మహేష్ టైమింగ్ అదిరింది

అందం, యాక్టింగ్, కామెడీ టైమింగ్ ఇవన్నీ కలిసి మహేష్ ను సిల్వర్ స్క్రీన్ ప్రిన్స్ ను చేసేశాయి. రెండున్నర గంటల సినిమా అయినా….రెండు నిమిషాల యాడ్ అయినా…మహేష్ మనసు పెట్టి చేస్తాడు అనడానికి నిదర్శనం ఈ యాడ్. అభిబస్ అనే ఓ ఆన్ లైన్ బస్ బుకింగ్ యాప్ కు చెందిన ఓ యాడ్ లో నటించిన మహేష్, తన కామెడీ టైమింగ్ తో మరో సారి అదరగొట్టాడు.

వెన్నెల కిషోర్ తో కలిసి చేసిన ఫన్ అలరించింది. ఈ యాడ్ లో నవ్వుతూ సరదాగా కనిపిస్తున్న మహేష్ చాలా హ్యాండ్‌సమ్ గా ఉన్నాడు, యాడ్ చాలా బావుండటం తో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతుంది. చూసిన నెటిజన్లు మహేష్ మిస్టర్ కూల్ గా కనిపిస్తున్నారంటూ కామెంట్స్ పెడుతున్నారు. మహేష్ కామెడీ టైమింగ్ అదిరింది అని అంటున్నారు.

దీనిలో మహేష్ బాబు తన చార్మ్ మరియు స్టైల్ తో అదరకొడుతున్నాడనే చెప్పాలి. మహేష్ – వెన్నెల కిషోర్ కాంబినేషన్ ఇప్పటికే అన్ని సినిమాల్లో హైలైట్ గా నిలించింది. వారిద్దరి కామిక్ టైమింగ్ అదుర్స్ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ యాడ్ మరొకసారి వీరి కాంబినేషన్ ఎంత సరదాగా ఉంటుందో తెలియజేసింది.

వ్వర్ మిస్ ఎ ప్రెషియస్ మొమెంట్ అనే ఈ యాడ్ షూట్ ఒక ప్రత్యేకత ను కూడా సొంతం చేసుకుంది. భ‌ర‌త్ అనే నేను బ్లాక్ బస్టర్ విజయం తరువాత కొరటాల తో మహేష్ కలిసి పని చేసింది ఈ యాడ్ కోసమే. కెమెరా మ్యాన్ కూడా భ‌ర‌త్ అనే నేను కు పని చేసిన మాదీ నే. మహేష్ కొరటాల కాంబో మరోసారి బ్లాక్‌బస్టర్ గా నిలించింది.

అభిబస్ కి మహేష్ నేషనల్ వైడ్ గా అంబాసిడర్ గా కొనసాగుతున్నాడు.. ఇప్పటికే హిందీ కన్నడ తమిళ్ అన్ని భాషల్లో ఈ యాడ్ విడుదల అయింది. మహేష్ క్రేజ్ కి ఇదే నిదర్శనం. అన్ని చోట్లా ఈ యాడ్ కి ఫుల్ మార్క్స్ పడ్డాయి. మహేష్ రోజు రోజుకు మరింత అందంగా కనపడుతున్నాడని అభిమానులు ఖుషీగా ఉన్నారు.

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కి యాడ్ ఎండోర్స్‌మెంట్స్ విషయంలో ఏ రేంజ్ క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ప్రతీ ఇండస్ట్రీకి సంబంధించి ఓ కంపెనీ అయినా మహేష్ తో ప్రచారం చేయించుకునేందుకు తెగ ఉత్సాహం చూపిస్తూ ఉంటుంది. ఆల్ ఇండియా వైడ్ తనకంటూ ఒక గుర్తుంపు ఆండ్ బ్రాండ్ వాల్యూ తెచ్చుకున్న ఒకే ఒక సౌత్ ఇండియన్ సూపర్‌స్టార్ మహేష్ బాబు.

Share

Leave a Comment