తిరుగులేని మహర్షి రికార్డ్

సూపర్‌స్టార్ మహేష్ బాబు నటించిన ‘మహర్షి’ సినిమా మే 9 న రిలీజ్ అయ్యి ప్రేక్షకుల నుండి అద్భుతమైన్స్ రెస్పాన్స్ ని అందుకుంది. ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు నుండి బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతుంది. ముఖ్యమైన అన్ని సెంటర్లలో కొత్త రికార్డులను లిఖిస్తూ ముందుకు సాగిపోతుంది మహర్షి. ముఖ్యంగా ఇండియాలో మహర్షి సినిమాకి బ్రహ్మరథం పడుతున్నారు ప్రేక్షకులు.

సినిమా లెంగ్త్ కొంచెం ఎక్కువగా ఉన్నప్పటికీ సినిమాకు వస్తున్న కలెక్షన్లు చూస్తుంటే మతి పోతుంది అని కామెంట్ చేస్తున్నారు ట్రేడ్ వర్గాలకు సంబంధించిన వారు. తెలుగు రాష్ట్రాలలో సరి కొత్త రికార్డులను నెలకొల్పుతూ ఇంకా దూసుకెళ్తూనే ఉంది మహర్షి. రెస్టాఫ్ ఇండియాలో కూడా తన సత్తాను చూపించాడు మన సూపర్ స్టార్. బెంగళూరు నగరంలో ఈ సినిమాకు భారీ ఆదరణ లభిస్తుంది.

ఎన్నో రికార్డులను తిరగరాస్తున్న మహర్షి బెంగళూరు నగరంలో ప్రత్యేకమైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. బెంగళూరు నగరంలో అయిదు వారాలకు బాహుబలి సినిమాల తరువాత ఎక్కువ షోలు ప్రదర్శించిన సినిమాగా సరికొత్త రికార్డును లిఖించింది మహర్షి. అయిదు వారాల్లో 5595 షోలతో మహర్షి కొత్త చరిత్రను రాసింది.

బెంగళూర్ మీనాక్షి థియేటర్లో మహర్షి కేవలం నాలుగు వారాల్లోనే 34 లక్షల 79 వేలు వసూలు చేసి నెంబర్ 1 సౌత్ ఇండియన్ గ్రాసర్ గా నిలిచింది. మొత్తం లాంగ్ రన్ లో దాదాపు 6 కోట్లు వసూలు చేయబోయే ఏకైక సినిమాగా మహర్షి మరో రికార్డు నమోదు చేసేందుకు అవకాశం ఉందని కూడా ట్రేడ్ పండితులు చెప్తున్నారు. మొత్తంమీద బెంగళూరు నగరంలో ఏ సౌత్ హీరో సృష్టించని రికార్డులు సృష్టిస్తున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు.

నేషనల్ మల్టీప్లెక్స్ లలో గత అయిదు వారాంతాల్లో ఎక్కువ మంది చూసిన సినిమాగా మహర్షి నిలిచింది. ఇది చాలా గొప్ప విషయం. ఎందుకంటే నేషనల్ మల్టీప్లెక్స్ లలో అన్ని బాషల సినిమాలు విడుదల అవుతాయి. పైగా ఈ వారం రంజాన్ స్పెషల్ గా సల్మాన్ ఖాన్ నటించిన భారత్ విడుదల అయ్యింది. సల్మాన్ ఖాన్ సినిమా పైగా మొదటి వీకెండ్, అయినా కూడా మహేష్ బాబు మహర్షి జోరు ఏమాత్రం తగ్గలేదు.

భారత్ ని వెనుకకి నెడుతూ ఈ వీకెండ్ కూడా మొదటి స్థానంలో నిలిచింది మహర్షి. అంటే సల్మాన్ ఖాన్ సినిమా మొదటి వీకెండ్ ఆక్యుపెన్సీ ని అయిదో వారంలో ఉన్న మహేష్ బాబు సినిమా దాటేసింది అనమాట. ఈ ఘనాంకాలు ఇండియా మొత్తంలో ఉన్న మల్టీప్లెక్స్ లవి. ఇది మహేష్ బాబు కు దేశవ్యాప్తంగా ఉన్న ఫాలోయింగ్ మరియు క్రేజ్ కు నిదర్శనంగా చెప్పవచ్చు.

అయిదో వారం భారత్ విడుదల అవ్వడంతో మహర్షి ఆక్యుపెన్సీలో తగ్గుదల ఉంటుందని అనుకున్నారు. కానీ తన అయిదో వారాంతంలో కూడా జూన్ 7-9 వరకు 64 శాతం ఆక్యుపెన్సీ తో సూపర్ స్టార్ కు అసలైన అర్థం చెప్పారు మహేష్. నాలుగో వీకెండ్ కన్నా అయిదో వీకెండ్ కి ఆక్యుపెన్సీ పెరగడం గమనార్హం. నాలుగో వీకెండ్ 62 శాతం ఉంటే అయిదో వీకెండ్ కి అది 64 శాతం కు చేరింది.

ఈ ఘనాంకాలు ఇండియా మొత్తంలో ఉన్న మల్టీప్లెక్స్ లవి. నేషనల్ వైడ్ గా మన సూపర్ స్టార్ కు ఉన్న పాపులారిటీ, క్రేజ్ కి ఇది నిదర్శనం. మహారాష్ట్రాలోని పూణె లో అయిదో వారం కూడా మహర్షి ప్రదర్శింపబడుతుందంటే అదీ మహేష్ కు ఉత్తరాదిన ఉన్న ఫాలోయింగ్. మహేష్ స్టార్ పవర్ కి మంచి కథ కూడా తోడవడంతో మహర్షి జనాల్లోకి అంతలా చొచ్చుకుపోయింది.

మహర్షి సినిమాలో రైతు సమస్యలను అద్భుతంగా ఆవిష్కరించారు. రైతులకు సరైన గౌరవాన్ని ఇవ్వాలని, వారిని దోచుకుంటున్న దళారీలను తరిమి కొట్టేది సామాన్య ప్రజలే అని ఎన్నో మంచి విషయాలు ఈ చిత్రంలో చూపించారు. వారాంతపు వ్యవసాయం, సామాజిక సమస్యల నేపథ్యంలో తెరకెక్కిన మహర్షి అందరి ప్రశంసలు అందుకుంటుంది.

మహర్షి మూవీ ప్రమోషన్స్ లో బిజీ గా గడిపిన మహేష్, ఆమూవీ సక్సెస్ ని ఫ్యామిలీతో కలిసి వరల్డ్ టూర్ లో సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. జర్మనీ, ఇటలీ లో విహారం ముగించుకున్న మహేష్ అక్కడ నుండి నేరుగా ఇంగ్లాండ్ వెళ్లారు. ప్రస్తుతం ఇంగ్లాండ్ లో ఇండియా క్రికెట్ ప్రపంచ కప్ మ్యాచులు ఎంజాయ్ చేస్తున్న ప్రిన్స్ త్వరలోనే తిరిగి రానున్నట్టు తెలిసింది. తిరిగొచ్చాక అనీల్ రావిపూడితో క‌లిసి మ‌హేష్ త‌న 26వ సినిమా సరిలేరు నీకెవ్వరు షూటింగ్ లో పాల్గొననున్నారు.

Share

Leave a Comment