ఇద్దరు సూపర్‌స్టార్ల సందడి

 

సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు, సినీ ప్రియులు ఎంతగానో ఎదురు చూసిన తరుణం రానే వచ్చింది. మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం వారు రూపొందించిన మహేష్ బాబు మైనపు విగ్రహాన్ని హైదరాబాద్ తీసుకొచ్చారు. ప్రస్తుతం ఈ విగ్రహం హైదరాబాద్ లోని ఏఎంబీ సినిమాస్ మల్టిప్లెక్స్‌లో అభిమానులు సందర్శనార్థం ఉంచారు. కొద్ది సేపటి క్రితమే విగ్రహ ఆవిష్కరణ జరిగింది. ఆ ఫొటో గాలరీ మీ కోసం.

1)

2)

3)

4)

ఈ కార్యక్రమానికి మహేష్ ఫ్యాన్స్ పెద్దఎత్తున తరలి వచ్చి వీక్షించారు. విగ్రహావిష్కరణకు వచ్చిన సూపర్ స్టార్ తన మైనపు బొమ్మతో సెల్ఫీ దిగుతూ సందడి చేశారు. మైనపు బొమ్మ పక్కన మహేష్ నిల్చొని అచ్చం అదే స్టిల్‌తో ఫోజులిచ్చారు. ఈ విగ్రహాన్ని ఒక్క రోజు (సోమవారం -మార్చి 25) మాత్రమే ఇక్కడ ఉంచి.. మరుసటి రోజు సింగపూర్‌లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంకు తరలించనున్నారు. మేడమ్ టుస్సాడ్స్ వారు సింగపూర్‌లో కాకుండా బయటి ప్రాంతంలో ఇలా విగ్రహాన్ని ప్రదర్శించడం, ఇంత గొప్ప కార్యక్రమం చేయడం ఇదే మొదటిసారి.

5)

6)

7)

8)

అనంతరం మీడియా సమావేశంలో పాల్గొన్న మహేష్.. వారడిగిన ప్రశ్నలకు ఆసక్తికరంగా బదులిచ్చారు. తన విగ్రహం రూపొందించడంలో భాగంగా స్కిన్, హెయిర్ స్టైల్, తల, చేతులు మొదలైన కొలతలు తీసుకున్నారని చెప్పారు మహేష్. మీ సెల్ఫీలకు డిమాండ్ తగ్గుతుందని భావిస్తున్నారా? అనే ప్రశ్నకు బదులిస్తూ తనతో సెల్ఫీ దిగినా తన బొమ్మతో సెల్ఫీ దిగినా ఒక్కటే అని ఆయన అన్నారు. తాను సినిమా షెడ్యూల్స్‌తో బిజీగా ఉండటంతో మేడమ్ టుస్సాడ్స్ వారే హైదరాబాద్ వచ్చి విగ్రహావిష్కరణ చేయడం గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు.

9)

10)

11)

12)

విగ్ర‌హాన్ని మ‌లిచిన తీరు చాలా బాగుంది. న‌న్ను నేను చూసుకుంటున్నట్టుగా ఉంది. ఒక‌సారి వాళ్లు ఆ ఫొటోల‌ను నాకు పంపించారు. వాటిని నా భార్య‌తోనూ, కొంత‌మంది స‌న్నిహితుల‌తోనూ పంచుకున్నాను. వాటిని చూసిన వారు నేనేదో సినిమాకు ఫొటో షూట్ చేశాన‌ని అనుకున్నారు. అంత బాగా ఉంది స్టాట్యూ. ప్రాణం పోసిన‌ట్టుగా చేసిన ఇవాన్ రీజ్‌, బెంటానా త‌దిత‌ర టీమ్‌కు ధ‌న్య‌వాదాలు. నాకు నా విగ్ర‌హాన్ని చూస్తుంటే ఆనందంగా, అద్వితీయంగా, గొప్ప‌గా, ఉత్కంఠ‌గా, ఒకింత భ‌యంగా, అన్నీ భావాలు క‌లగ‌లిసిన‌ట్టుగా ఉంది. భార‌త‌దేశానికి చెందిన ప‌లువురు సెల‌బిట్రీల బొమ్మ‌లు అక్క‌డున్నాయ‌ని నాకు తెలుసు. నా ఫ్యామిలీతో క‌లిసి అక్క‌డికి వెళ్లాల‌ని కూడా అనుకుంటున్నాను అని చెప్పారు మహేష్.

13)

14)

15)

16)

Share

Leave a Comment