ఈ వెర్షన్ అదిరింది

సూపర్‌ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం మహర్షి. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలు ఇటీవలే ప్రారంభమయ్యాయి. ఉగాది పండుగను పురస్కరించుకుని టీజర్‌ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్‌. ఈ టీజర్ సోషల్ మీడియాలో సరికొత్త రికార్డ్‌లను నెలకొల్పుతూ దూసుకుపోతుంది.

ఇప్పుడు మహర్షి మరో టీజర్ వైరల్ గా మారింది. అది మరేదో కాదు మహేష్‌ ఫ్యాన్స్ కొందరు ఈ టీజర్‌ కు యానిమేటెడ్‌ వర్షన్‌ ను రూపొందించారు. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఈ టీజర్ కు అద్బుతమైన రెస్పాన్స్ వస్తోంది. టీజర్‌లోని సీన్స్‌, క్యారెక్టర్స్‌ను 2డీ యానిమేషన్‌లో రూపొందించిన ఈ టీజర్‌ సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.

దీన్ని చూసిన దర్శకుడు వంశీ పైడిపల్లి ట్విటర్‌లో స్పందించారు. యానిమేటెడ్‌ వెర్షన్‌ అద్భుతంగా ఉందని మెచ్చుకున్నారు. ‘వీడియో అమేజింగ్‌గా ఉంది. మీరు (అభిమానులు) ప్రతి సినిమాను ప్రత్యేకం చేస్తుంటారు. మీకు రుణపడి ఉన్నాం. ఈ వీడియోను తయారు చేసిన మహేష్ బాబు ఫ్యాన్స్‌కు ధన్యవాదాలు’ అని వంశీ పేర్కొన్నారు.

ఈ యానిమేషన్ టీజర్ అచ్చు గుద్దినట్లు ఒరిజినల్ టీజర్ లాగానే ఉంది. అసలు ఇంత మంచి క్వాలిటీ యానిమేషన్ ను చేయడం ఇంత సులువా అన్నట్లు ఈ వీడియోను రూపొందించారు. మహేష్ బాబు వీరాభిమాని శ్రవణ్ ఈ యానిమేషన్ టీజర్ ను రూపొందించారు. ఇంత మందిని ఆకర్షిస్తున్న ఆ యానిమేషన్ టీజర్ ను మీరు కూడా ఒకసారి చూసేయ్యండి.

ఈ యానిమేషన్ ఎంత అద్భుతంగా చేసాడో ఈ స్క్రీన్ షాత్స్ ను చూస్తే మీకే అర్థమవుతుంది.

1)

2)

3)

4)

5)

6)

ఇప్పటికే మహర్షి నుంచి మొదటి పాట విడుదలైన సంగతి తెలిసిందే. ఛోటీ ఛోటీ బాతే అనే పల్లవితో మొదలయ్యే ఈ పాట ఇన్‌స్టంట్ చార్ట్‌బస్టర్ గా నిలిచింది. ఇక ఇప్పుడు మహర్షి రెండో సింగిల్ గురించి అప్‌డేట్ వచ్చేసింది. రెండో పాట రేపే విడుదల కాబోతుందని అధికారికంగా ఇప్పుడే సినిమా నిర్మాతలు ప్రకటించారు.

‘మొదటి పాట ఛోటీ ఛోటీ బాతేకి మరియు టీజర్ కి మీ నుంచి వచ్చిన అద్భుతమైన రెస్పాన్స్ కి చాలా థ్యాంక్స్. మహర్షి నుంచి రెండో పాట రేపు అంటే 12 ఏప్రిల్ సాయంత్రం 4 గంటల 5 నిముషాలకు మీ ముందుకు రాబోతుంది. ఈ రోజు సాయంత్రం 4 గంటల 5 నిముషాలకు దర్శకుడు వంశీ పైడిపల్లి ట్విట్టర్ ఖాతాను అప్‌డేట్ కోసం చూడండి’ అని ట్వీట్ చేసారు మహర్షి నిర్మాతల్లో ఒకరైన శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్.

అంటే ఈ రోజు సాయంత్రం ఆ రెండో పాట ఏంటో దర్శకుడు వంశీ పైడిపల్లి ప్రకటించే అవకాశం ఉందనమాట. దాంతో పాటు ఒక కొత్త కొత్త పోస్టర్ కూడా వస్తుందేమో అని సూపర్ స్టార్ అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. 25వ సినిమా పై ఉండే అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా పాటలు ఉండాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

ఈ అంచనాలను మొదటి పాట ఛోటీ ఛోటీ బాతే అందుకుందనే చెప్పాలి. ఇక ఇప్పుడు అందరూ రెండో పాట కోసం వెయ్‌టింగ్. ఈ పాట కూడా చార్ట్‌బస్టర్ గా నిలవడం ఖాయమని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. మహేష్‌బాబు పోషించిన రిషి పాత్ర ప్రయాణమే ‘మహర్షి’ సినిమా. సినిమాలో మూడు విభిన్న కాలాలు ఉంటాయి.

అందుకే, మహేష్ మూడు విభిన్న షేడ్స్‌లో కనిపిస్తారు. మహర్షి సినిమాలో పూజా హెగ్డే కథానాయిక పాత్ర పోషిస్తున్నారు. మహేష్ స్నేహితుడి పాత్రలో అల్లరి నరేష్‌ నటిస్తున్నారు. మీనాక్షి దీక్షిత్‌, సోనాల్‌ చౌహాన్‌, జగపతిబాబు, సాయికుమార్, ప్రకాశ్‌రాజ్‌, పోసాని, రావు రమేశ్‌ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.

దిల్‌రాజు, అశ్వినీ దత్‌, ప్రసాద్‌ వి పొట్లూరి నిర్మిస్తున్నారు. మే 9న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. విడుదలకు ముందే ఇన్ని రికార్డులను సృష్టిస్తున్న మహర్షి ఇక విడుదల తరువాత ఇండస్ట్రీ రికార్డులను తిరగరాయడం ఖాయం అని ట్రేడ్ వర్గాల మాట.

Share

Leave a Comment