యాక్షన్ మూడ్‌లో మహర్షి

సినీ అభిమానులు అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న సూపర్ స్టార్ మహేష్ బాబు 25వ సినిమా ‘మహర్షి’ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా మొత్తం షూటింగ్ ఈ నెలాఖరకు లేదా మార్చి మొదటి వారంలో పూర్తి కానుంది.

ఇటీవలే పోలాచ్చి షెడ్యూల్ ని పూర్తి చేసుకొని వచ్చిన మహర్షి టీం పైదరాబాద్ లో తదుపరి షెడ్యూల్ ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం మహర్షి షూటింగ్ హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటిలో జరుగుతుంది. ఇక్కడ ఈ నెల 14 వరకు షూటింగ్ కొనసాగనుందని సమాచారం.

అందుతున్న సమాచారం ప్రకారం ప్రస్తుతం ఒక యాక్షన్ సన్నివేశాన్ని రామోజీ ఫిలిం సిటిలో వేసిన సెట్ లో చిత్రీకరిస్తున్నారు. అంటే మహేష్ యాక్షన్ మోడ్ లోకి వచ్చేసారనమాట. దీనిపై అధికారిక ప్రకటన ఏమీ లేదు. షూటింగ్ కి వెళ్ళిన ఫ్యాన్స్ ఇచ్చిన సమాచారం మాత్రమే.

ఈ యాక్షన్ సీన్ షూట్ పూర్తి అయిపోయిన తర్వాత లోని ఈ ప్రస్తుత షెడ్యూల్ ముగుస్తుందని సమాచారం. తరువాత మళ్ళీ ఇంకో షెడ్యూల్ హైదరాబాద్ లోనే మొదలవుతుంది. ఈ షెడ్యూల్ లో ఇంకో యాక్షన్ సీన్ ని తెరకెక్కిస్తారట. అంటే మహర్షి మొత్తం యాక్షన్ మోడ్ లోకి వచ్చేసాడనమాట.

సూపర్ స్టార్ మహేష్ సినిమా అంటే అదిరిపోయే యాక్షన్ ఎపిసోడ్స్ ను ఆశిస్తారు సినీ అభిమానులు. యాక్షన్ సన్నివేశాల్లో మహేష్ ఇంటెన్సిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పైగా ఇది సూపర్ స్టార్ 25వ సినిమా. దర్శకుడు వంశీ పైడిపల్లి మహేష్ ను యాక్షన్ సీన్స్ లో ఎలా చూపిస్తాడో అని అభిమానులకు భారీ అంచనాలు ఉన్నాయి.

దిల్ రాజు, అశ్విని దత్, పివిపి సినిమా సంస్థలు కలిసి ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్నారు. మహేష్ బాబు స్నేహితుడిగా అల్లరి నరేష్ నటిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 25 న రిలీజ్ కానుంది అని దిల్ రాజు ప్రకటించారు.

ఇంతవరకు మహర్షి సినిమా ఎలా ఉంటుందో అన్న విషయం మాత్రం ఎక్కడ బయట రాలేదు. కానీ నిర్మాత దిల్ రాజు రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూ లో సినిమా ఎలా ఉండబోతుంది అని ఓ హింట్ ఇచ్చారు. ఆయన చెప్పిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి. అసలు ఆయన ఏమి చెప్పారు?

మహర్షి సినిమా చూసి బయటికి వచ్చేవారు బరువైన హృదయంతో బయటకు వస్తారు అని అంటున్నారు దిల్ రాజు. ఫామిలీ ఎమోషన్స్ , ఫ్రెండ్ షిప్ లో ఉండే ఎమోషన్, సొసైటీ లో ఉండే ఎమోషన్ అన్ని మహర్షి సినిమాలో ఉంటున్నాయని రాజు అంటున్నారు. అసలు మహర్షి ఎవరు? ఆయన ఎందుకు మహర్షి గా మారుతారు? అనేది సినిమాలో చూడాలని అంటున్నారు దిల్ రాజు.

మహేష్ బాబు కెరీర్లో ఇది 25వ చిత్రం. కేవలం ల్యాండ్ మార్క్ మూవీ అయినంత మాత్రాన ఏ సినిమా ఆడదు. కథ బావుంటే ఆడుతుంది. ‘మహర్షి’ బాక్సాఫీసు వద్ద మ్యాజిక్ చేస్తుందని నేను కచ్చితంగా చెప్పగలను. దర్శకుడు వంశీ స్క్రిప్టు రాసుకున్న విధానం, మహేష్ బాబు క్యారెక్టర్ డిజైన్ చేసిన తీరు చాలా బావుంటుందని దిల్ రాజు తెలిపారు.

షూటింగ్ పరంగా ఈ సినిమా ముగింపు దశకి చేరుకోవడంతో రెండు రోజుల క్రితం పూజా కార్యక్రమాలతో డబ్బింగ్ పనులను కూడా మొదలెట్టేశారు. అల్లరి నరేష్, వంశీ పైడిపల్లి, నిర్మాత దిల్‌రాజు తదితరులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. త్వరలో మహేష్ బాబు కూడా తన పాత్రకి డబ్బింగ్ ను పూర్తి చేస్తారు.

మ‌హేష్‌కి 2019 కెరీర్ ప‌రంగా ఎంతో స్పెష‌ల్ అనే చెప్పాలి. ఎందుకంటే ఒకే సంవ‌త్స‌రంలో కెరీర్ ప‌రంగా రెండు మైలురాళ్ళ‌కు చేరుకుంటున్నాడీ రాజ‌కుమారుడు. మ‌హేష్ క‌థానాయ‌కుడిగా న‌టించిన మొద‌టి సినిమా `రాజకుమారుడు` విడుద‌లై ఈ ఏడాది జూలై 30కి 20 ఏళ్ళు పూర్త‌వుతోంది.

అంటే హీరోగా మ‌హేష్ రెండు ద‌శాబ్దాల ప్రయాణాన్ని పూర్తిచేసుకుంటున్నాడ‌న్న‌మాట‌. ఇక‌ ఈ ఏప్రిల్ 25న రానున్న `మ‌హ‌ర్షి`తో క‌థానాయ‌కుడిగా 25 చిత్రాల ప్ర‌యాణాన్ని పూర్తి చేసుకుంటున్నాడు ఈ డేరింగ్ అండ్ డాషింగ్ సూపర్ స్టార్. మొత్తానికి 2019లో రెండు మైలురాళ్ళ‌కి చేరుకుంటూ అభిమానుల‌కు ఆనందాన్ని ఇస్తున్న మ‌హేష్‌ `మ‌హ‌ర్షి`తో మ‌రో కెరీర్ బెస్ట్ హిట్ అందుకోవాల‌ని ఆశిద్దాం.

Share

Leave a Comment