సూప‌ర్ స్టార్ కొత్త యాడ్ చూశారా

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో త‌న 25వ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. భరత్ అనే నేను లో స్మార్ట్ గా కనిపించిన మన సూపర్ స్టార్ ఇప్పుడు తన 25వ సినిమాకోసం కొత్త లుక్ ట్రై చేస్తున్నారని తెలిసిన విషయమే.

మహేష్ తన కొత్త లుక్ తో లేటెస్ట్ గా ఒక టీ.వి కమర్షియల్ లో నటించారు. ఈ కొత్త టీవి స్పాట్ ల్ సూపర్ స్టార్ తన న్యూ లుక్ తో అదరగొడుతున్నాడనే చెప్పాలి. అభిమానులు ఫుల్ ఖుషీగా సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌ చేసేస్తున్నారు.

మహేష్ తన న్యూ లుక్ తో ది చెన్నై సిల్క్స్ కి ఒక ఆడ్ చేసారు. నేడు సదరు కంపెనీ వారు ఈ వీడియో ని విడుదల చేసారు. ఈ కొత్త టీవి స్పాట్ ల్ సూపర్ స్టార్ తన కొత్త లుక్ తో అదరగొడుతున్నాడనే చెప్పాలి. గడ్డం తో ఎక్కువ పొడవాటి హెయిర్ స్టయిల్ లో సూపర్‌స్టార్ చాలా అందంగా కనిపిస్తున్నారు.

ఈ వీడియోతో అభిమానులకు ఒక శుభవార్త కూడా చెప్పారు సూపర్‌స్టార్ మహేష్. తాను జులై 15న కూకట్‌పల్లి ది చెన్నై సిల్క్స్ షోరూం కి వస్తున్నానని, మరి మీరు అని ఆడ్ ని ముగించారు. అంటే అభిమానులు తమ సూపర్‌స్టార్ ని 15న చూడవచ్చు అనమాట.

ఇక మహేష్ న్యూ లుక్ తో కొత్తగా ట్రెండ్ సెట్ చెయ్యడం యూత్ మొత్తం మహేష్ నే ఫాలో అవుతారనే టాక్ మాత్రం చిత్ర బృందం నుండి వినిపిస్తుంది. మహేష్ మేక్ఓవర్ తో అభిమానులను సర్‌ప్రైజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా ట్రెండ్ అవుతున్నాయి.

ఈ సినిమాలో కాలేజీ నేప‌థ్యంలో వ‌చ్చే స‌న్నివేశాల్లో మ‌హేష్ మీసం, గెడ్డంతో ర‌ఫ్ లుక్‌లో క‌నిపించ‌బోతున్నాడ‌ని తెలుస్తోంది. ఈ కాలేజీ సీన్ల‌కు సంబంధించిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో విపరీతంగా తిరుగుతున్నాయి.

ఆగ‌స్టు 9న మ‌హేష్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఆరోజు మ‌హేష్ 25 ఫ‌స్ట్‌లుక్ లాంచ్ చేయ‌డ‌మే గాకుండా ఈ సినిమా టైటిల్‌ని వెల్ల‌డించ‌నున్నారు అని ఫిలిం నగర్ టాక్. ప్రతిష్టాత్మక చిత్రం అవ్వడంతో వంశీ పైడిపల్లి ప్రతి విషయంలో కూడా ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఉగాది కానుక‌గా 5 ఏప్రిల్ 2019కి సినిమాని రిలీజ్ చేయాల‌ని భావిస్తున్నారు.

Share

Leave a Comment