ట్వంటీస్ లోకి సూపర్‌స్టార్‌

సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ఫ్యాన్స్‌కు చిత్ర‌బృందం డ‌బుల్ ధ‌మాకా అందించింది. గ‌త రాత్రి టైటిల్‌తోపాటు ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్ విడుద‌ల చేసిన చిత్ర‌యూనిట్ తాజాగా టీజ‌ర్‌ను రిలీజ్ చేసింది. అమ్మాయిల‌ను చూస్తూ స్టైలిష్‌గా న‌డుచుకుంటూ వెళ్తున్న మహేష్ వీడియోను చిత్ర‌బృందం విడుద‌ల చేసింది.

ఓ బ్యూటిఫుల్ కాలేజ్. అక్కడ ట్వంటీస్ లో ఉన్న ఓ కుర్రాడు. మనకి తెలుసు గానీ మహేష్ ఎవరో తెలీని విదేశీయులకు ఈ టీజర్ చూపించి అడగండి వయసెంతో. అప్పుడు చెప్తారు ఒక ట్వంటీ టూ నుంచి ట్వంటీ సెవెన్ మధ్యలో ఉంటాయని. అలా స్టైల్ గా నడుస్తూ ఒక చేత్తో హెయిర్ ని అలా దువ్వుకుంటూ మరో చేత్తో ల్యాప్ టాప్ పట్టుకుంటే ఎదురుగా వచ్చే అమ్మాయిలు ఏం కావాలి? ఓ అమ్మాయి అలా వెనక్కి తిరిగి చూస్తుంది మన మహేష్ కుడా వెనక్కి అలా తిరిగి చూస్తాడు.

సామాన్యంగా మహేష్ బాబుని చూస్తే ఆడపిల్లలు తలతిప్పి చూస్తారు, మహేష్ బాబే అమ్మాయిని చూసి తలతిప్పి చూసాడంటే, ఈ మీసం వున్న మహర్షి మాములుగా వుండడనుకుంటా అని ప్రముఖ రచయిత పరుచూరి గారు ట్వీట్ చేశారంటే ఈ టీజర్ ఎంత ఆకట్టుకుందో చెప్పాల్సిన అవసరం లేదు.

ఈ టీజర్ కి వరల్డ్‌వైడ్‌గా ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వస్తోంది. ‘మహర్షి’లో రిషిగా ఓ డిఫరెంట్‌ రోల్‌లో, కొత్త లుక్‌లో ప్రేక్షకుల్ని, అభిమానుల్ని అలరించనున్నారు సూపర్‌స్టార్‌ మహేష్‌. డెహ్రాడూన్‌, హైదరాబాద్‌లలో షెడ్యూల్స్‌ జరుపుకున్న ఈ భారీ చిత్రం నిర్మాణం ఏకథాటిగా జరుగుతోంది.

సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు అభిమానులు ఫుల్‌ హ్యాపీ. మరోవైపు టాలీవుడ్‌ రాజకుమారుడికి పుట్టినరోజు విషెస్‌తో సోషల్‌ మీడియాలో భారీ పోస్టులు చేస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, వైజయంతీ మూవీస్‌, పీవీపీ సినిమా సంస్థలు సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. మహేష్‌కు జోడీగా పూజా హెగ్డే న‌టిస్తోంది.

మహేష్‌ కెరీర్‌లో 25వ మూవీ ‘మహర్షి’కి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్‌. హీరో అల్లరి నరేష్‌ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. 2019లో ఈ మూవీ విడుదల కానుంది. భారీ తారాగణం నటిస్తోన్న ఈ ‘మహర్షి’ చిత్రం హై టెక్నికల్‌ వేల్యూస్‌తో రూపొందుతోంది. ఈ చిత్రానికి ప్రముఖ ఛాయాగ్రాహకుడు కె.యు. మోహనన్‌ ఫొటోగ్రఫీ అందిస్తున్నారు. హరి, సాల్మన్‌, సునీల్‌ బాబు, కె.ఎల్‌. ప్రవీణ్‌, రాజు సుందరం, శ్రీమణి, రామ్‌-లక్ష్మణ్‌ సాంకేతిక వర్గం.

Share

Leave a Comment