పండగ వాతావరణంలా

ప్రస్తుత స్టార్ హీరోల్లో సూపర్‌స్టార్ మహేష్‌బాబుకు ఉన్న క్రేజే వేరు. క్లాస్, మాస్ అనే తేడా లేకుండా మహేష్ అంటే అందరికీ అభిమానమే. ఆయకున్న మహిళా అభిమానులైతే మరీ ఎక్కువ. మహేష్‌ బాబు ని రియల్‌గా చూడాలనే కుతూహలం అందరిలో ఉంటుంది. అయితే మహేష్ తెర మీద తప్పితే బయట మాత్రం చాలా అరుదుగా కనిపిస్తుంటారు.

తాజాగా హైదరాబాద్ లోని కూకట్‌పల్లిలో ది చెన్నై సిల్క్స్‌ షాపింగ్ మాల్ కూకట్‌పల్లి బ్రాంచి కి మహేష్‌బాబు విచ్చేశారు. దీంతో ఆయనను చూసేందుకు భారీ ఎత్తున అభిమానులు తరలివచ్చారు. ఈ స్టొర్ ప్రాంగనం లో వేల సంఖ్య లో అభిమానులు తరలి వచ్చి సందడి చేసారు. సూపర్‌స్టార్ స్లోగన్స్ తో సదరు స్టొర్ వారు ఏర్పాటు చేసిన మహేష్ కొత్త కటౌట్స్ ముందు సూపర్ ఫ్యాన్స్ హంగామా కన్నుల పండుగగా ఉంది.

అభిమానులు సోషల్ మీడియాలో మహేష్‌ పిక్స్ ని, వీడియోలను షేర్ లు లైక్ లు చేస్తూ వాటిని తెగ వైరల్ చేస్తున్నారు. ది చెన్నై సిల్క్స్‌ షాపింగ్ మాల్ కూకట్‌పల్లి బ్రాంచి కి వచ్చిన లుక్ సూపర్‌స్టార్ మహేష్‌ బాబు అదిరిపోయింది.

ది చెన్నై సిల్క్స్ కంపెనీ కొత్త టీవి స్పాట్ ల్ సూపర్ స్టార్ అభిమానులకు తాను జులై 15న కూకట్‌పల్లి ది చెన్నై సిల్క్స్ షోరూం కి వస్తున్నానని, మరి మీరు అని ఆడ్ ని ముగించారు. దీంతో అభిమానులు భారీగా తరలి వచ్చారు. మహేష్‌ ను చూసి అభిమానులు ఫుల్ ఖుషీ అయ్యారు. మహేష్ మాత్రం మునుపటి కంటే చాలా అందంగా కనిపిస్తున్నారు.

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు యాడ్స్ తో బిజీ బిజీగా గడుపుతున్నారు. సూపర్ స్టార్ మహేష్ తాజాగా మరో సంస్థకు కూడా బ్రాండ్ అంబాసిడర్ గా సైన్ చేశారు. సాయి సూర్య డెవ‌ల‌ప‌ర్స్ కోసం ఆయ‌న ప్ర‌చారం చేస్తున్న విషయం తెలిసిందే.

సూపర్ స్టార్ మహేష్ బాబు తన ప్రతిష్టాత్మక 25వ చిత్రం కోసం త్వరలో రెండవ షెడ్యూల్ షూటింగ్ లో పాల్గొనడానికి సిద్ధమవుతున్నారు. వంశీ పైడిపల్లి డైరక్షన్ లో ఈ సినిమాను దిల్ రాజు, అశ్వనిదత్ కలిసి నిర్మిస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ మూవీ ఉగాది కానుక‌గా 5 ఏప్రిల్ 2019కి రిలీజ్ చేయాల‌ని భావిస్తున్నారు.

Share

Leave a Comment