వంద కోట్ల షేర్ దిశగా

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ మహర్షి ఇప్పటికీ తన కలెక్షన్ల హవా కొనసాగిస్తోంది అనే చెప్పాలి. నిజానికి మొదటి రోజు కాస్త మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికి, ఆ టాక్ మెల్లగా పుంజుకుని, విపరీతమైన ప్రేక్షక అభిమానం మరియు కలెక్షన్లతో ప్రస్తుతం బ్లాక్ బస్టర్ హిట్ రేంజికి చేరిపోయింది. విడుదలైన ప్రతి ప్రాంతంలోనూ విజయ విహారం చేస్తోంది.

మహర్షి సాగించిన ఈ పదహారు రోజుల జర్నీలో 16వ రోజు కూడా మంచి కలెక్షన్స్ రాబట్టింది. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో మహర్షి మంచి జోష్ లో ఉంది. 16వ రోజు కలెక్షన్లు 15వ రోజు కంటే కూడా ఎక్కువ ఉండడం విశేషం. 15వ రోజు మన రెండు తెలుగు రాష్ట్రాలలో ఎలక్షన్ రిజల్ట్ సందడి నెలకొన్న సంగతి తెలిసిందే.

ఎలక్షన్ ఎఫెక్ట్ తో 15వ రోజు కలెక్షన్లు మోస్తరుగా వచ్చినా మళ్ళీ 16వ రోజు కలెక్షన్ల తో తన జోరు ఏమాత్రం తగ్గలేదని నిరూపించాడు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి మహర్షి దాదాపు రూ.74 కోట్ల షేర్ ను రాబట్టింది. ఇది నాన్ బాహుబలి రికార్డ్. ఇక ప్రపంచవ్యాప్తంగా మహర్షి షేర్ దాదాపు రూ.98 కోట్లకు చేరుకున్నట్లు సమాచారం.

రాబోయే రోజుల్లో రూ.100 కోట్ల షేర్ మార్క్ చేరుకోవడం పెద్దగా కష్టం ఏమి కాదని అర్ధం అవుతోంది. నిజానికి ఈ సినిమాకు ఇంతటి అద్భుతమైన కలెక్షన్లు రావడానికి కారణం సినిమాలో మంచి కథ, కథనాలు ఉండడమేనని, ఈ రోజున ఈ సినిమా ఇన్ని రికార్డులు బద్దలు కొడుతూ ముందుకు సాగుతుంది అంటే అది సూపర్ స్టార్ మహేష్ బాబు గారి స్టామినా అని అంటున్నారు సినీ విశ్లేషకులు.

16వ రోజు కుడా కొత్త రికార్డులను నెలకొల్పింది మహర్షి. ఉత్తరాంధ్రాలో నిన్నటితో రూ.10 కోట్ల షేర్ ను దాటేసింది. సూపర్ స్టార్ కెరీర్‌లో ఈ ఏరియాలో రూ.10 కోట్ల షేర్ కలెక్ట్ చేసిన రెండో సినిమా మహర్షి. భరత్ అనే నేను తో మొదట ఈ ఘనత సాధించాడు మహేష్. వేరే ఏ హీరోకు కూడా ఉత్తరాంధ్రాలో రెండు రూ.10 కోట్ల షేర్ సినిమాలు లేవు.

ఉత్తరాంధ్రాలో ఇప్పటి వరకు ఎక్కువ కలెక్ట్ చేసిన మహేష్ సినిమా భరత్ అనే నేను. ఈ వీకెండ్ తో ఆ రికార్డును బద్దలుకొట్టి మహేష్ కెరీర్ లో ఉత్తరాంధ్రాలో ఎక్కువ కలేక్ట్ చేసిన సినిమాగా నిలవనుంది మహర్షి. నైజాంలో మహర్షి ఓవరాల్‌ షేర్ రూ.27 కోట్ల షేర్ ను దాటేసింది. కేవలం 14 రోజుల్లోనే ఈ మార్క్ ను అందుకుని నాన్ బాహుబలి రికార్డును సొంతం చేసుకుంది మహర్షి.

ఈ వారాంతం కల్లా నైజాంలో మహర్షి 30 కోట్ల షేర్ మార్క్ ను అందుకోవడం తధ్యం. వైజాగ్, రాజమండ్రి, కాకినాడ, భీమవరం, విజయవాడ, ఏలూరు, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, అనంతపూర్, కర్నూల్, విజయనగరం, వరంగల్, కరీంనగర్ వంటి సెంటర్స్ లో ఈ సినిమా కోటి కలెక్షన్స్ ని రాబట్టింది.

ఇక హైదరాబాద్ లోని ఏరియాల్లో కూడా మహర్షి కోటి రూపాయలను కొల్లగొట్టాడు. ఆర్.టి.సి.క్రాస్ రోడ్స్, దిల్ షుక్ నగర్, ప్రసాద్స్, కేపీహెచ్బి, ఏ ఎం బి సినిమాస్ లో కోటి రూపాయల గ్రాస్ ను అందుకుంది మహర్షి. ఈసి్ఐఎల్ లో కుడా ఈ వారాంతం కల్లా కోటి రూపాయల మార్క్ ను అందుకోనుంది. విజయవాడ లోని క్యాపిటల్ సినిమాస్ లో కూడా కోటి రూపాయలను కొల్లగొట్టాడు మహర్షి.

కాకినాడ, రాజమండ్రి లో మహర్షి కోటి రూపాయల గ్రాస్ కలెక్ట్ చేయడంతో అక్కడ ఈ మార్క్ అందుకున్న మహేష్ మూడో సినిమా అయ్యింది. కాకినాడ లో వేరే ఏ హీరోకి అన్ని కోటి గ్రాసర్లు లేవు. భీమవరంలో కూడా మహర్షి తో మహేష్ కోటి గ్రాసర్ సినిమాల సంఖ్య నాలుగు కి చేరింది. ఇది సిటీ ఆల్ టైం రికార్డ్. ఏలూరులో కూడా ఒక కొత్త రికార్డును నెలకొల్పాడు మహేష్.

మహర్షితో తన కోటి రూపాయల గ్రాసర్ సినిమాల సంఖ్య ను మూడుకు చేర్చాడు. వేరే ఏ హీరోకి ఇక్కడ అన్ని కోటి గ్రాసర్లు లేవు. రెస్టాఫ్ ఇండియాలో కూడా మహర్షి తన సత్తా చూపిస్తున్నాడు. కర్నాటక లో కూడా మహర్షి కి అదిరిపోయే కలెక్షన్లు దక్కుతున్నాయి. మహేష్ బాబు కెరీర్ పరంగా కేవలం రెండు వారాల్లో 90 కోట్ల రూపాయల షేర్ రాబట్టిన రెండో సినిమాగా మహర్షి రికార్డు సృష్టించింది.

గతంలో ఈ ఫీట్ ని భరత్ అనే నేను సినిమా సాధించింది. మహర్షి పరుగులు చూస్తుంటే మహేష్ కెరీర్ లో ఈ సినిమా బిగ్గెస్ట్ మైల్ స్టోన్ అవుతుందని తెలుస్తోంది. వరుసగా రెండు బ్లాక్‌బస్టర్ హిట్స్ ని ఇచ్చి సూపర్ స్టార్ తన ఫ్యాన్స్ ని ఖుషి చేశారు. తన సిల్వర్ జూబ్లీ సినిమా తో మహేష్ కొత్త రికార్డులను నమోదు చేయడం పట్ల అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

పదహారు రోజులు అవుతున్నా మహర్షి కి ఆదరణ ఏమాత్రం తగ్గలేదు. బాక్సాఫీస్ దగ్గర అదే జోరును చూపిస్తున్నాడు. మహేష్ బాబు గత చిత్రం భరత్ అనే నేను రూ. 200 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసిన సంగతి తెలిసిందే. ఫుల్ రన్‌లో మహర్షి రూ.200 కోట్లను అందుకోవడమే కాకుండా సూపర్ స్టార్ కెరీర్ లోనే హయ్యెస్ట్ గ్రాసర్ గా నిలవడం ఖాయం.

వంశీ పడిపైల్లి ఈ సినిమాను తెరకెక్కించగా అశ్వనీదత్, పీవీపీ, దిల్ రాజు నిర్మాతలుగా వ్యవహరించారు. ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా దుమ్మురేపే కలెక్షన్లతో పాటు ప్రముఖుల ప్రశంసలను కూడా అందుకుంటోంది. నిజమైన మంచి సినిమాకు పట్టం కడతారు అని చెప్పడానికి మహర్షి కలెక్షన్స్ ఒక సమాధానమని బాక్సాఫీస్ పండితులు తమ అభిప్రాయాన్ని వ్యక్త పరుస్తున్నారు.

మహర్షి సక్సెస్‌ తర్వాత ఫ్యామిలీతో కలసి మహేష్ ఫారిన్‌ ట్రిప్‌ వెళ్లిన సంగతి తెలిసిందే. 20 రోజుల పాటు సాగే ఈ ట్రిప్‌లో పోర్చుగల్, ఇంగ్లాండ్‌ చుట్టి రానున్నారు మహేష్. ట్రిప్‌లోని ఆనంద క్షణాలను ఎప్పటికప్పుడు మహేష్ సతీమణి నమ్రత తన సోషల్‌ మీడియా ఖాతా ద్వారా అభిమానులతో షేర్‌ చేస్తున్నారు. ఆ ఫొటోలన్నీ వైరల్ గా మారుతున్నాయి.

తిరిగొచ్చాక అనీల్ రావిపూడితో క‌లిసి మ‌హేష్ త‌న 26వ సినిమా చేయ‌నున్నారు. గత రెండు సినిమాలకు చాలా గ్యాప్ తీసుకున్న మహేష్ ఈ సారి మాత్రం త్వరగానే ప్రేక్షకుల ముందుకు రావాలని డిసైడ్ అయిపోయారు. ఇందుకోసం మహర్షి సెట్స్ పైన ఉండగానే సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో మరో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా త్వరలోనే పట్టాలెక్కనుంది. ఈ ఏడాది చివరికి షూటింగ్ ఫినిష్ చేసి 2020 సంక్రాంతికి విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

Share

Leave a Comment