మహర్షి 16రోజుల రికార్డులు

సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ సూపర్ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ మూవీ మహర్షి, రెండు వారాలు పూర్తి చేసుకుని మూడవ వారంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. అయినా ఇప్పటికీ కూడా అన్ని చోట్ల మంచి కలెక్షన్లు సాధిస్తూ దూసుకుపోతుంది మహర్షి. విడుదలైన ప్రతి ప్రాంతంలోనూ విజయ విహారం చేస్తోంది. ఇప్పటివరకు మహర్షి 16 రోజుల జర్నీ పూర్తి చేసుకుంది.

ఈ పదహారు రోజుల జర్నీలో 16వ రోజు కూడా మంచి కలెక్షన్స్ రాబట్టింది. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో మహర్షి మంచి జోష్ లో ఉంది. 16వ రోజు కలెక్షన్లు 15వ రోజు కంటే కూడా ఎక్కువ ఉండడం విశేషం. మహర్షి తో ఈ పదహారు రోజుల్లో సూపర్ స్టార్ ఎన్నో రికార్డులను బద్దలుకొడుతూ తన సత్తా చూపిస్తున్నాడు. వాటి వివరాలు మీ కోసం.

ఈస్ట్ గోదావరిలో మహర్షి జోరు మామూలుగా లేదు. ఇక్కడ ఒక అరుదైన రికార్డును మహేష్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటికి మహర్షి రూ.7 కోట్ల కు పైగా షేర్ ను వసూలు చేసి కొత్త చరిత్రను రాసింది. ఈస్ట్ గోదావరిలో రూ.6 కోట్ల కు పైగా షేర్ ఉన్న మహేష్ సినిమాల సంఖ్య మూడు కి చేరింది. ఈ ఘనత సాధించిన ఒకే ఒక్క హీరో మన సూపర్ స్టార్.

ఇక్కడ భరత్ అనే నేను కూడా రూ.7 కోట్ల కు పైగా షేర్ ను కొల్లగొట్టింది. మహర్షి తో మహేష్ బ్యాక్ టు బ్యాక్ రెండు రూ.7 కోట్ల కు పైగా షేర్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇంకా నిజామాబాద్ లో కూడా ఒక కొత్త చరిత్ర ను లిఖించుకున్నాడు మహేష్. మహర్షి తో ఇక్కడ తన తొలి కోటి రూపాయల గ్రాసర్ ను తన ఖాతాలో జమ చేసుకున్నాడు.

నైజాంలో తన దూకుడు ను కొనసాగిస్తున్నాడు మహేష్. మహర్షి ఓవరాల్‌ షేర్ రూ.27 కోట్ల షేర్ ను దాటేసింది. ఈ వారాంతం కల్లా నైజాంలో మహర్షి రూ.30 కోట్ల షేర్ మార్క్ ను అందుకోవడం తధ్యం. ఒక్క హైదరాబాద్ లోని ఆర్.టి.సి.క్రాస్ రోడ్స్ లోనే 16 రోజులకు రూ.1.19 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. ఇంకా హైదరాబాద్ లోని అనేక చోట్ల కోటి రూపాయల గ్రాస్ ను కొల్లగొట్టింది మహర్షి.

దిల్ షుక్ నగర్, ప్రసాద్స్, కేపీహెచ్బి, ఏఎంబి సినిమాస్ లో కోటి రూపాయల గ్రాస్ ను అందుకుంది మహర్షి. ఈసి్ఐఎల్ లో కుడా ఈ వారాంతం కల్లా కోటి రూపాయల మార్క్ ను అందుకోనుంది. ఉత్తరాంధ్రాలో నిన్నటితో రూ.10 కోట్ల షేర్ ను దాటేసింది. సూపర్ స్టార్ కెరీర్‌లో ఈ ఏరియాలో రూ.10 కోట్ల షేర్ కలెక్ట్ చేసిన రెండో సినిమా మహర్షి.

భరత్ అనే నేను తో మొదట ఈ ఘనత సాధించాడు మహేష్. వేరే ఏ హీరోకు కూడా ఉత్తరాంధ్రాలో రెండు రూ.10 కోట్ల షేర్ సినిమాలు లేవు. ఉత్తరాంధ్రాలో ఇప్పటి వరకు ఎక్కువ కలెక్ట్ చేసిన మహేష్ సినిమా భరత్ అనే నేను. ఈ వీకెండ్ తో ఆ రికార్డును బద్దలుకొట్టి మహేష్ కెరీర్ లో ఉత్తరాంధ్రాలో ఎక్కువ కలేక్ట్ చేసిన సినిమాగా నిలవనుంది మహర్షి.

వైజాగ్, రాజమండ్రి, కాకినాడ, భీమవరం, విజయవాడ, ఏలూరు, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, అనంతపూర్, కర్నూల్, విజయనగరం, వరంగల్, కరీంనగర్, విజయవాడ లోని క్యాపిటల్ సినిమాస్ వంటి సెంటర్స్ లో ఈ సినిమా కోటి కలెక్షన్స్ ని రాబట్టింది. భీమవరంలో మహర్షి తో మహేష్ కోటి గ్రాసర్ సినిమాల సంఖ్య నాలుగు కి చేరింది. ఇది సిటీ ఆల్ టైం రికార్డ్.

ఏలూరులో కూడా ఒక కొత్త రికార్డును నెలకొల్పాడు మహేష్. మహర్షితో తన కోటి రూపాయల గ్రాసర్ సినిమాల సంఖ్య ను మూడుకు చేర్చాడు. వేరే ఏ హీరోకి ఇక్కడ అన్ని కోటి గ్రాసర్లు లేవు. అమలాపురం లో నాన్ బాహుబలి రికార్డు దిశగా దూసుకెళ్తుంది మహర్షి. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి మహర్షి దాదాపు రూ.74 కోట్ల షేర్ ను రాబట్టింది. ఇది నాన్ బాహుబలి రికార్డ్.

ఇక ప్రపంచవ్యాప్తంగా మహర్షి షేర్ దాదాపు రూ.98 కోట్లకు చేరుకున్నట్లు సమాచారం. రాబోయే రోజుల్లో రూ.100 కోట్ల షేర్ మార్క్ చేరుకోవడం పెద్దగా కష్టం ఏమి కాదని అర్ధం అవుతోంది. మహేష్ బాబు కెరీర్ పరంగా కేవలం రెండు వారాల్లో 90 కోట్ల రూపాయల షేర్ రాబట్టిన రెండో సినిమాగా మహర్షి రికార్డు సృష్టించింది.

గతంలో ఈ ఫీట్ ని భరత్ అనే నేను సినిమా సాధించింది. మహర్షి పరుగులు చూస్తుంటే మహేష్ కెరీర్ లో ఈ సినిమా బిగ్గెస్ట్ మైల్ స్టోన్ అవుతుందని తెలుస్తోంది. వరుసగా రెండు బ్లాక్‌బస్టర్ హిట్స్ ని ఇచ్చి సూపర్ స్టార్ తన ఫ్యాన్స్ ని ఖుషి చేశారు. తన సిల్వర్ జూబ్లీ సినిమా తో మహేష్ కొత్త రికార్డులను నమోదు చేయడం పట్ల అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

మహర్షి సక్సెస్‌ తర్వాత ఫ్యామిలీతో కలసి మహేష్ ఫారిన్‌ ట్రిప్‌ వెళ్లిన సంగతి తెలిసిందే. 20 రోజుల పాటు సాగే ఈ ట్రిప్‌లో పోర్చుగల్, ఇంగ్లాండ్‌ చుట్టి రానున్నారు మహేష్. ట్రిప్‌లోని ఆనంద క్షణాలను ఎప్పటికప్పుడు మహేష్ సతీమణి నమ్రత తన సోషల్‌ మీడియా ఖాతా ద్వారా అభిమానులతో షేర్‌ చేస్తున్నారు. ఆ ఫొటోలన్నీ వైరల్ గా మారుతున్నాయి.

తిరిగొచ్చాక అనీల్ రావిపూడితో క‌లిసి మ‌హేష్ త‌న 26వ సినిమా చేయ‌నున్నారు. మహర్షి సెట్స్ పైన ఉండగానే సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో మరో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా త్వరలోనే పట్టాలెక్కనుంది. ఈ ఏడాది చివరికి షూటింగ్ ఫినిష్ చేసి 2020 సంక్రాంతికి విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

Share

Leave a Comment