మహర్షి కలెక్షన్ రిపోర్ట్

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన ‘మహర్షి’ చిత్రం మే 9 న రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ బరిలో దూసుకెళుతోంది. నిన్నటితో ఈ సినిమా విడుదలై 34 రోజులు పూర్తయ్యాయి. రేపటి నుంచి ఆరో వారంలోకి అడుగుపెడుతున్న మహర్షి తన జోరును ఏమాత్రం తగ్గించడం లేదు. ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు నుండి బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతుంది.

ఇప్పటికే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 32 రోజుల్లో రూ.107 కోట్లకు పైగా డిస్ట్రిబ్యూటర్ షేర్ ను వసూలు చేసి సూపర్ స్టార్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ వైపు దూసుకుపోతుంది. మహర్షి తో సూపర్‌స్టార్ కెరీర్ లో రెండో 100 కోట్ల షేర్ సినిమా ఖాతాలో యాడ్ అయ్యింది. ఇంతకు ముందు భరత్ అనే నేను ఈ ఘనతను సాధించిన సంగతి తెలిసిందే.

ఉత్తరాంధ్రాలో తన డ్రీమ్ రన్ ను కొనసాగిస్తుంది మహర్షి. 34 రోజులకు రూ.12.19 కోట్లకు పైగా షేర్ సాధించి సూపర్ స్టార్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది మహర్షి. వెస్ట్ గోదావరిలో కూడా ఇదే జోరుతో దూసుకుపోతుంది మహర్షి. భీమవరం లో మహర్షి ఒక అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఇక్కడ విడుదలైన దగ్గర నుంచి వరుసగా 34 రోజులు లక్ష రోపాయల గ్రాస్ ను కొల్లగొట్టింది మహర్షి.

ఇది వరకు బాహుబలి2 33 రోజుల పాటు ఈ మార్క్ ను అందుకుంది. ఇక ఏలూరు లో 33 రోజులకు రూ.1.31 కోట్లకు పైగా గ్రాస్ ను కలెక్ట్ చేసింది మహర్షి. నైజాంలో సూపర్ స్టార్ కు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయిదో వారం నైజాంలో మహర్షి సినిమా ఇంకా 99 థియేటర్లలో నడుస్తుందంటే అది సూపర్ స్టార్ కు ఉన్న ఫాలోయింగ్ కి చిహ్నం.

నైజాంలో మహర్షి 32రోజులకే రూ.31 కోట్ల షేర్ ను కొల్లగొట్టి బాహుబలి సినిమాల తరువాత ఈ ఘనత సాధించిన సినిమాగా రికార్డు నెలకొల్పింది. మహేష్ థియేటర్ ఏ.ఎం.బి సినిమాస్ లో అయితే మహర్షి కి కళ్ళు చెదిరే కలెక్షన్లు వస్తున్నాయి. ఇక్కడ 370 షోలకు 93.2 శాతం ఆక్యుపెన్సీతో రూ.1.75 కోట్లకు పైగా గ్రాస్ ను కొల్లగొట్టి రెండు కోట్ల వైపు పరుగులు పెడుతుంది మహర్షి.

సూపర్ ఫ్యాన్స్ ఫ్యావెరెట్ థియేటర్ సుదర్శన్ 35 ఎం.ఎం లో మహర్షి కోటి రూపాయల గ్రాస్ వైపు దూసుకుపోతుంది. నిజామాబాద్ లో అయితే మహర్షి భారీ రికార్డును నెలకొల్పింది. ఇక్కడ బాహుబలి 1 ను దాటి బాహుబలి 2 తరువాత రెండో స్థానలో ఉంది మహర్షి. కరీంనగర్ లో 22 రోజులకే బాహుబలి తరువాతి స్థానాన్ని చేజిక్కించుకుంది మహర్షి.

రెస్టాఫ్ ఇండియాలో కూడా తన సత్తాను చూపించాడు మన సూపర్ స్టార్. బెంగళూరు నగరంలో ఈ సినిమాకు వస్తున్న ఆదరణ చూస్తుంటే అందరికీ చాలా ఆనందంగా ఉంది. బెంగళూర్ సిటీ మీనాక్షి థియేటర్లో మహర్షి కేవలం నాలుగు వారాల్లోనే 34 లక్షల 79 వేలు వసూలు చేసి నెంబర్ 1 సౌత్ ఇండియన్ గ్రాసర్ గా నిలవనుంది అని తెలుస్తుంది.

ఇదొక్కటే కాకుండా బెంగళూరు సిటీ మొత్తం లాంగ్ రన్ లో దాదాపు 6 కోట్లు వసూలు చేయబోయే ఏకైక సినిమాగా మహర్షి మరో రికార్డు నమోదు చేసేందుకు అవకాశం ఉందని కూడా ట్రేడ్ పండితులు చెప్తున్నారు. మొత్తంమీద బెంగళూరు నగరంలో ఏ సౌత్ హీరో సృష్టించని రికార్డులు సృష్టిస్తున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు.

నేషనల్ మల్టీప్లెక్స్ లలో గత అయిదు వారాంతాల్లో ఎక్కువ మంది చూసిన సినిమాగా మహర్షి నిలిచింది. ఈ వారం రంజాన్ స్పెషల్ గా సల్మాన్ ఖాన్ నటించిన ‘భారత్’ విడుదల అయ్యింది. అయినా కూడా భారత్ ని వెనుకకి నెడుతూ ఈ వీకెండ్ కూడా మొదటి స్థానంలో నిలిచింది మహర్షి. సల్మాన్ ఖాన్ సినిమా మొదటి వీకెండ్ ఆక్యుపెన్సీ ని అయిదో వారంలో ఉన్న మహేష్ బాబు సినిమా దాటేసింది అనమాట.

ఈ ఘనాంకాలు ఇండియా మొత్తంలో ఉన్న మల్టీప్లెక్స్ లవి. ఇది మహేష్ బాబు కు దేశవ్యాప్తంగా ఉన్న ఫాలోయింగ్ మరియు క్రేజ్ కు నిదర్శనంగా చెప్పవచ్చు. మహర్షి అయిదు వారాలుగా నెంబర్ వన్ గా కొనసాగుతుందంటే ఆ ఘనత సూపర్‌స్టార్ మహేష్ బాబు దే అని చెప్పాలి. నాలుగో వీకెండ్ కన్నా అయిదో వీకెండ్ కి ఆక్యుపెన్సీ పెరగడం గమనార్హం.

నాలుగో వీకెండ్ 62 శాతం ఉంటే అయిదో వీకెండ్ కి అది 64 శాతం కు చేరింది. అంటే దాదాపు రెండో వీకెండ్ కు సమానం అనమాట. మహర్షి కి ఇంకా ఈ రేంజ్ లో ఆదరణ లభిస్తుందంటే అది మహేష్ స్టార్‌డమ్ వల్లే అని అందరూ ఒప్పుకునే నిజం. మహేష్ స్టార్ పవర్ కి మంచి కథ కూడా తోడవడంతో మహర్షి జనాల్లోకి అంతలా చొచ్చుకుపోయింది.

ఇలాంటి ఎన్నో రికార్డులను సృష్టిస్తుంది మహర్షి. చూస్తుంటే మహర్షి జోరు ఇప్పటిలో ఆగేలా లేదు. మరో వారం రోజులు ఈ సినిమా జోరుగానే వసూళ్లు రాబడుతుందని అంటున్నారు ట్రేడ్ పండితులు. రైతులకు సరైన గౌరవాన్ని ఇవ్వాలని, వారిని దోచుకుంటున్న దళారీలను తరిమి కొట్టేది సామాన్య ప్రజలే అని ఎన్నో మంచి విషయాలు ఈ చిత్రంలో చూపించారు.

వారాంతపు వ్యవసాయం, సామాజిక సమస్యల నేపథ్యంలో తెరకెక్కిన మహర్షి అందరి ప్రశంసలు అందుకుంటుంది. మహర్షి సక్సెస్‌ తర్వాత ఫ్యామిలీతో కలసి మహేష్ ఫారిన్‌ ట్రిప్‌ వెళ్లిన సంగతి తెలిసిందే. ఇంగ్లాండ్ లో ఇండియా క్రికెట్ ప్రపంచ కప్ మ్యాచ్ ను మహేష్ చూసిన సంగతి తెలిసిందే. తిరిగొచ్చాక అనీల్ రావిపూడితో క‌లిసి మ‌హేష్ త‌న 26వ సినిమా సరిలేరు నీకెవ్వరు షూటింగ్ లో పాల్గొననున్నారు.

ఇందులో రష్మికా మండన్నా కథానాయికగా నటిస్తారు. దిల్‌ రాజు, రామబ్రహ్మం సుంకర, మహేష్ బాబు నిర్మించనున్న ఈ సినిమా ఇటీవల ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇందులో మహేష్ బాబు ఆర్మీ మేజర్‌గా నటించనున్నారు. ఈ చిత్రం తొలి షెడ్యూల్‌ను చిత్రబృందం కశ్మీర్‌లో ప్లాన్‌ చేస్తోందని తెలిసింది. దీనిపై అధికారిక ప్రకటన వెలువడలేదు.

విజయశాంతి, రాజేంద్రప్రసాద్‌, జగపతిబాబు కీలక పాత్రలు చేయనున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిచనున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలనుకుంటున్నారు. సరిలేరు నీకెవ్వరు పై ఇంకా షూటింగ్ కూడా మొదలవకుండానే అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. వాటిని అనిల్ రావిపూడి ఎలా అందుకుంటారో తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

Share

Leave a Comment