జనసంద్రం మధ్యలో గ్రాండ్‌గా

ప్రస్తుత స్టార్ హీరోల్లో సూపర్‌స్టార్ మహేష్‌బాబుకు ఉన్న క్రేజే వేరు. క్లాస్, మాస్ అనే తేడా లేకుండా మహేష్ అంటే అందరికీ అభిమానమే. ఆయకున్న మహిళా అభిమానులైతే మరీ ఎక్కువ. మహేష్‌ బాబు ని రియల్‌గా చూడాలనే కుతూహలం అందరిలో ఉంటుంది. అయితే మహేష్ తెర మీద తప్పితే బయట మాత్రం చాలా అరుదుగా కనిపిస్తుంటారు.

తాజాగా హైదరాబాద్ లోని కూకట్‌పల్లిలో ది చెన్నై సిల్క్స్‌ షాపింగ్ మాల్ కూకట్‌పల్లి బ్రాంచి కి మహేష్‌బాబు విచ్చేశారు. దీంతో ఆయనను చూసేందుకు భారీ ఎత్తున అభిమానులు తరలివచ్చారు.  వేల సంఖ్య లో అభిమానులు తరలి వచ్చి సందడి చేసారు. సూపర్‌స్టార్ స్లోగన్స్ తో సదరు స్టొర్ వారు ఏర్పాటు చేసిన మహేష్ కొత్త కటౌట్స్ ముందు సూపర్ ఫ్యాన్స్ హంగామా కన్నుల పండుగగా ఉంది.

ది చెన్నై సిల్క్స్‌ షాపింగ్ మాల్ కూకట్‌పల్లి బ్రాంచి కి వచ్చిన సూపర్‌స్టార్ మహేష్‌ బాబు లుక్ అదిరిపోయింది.  మునుపటి కంటే చాలా అందంగా కనిపిస్తున్నారు మహేష్ . అభిమానులు సోషల్ మీడియాలో మహేష్‌ పిక్స్ ని, వీడియోలను షేర్ లు లైక్ లు చేస్తూ వాటిని తెగ వైరల్ చేస్తున్నారు.

ది చెన్నై సిల్క్స్ కంపెనీ కొత్త టీవి స్పాట్ ల్ సూపర్ స్టార్ అభిమానులకు తాను జులై 15న కూకట్‌పల్లి ది చెన్నై సిల్క్స్ షోరూం కి వస్తున్నానని, మరి మీరు అని ఆడ్ ని ముగించారు. దీంతో అభిమానులు భారీగా తరలి వచ్చారు. మహేష్‌ ను చూసి అభిమానులు ఫుల్ ఖుషీ అయ్యారు.

ప్రస్తుతం మహేష్‌బాబు నటిస్తున్న 25వ చిత్రం గురించి అంతా చర్చించుకుంటున్నారు.  మహేష్‌బాబు ప్రతిష్టాత్మక, మైలురాయి చిత్రంకు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. భారీ అంచనాల నడుమ ఈ చిత్రాన్ని దిల్‌రాజుతో కలిసి అశ్వినీదత్‌ నిర్మిస్తున్నారు. 25వ సినిమా ప్ర‌స్తుతం ఆన్‌సెట్స్‌ ఉన్న సంగ‌తి తెలిసిందే. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో అల్ల‌రి న‌రేష్ ఓ కీల‌క‌పాత్ర పోషిస్తున్నారు.

అయితే ఇప్ప‌టివ‌ర‌కూ ఈ సినిమాకి టైటిల్‌ని చిత్ర‌బృందం నిర్ణ‌యించ‌లేదు. తాజా స‌మాచారం ప్ర‌కారం  ఆగ‌స్టు 9న మ‌హేష్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా అభిమానుల‌కు స్వీట్ షాక్ ఇవ్వాల‌ని చిత్ర‌బృందం నిర్ణ‌యించుకుంద‌ని తెలుస్తోంది. ఆరోజు మ‌హేష్ 25 ఫ‌స్ట్‌లుక్ లాంచ్ చేయ‌డ‌మే గాకుండా ఈ సినిమా టైటిల్‌ని వెల్ల‌డించ‌నున్నారు అని ఫిలిం నగర్ టాక్. ఉగాది కానుక‌గా 5 ఏప్రిల్ 2019కి సినిమాని రిలీజ్ చేయాల‌ని భావిస్తున్నారు.

 

Share

Leave a Comment