కొలువైన మహేష్ మైనపు విగ్రహం

సూపర్ స్టార్‌ కున్న క్రేజ్ గురించి సెపరేట్‌గా చెప్పాల్సిన పనిలేదు. మహేష్ బాబు అభిమానులు, సినీ ప్రియులు ఎంతగానో ఎదురు చూసిన తరుణం రానే వచ్చింది. ప్రపంచ ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం వాళ్లు మహేష్ మైనపు విగ్రహాన్ని హైదరాబాద్‌లో ఈ రోజు AMB సినిమాస్‌లో మహేష్ చేతుల మీదుగా తన మైనపు విగ్రహాన్ని ఆవిష్కరింపజేసారు.

అంతేకాదు సూపర్ స్టార్ తన మైనపు బొమ్మతో సెల్ఫీ దిగుతూ సందడి చేశారు. మైనపు బొమ్మ పక్కన మహేష్ నిల్చొని అచ్చం అదే స్టిల్‌తో ఫోజులిచ్చారు. అయితే ఇద్దరు మహేష్‌లను ఒక్కచోట చూసిన అభిమానులు ల ఆనందానికి హద్దులు లేవు. ఇంతకీ ఎవరు నిజం, ఎవరు విగ్రహం అనే అంత అద్భుతంగా చేసారు అని ప్రశంసలు కురిపిస్తున్నారు.

తన భార్య, కూతురు సితార, కొడుకు గౌతమ్ కృష్ణలతో కలిసి మైనపు విగ్రహంతో ఫోటో దిగారు. నలుపు రంగు సూట్ తో ఉన్న ఈ మైనపు విగ్రహం అచ్చుగుద్దినట్లు మహేష్‌బాబు మాదిరిగానే ఉంది. ఒక చేతిని జేబులో పెట్టుకుని, మరో చేతిని గడ్డం కింద పెట్టి నిలుచున్నట్లు ఈ విగ్రహాన్ని రూపొందించారు.

మొత్తానికి మహేష్ బాబు మైనపు విగ్రహంగా కొలువు కావడాన్ని ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు సాయంత్రం ఆరు గంటల వరకు ఈ మైనపు విగ్రహాన్ని ప్రదర్శనకు ఉంచుతారు. విగ్రహాన్ని చూసేందుకు అభిమానులు భారీసంఖ్యలో థియేటర్‌ వద్ద బారులు తీరారు.

విగ్రహా విష్కరణ అనంతరం మహేష్ బాబు మాట్లాడుతూ…ఇది అద్భుతంగా ఉందని, అమేజింగ్ లుక్ అంటూ వ్యాఖ్యానించారు. అభిమానుల సమక్షంలో ఈ విగ్రహావిష్కరణ జరుగడం ఆనందంగా ఉందన్నారు. తనకి ఈ రోజు చాలా మెమరబుల్ డే గా నిలిచిపోతుంది అని హర్షం వ్యక్తం చేసాడు.

నా సొంత నగరంలో… నా అభిమానులు, కుటుంబం సమక్షంలో ఈ విగ్రహావిష్కరణ జరుగడం ఆనందంగా ఉంది అంటూ మహేష్ బాబు వెల్లడించారు. సింగపూర్ బయట ఒక సెలబ్రిటీ వాక్స్ స్టాట్యూని ఆవిష్కరించడం ఇదే తొలిసారి. మహేష్ ఆ మాజాకా నా అని అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ఆ తర్వాత ఈ మైనపు విగ్రహాన్ని సింగపూర్‌లో ఉన్న మేడమ్ టుస్సాడ్స్‌కు తరలిస్తారట. ఇప్పటి వరకు ఏ ఒక్కరి మైనపు విగ్రహాన్ని మేడమ్ టుస్సాడ్స్ కొలువైన ప్రదేశంలో కాకుండా వేరే చోట మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించడం ఇదే మొదటిసారి. టాలీవుడ్ నుంచి తొలిసారి మహేష్ మైనపు బొమ్మ ఇక్కడ కొలువుదీరనుంది.

ఇందులో ఎవరిదైన మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించాలంటే అ మనిషికి సంబంధించిన 200 పైగా కొలతలు తీసుకుంటారు. అంతేకాదు ఆ వ్యక్తికి సంబంధించిన హెయిర్ కలర్, కళ్ల రంగు వంటివి వాటిలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటారు. ప్రపంచ వ్యాప్తంగా మేడమ్ టుస్సాడ్స్‌ మ్యూజియాలు 23 లొకేషన్స్‌లో ఉన్నాయి. ప్రతి ఏట ఈ మైనపు మ్యూజియాలను కోటి మందిపైగా సందర్శిస్తూ ఉంటారు.

సాధారణ అభిమానుల సందర్శించడానికి వీలుంటుందా లేదా అనే ప్రశ్న కు మహేష్ సతీమని నమ్రత గారు క్లారిటీ ఇచ్చారు. అభిమానులందరూ ఎటువంటి ఎంట్రీ ఫీ లేకుండా తమ అభిమాన హీరో ప్రతిమ ని ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల నుండి చూడొచ్చు అని తెలిపారు.

ఇదో అరుదైన సందర్భం కాబట్టి సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ గా ఎగ్జైట్మెంట్ తో ఉన్నారు. మహేష్ మైనపు విగ్రహాన్ని ఏఎంబీ సినిమాస్ లో లాంచ్ చేయడం ద్వారా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఏఎంబీ మాల్ కి గుర్తింపు దక్కింది. సోషల్ మీడియా లో ప్రొద్దున్న నుండీ ట్రెండ్ అవుతూనే ఉంది ఈ టాపిక్.

నేషనల్ మీడియా, స్థానిక మీడియాతో పాటు ఫ్యాన్స్ అంతా పెద్ద ఎత్తున హాజరయ్యి ఈ ఈవెంట్ ని విజయవంతం చేసారు. ఈ రోజు ఫ్యాన్స్ కి పండుగ రోజు అని సోషల్ మీడియా మొత్తం హోరెత్తించారు మహేష్ అభిమానులు. ఈ విగ్రహ ఆవిష్కరణ కి సంబందించిన మరి కొన్ని పిక్స్ మీకోసం..

Share

Leave a Comment