మరీ ఈ పనులను పర్యవేక్షిస్తున్నారట. తాజాగా ఆయన దత్తత తీసుకున్న కొత్తూరులో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు నెట్టింట్లో హడావుడి చేస్తున్నాయి.

కొత్తూరు గ్రామంలో ఒక స్కూల్ బిల్డింగ్ నిర్మాణానికి సంబంధించిన ఫోటోలు నెట్ లోకి వచ్చి అందరి దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తున్నాయి.

అంతకు ముందు ఏపీలో కూడా ఆమె దగ్గరుండి అభివృద్ధి కార్యక్రమాలను పర్యవేక్షించిన విషయం తెలిసిందే. స్కూల్ బిల్డింగ్ అనంతరం, ఆ ఊరికి అవసరమైన మరో భారీ నిర్మాణాన్ని వీరు చేపట్టబోతున్నారట.

ఊరిని దత్తత తీసుకోవడమంటే కేవలం ప్రచారానికి పరిమితం కాకుండా తనవంతు సాయం అందించి రియల్ శ్రీమంతుడు అనిపించుకుంటున్నాడు మన ప్రిన్స్ మహేష్.

మహేష్‌ బాబు దత్తత తీసుకున్న గ్రామాల్లో అభివృద్ధి పనులు జోరుగా సాగుతున్నాయి. సిద్ధాపూర్‌, బుర్రిపాలెం గ్రామాల్లో ప్రగతి పరుగులు పెడుతోంది.

చాలా మంది చెబుతారు. కానీ చెప్పింది చేసే వారు తక్కువే. కానీ తాను రెండో కోవలో ఉంటానని తన చేతలతోనే చేసి చూపించాడు ప్రిన్స్ మహేష్.

ఇక ప్రస్తుతం మహేష్ భరత్ అనే నేను చిత్రాన్ని చేస్తున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వేసవిలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Share

Leave a Comment