మీరు కూడా రండి కలుద్దాం

భరత్ అనే నేను సినిమాతో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు, బాక్సాఫీస్ కి కొత్త లెక్కలు నేర్పించారు. ఈ హిట్ ఇచ్చిన జోష్ తో తన 25వ సినిమా చేస్తున్న మహేష్, మేక్ఓవర్ తో అభిమానులను సర్‌ప్రైజ్ చేసిన సంగతి తెలిసిందే.

ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా ట్రెండ్ అవుతున్నాయి. ఈ సినిమాలో కాలేజీ నేప‌థ్యంలో వ‌చ్చే స‌న్నివేశాల్లో మ‌హేష్ మీసం, గెడ్డంతో ర‌ఫ్ లుక్‌లో క‌నిపించ‌బోతున్నాడ‌ని తెలుస్తోంది. ఈ కాలేజీ సీన్ల‌కు సంబంధించిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో విపరీతంగా తిరుగుతున్నాయి.

ఇప్పుడు అభిమానులకి మరో అదిరిపొయే సర్‌ప్రైజ్ ఇచ్చాడు సూపర్‌స్టార్. మహేష్ తన న్యూ లుక్ తో ది చెన్నై సిల్క్స్ కంపెనీ కి ఒక ఆడ్ చేసారు. నేడు సదరు కంపెనీ వారు ఈ వీడియో ని విడుదల చేసారు. ఈ కొత్త టీవి స్పాట్ ల్ సూపర్ స్టార్ తన కొత్త లుక్ తో అదరగొడుతున్నాడనే చెప్పాలి. అభిమానులు ఫుల్ ఖుషీగా సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌ చేసేస్తున్నారు. రఫ్ లుక్ తో కూడా చాలా హుందాగా కనిపించారు సూపర్‌స్టార్ మహేష్ బాబు.

ఈ వీడియోతో అభిమానులకు ఒక శుభవార్త కూడా చెప్పారు సూపర్‌స్టార్ మహేష్. తాను జులై 15న కూకట్‌పల్లి ది చెన్నై సిల్క్స్ షోరూం కి వస్తున్నానని, మరి మీరు అని ఆడ్ ని ముగించారు. అంటే అభిమానులు తమ సూపర్‌స్టార్ ని 15న చూడవచ్చు అనమాట. మహేష్ మాత్రం మునుపటి కంటే చాలా యుంగ్ గా అందంగా కనిపిస్తున్నారు. ఇది చూసి అభిమానులు ఫుల్ ఖుషీ గా ఉన్నారు.

మహేష్ 25వ సినిమా ప్ర‌స్తుతం ఆన్‌సెట్స్‌ ఉన్న సంగ‌తి తెలిసిందే. అయితే అన్నిటికీ సాధ్య‌మైనంత తొంద‌ర్లోనే క్లారిటీ వ‌చ్చేస్తుంది. ఆగ‌స్టు 9న మ‌హేష్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా అభిమానుల‌కు స్వీట్ షాక్ ఇవ్వాల‌ని చిత్ర‌బృందం నిర్ణ‌యించుకుంద‌ని తెలుస్తోంది.

ఆరోజు మ‌హేష్ 25 ఫ‌స్ట్‌లుక్ లాంచ్ చేయ‌డ‌మే గాకుండా ఈ సినిమా టైటిల్‌ని వెల్ల‌డించ‌నున్నారు అని ఫిలిం నగర్ టాక్. టైటిల్‌ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. మహేష్‌బాబు ప్రతిష్టాత్మక చిత్రం అవ్వడంతో వంశీ పైడిపల్లి ప్రతి విషయంలో కూడా ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఉగాది కానుక‌గా 5 ఏప్రిల్ 2019కి సినిమాని రిలీజ్ చేయాల‌ని భావిస్తున్నారు.

Share

Leave a Comment