పదిహేడవ రోజూ మహర్షి జోరు

సూపర్‌స్టార్ మహేష్ బాబు 25వ చిత్రం ‘మహర్షి’ బాక్సాఫీస్ వద్ద నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు కలెక్షన్ల పంట పండిస్తోంది. మే 9న రిలీజైన ఈ మూవీ శనివారంతో విజయవంతంగా 17 రోజులు పూర్తి చేసుకుంది. నేడు ఆదివారం కావడంతో ఈరోజు కలెక్షన్లకు డోకా లేదు. తెలుగు రాష్ట్రాల్లోని దాదాపు అన్ని ఏరియాల్లో నిన్న సాయంత్రం హౌస్ ఫుల్ వసూళ్లతో కళకళలాడాయి.

ఇక నేడు కలెక్షన్లు ఇంకా ప్రెగే అవకాశం పుష్కలంగా ఉంది. సూపర్ స్టార్ కెరీర్లో ల్యాండ్ మార్క్ మూవీ కావడం, సమ్మర్ హాలిడేస్ కలిసి రావడంతో మార్కెట్లో మహర్షికి ఎదురు లేకుండా పోయింది. మహర్షి చిత్రం నైజాం ఏరియాలో అత్యధిక వసూళ్లు సాధిస్తూ దూసుకెళుతోంది. నైజాంలో మహర్షి ఓవరాల్‌ షేర్ రూ.27.85 కోట్లకు చేరింది.

బాహుబలి సిరీస్ తరువాత నైజాంలో అత్యధిక వసూళ్ళు రాబట్టిన సినిమాగా రికార్డు సృష్టించింది మహర్షి. ఇదే దూకుడును కొనసాగిస్తూ ఇంకో రెండు మూడు రోజుల్లో రూ.30 కోట్ల షేర్ మార్క్ ను బద్దలుకొట్టడం తధ్యం. సీడెడ్ లో కూడా మహర్షి రూ.9 కోట్ల షేర్ ను దాటి పది కోట్ల షేర్ వైపు అడుగులు వేస్తుంది. చాలా ఏరియాల్లో కొత్త రికార్డులను లిఖించాడు మహర్షి.

ఒంగోలులో మహర్షి ఇప్పటికి 80లక్షల షేర్ ను వసూలు చేసింది. ఒంగోలు లో మూడు సినిమాలకు 80లక్షల షేర్ ఉన్న ఏకైక హీరో మన సూపర్‌స్టార్. ఇక ఏలూరు లో మహేష్ జోరు మామూలుగా ఉండదు. ఈ 17 రోజులకు మహర్షి రూ.1.12 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. ఏలూరులో రూ.1.11 కోట్ల గ్రాస్ దాటి కలెక్ట్ చేసిన మహేష్ సినిమాల సంఖ్య మహర్షితో మూడుకు చేరింది.

ఏలూరులో ఇన్ని రూ.1.11 కోట్ల కు పైగా గ్రాస్ వసూలు చేసిన సినిమాలు ఉన్న ఒకే ఒక్కడు మహేష్. ఏలూరులో భరత్ అనే నేను రూ.1.35 కోట్ల గ్రాస్, శ్రీమంతుడు రూ.1.11 కోట్ల గ్రాస్ ను వసూలు చేసాయి.ఇప్పుడు మహర్షి 17 రోజులకే రెండవ స్థానంలో నిలిచింది. ఉత్తరాంధ్రాలో మహర్షి రూ.10 కోట్ల షేర్ ను దాటేసింది.

సూపర్ స్టార్ కెరీర్‌లో ఈ ఏరియాలో రూ.10 కోట్ల షేర్ కలెక్ట్ చేసిన రెండో సినిమా మహర్షి. భరత్ అనే నేను తో మొదట ఈ ఘనత సాధించాడు మహేష్. వేరే ఏ హీరోకు కూడా ఉత్తరాంధ్రాలో రెండు రూ.10 కోట్ల షేర్ సినిమాలు లేవు. ఈస్ట్ గోదావరిలో మహర్షి జోరు మామూలుగా లేదు. ఇక్కడ ఒక అరుదైన రికార్డును మహేష్ తన ఖాతాలో వేసుకున్నాడు.

ఇప్పటికి మహర్షి రూ.7 కోట్ల కు పైగా షేర్ ను వసూలు చేసి కొత్త చరిత్రను రాసింది. ఈస్ట్ గోదావరిలో రూ.6 కోట్ల కు పైగా షేర్ ఉన్న మహేష్ సినిమాల సంఖ్య మూడు కి చేరింది. ఈ ఘనత సాధించిన ఒకే ఒక్క హీరో మన సూపర్ స్టార్. ఇక్కడ భరత్ అనే నేను కూడా రూ.7 కోట్ల కు పైగా షేర్ ను కొల్లగొట్టింది. మహర్షి తో మహేష్ బ్యాక్ టు బ్యాక్ రెండు రూ.7 కోట్ల కు పైగా షేర్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నాడు.

ఇంకా నిజామాబాద్ లో కూడా ఒక కొత్త చరిత్ర ను లిఖించుకున్నాడు మహేష్. మహర్షి తో ఇక్కడ తన తొలి కోటి రూపాయల గ్రాసర్ ను తన ఖాతాలో జమ చేసుకున్నాడు. రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా 17వ రోజు కూడా తన జోరును కొనసాగించాడు మహర్షి. మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి నిన్న రూ.0.98 కోట్ల షేర్ వసూలు అయ్యాయి.

వైజాగ్, రాజమండ్రి, కాకినాడ, భీమవరం, విజయవాడ, ఏలూరు, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, అనంతపూర్, కర్నూల్, విజయనగరం, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, హైదరాబాద్ లోని ఆర్.టి.సి.క్రాస్ రోడ్స్, దిల్ షుక్ నగర్, ప్రసాద్స్, కేపీహెచ్బి, ఏఎంబి సినిమాస్, విజయవాడ లోని క్యాపిటల్ సినిమాస్ వంటి సెంటర్స్ లో ఈ సినిమా కోటి కలెక్షన్స్ ని రాబట్టింది.

ఇంకా రెస్టాఫ్ ఇండియాలో కూడా మహర్షి తన సత్తా చూపిస్తున్నాడు. కర్నాటక లో మహర్షి కి అదిపోయే కలెక్షన్లు దక్కుతున్నాయి. ఒక్క బెంగళూరు సిటీ నుంచే మహర్షి కి రూ.5.75 కోట్లకు పైగా షేర్ దక్కనుంది. ఇక చెన్నైలో మహేష్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చెన్నై సిటీలో దాదాపు కోటి రూపాయల వసూళ్ళను రాబట్టాడు మహర్షి.

మహర్షి పరుగులు చూస్తుంటే మహేష్ కెరీర్ లో ఈ సినిమా బిగ్గెస్ట్ మైల్ స్టోన్ అవుతుందని తెలుస్తోంది. వరుసగా రెండు బ్లాక్‌బస్టర్ హిట్స్ ని ఇచ్చి సూపర్ స్టార్ తన ఫ్యాన్స్ ని ఖుషి చేశారు. తన సిల్వర్ జూబ్లీ సినిమా తో మహేష్ కొత్త రికార్డులను నమోదు చేయడం పట్ల అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

మహర్షి సక్సెస్‌ తర్వాత ఫ్యామిలీతో కలసి మహేష్ ఫారిన్‌ ట్రిప్‌ వెళ్లిన సంగతి తెలిసిందే. 20 రోజుల పాటు సాగే ఈ ట్రిప్‌లో పోర్చుగల్, ఇంగ్లాండ్‌ చుట్టి రానున్నారు మహేష్. తిరిగొచ్చాక అనీల్ రావిపూడితో క‌లిసి మ‌హేష్ త‌న 26వ సినిమా చేయ‌నున్నారు. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఒక ఆసక్తికర విషయం నేడు బయటకు వచ్చింది.

సూపర్ స్టార్ తో చేసే సినిమా యొక్క స్కిప్ట్ వర్క్ పూర్తయిందని దాతో పాటూ ఈ స్క్రిప్ట్ అద్భుతంగా వచ్చిందని అనీల్ రావిపూడి ఎమోజీల ద్వారా ట్విట్టర్ లో తెలియజేసారు. ఇంకా ఒక క్లాప్‌బోర్డ్ ఎమోజీతో పాటు సూన్ అని ఉన్న దాన్ని కూడా పోస్ట్ చేసారు. కాబట్టి అన్ని పనులు పూర్తయ్యి షూటింగ్ త్వరలోనే మొదలవబోతుంది అనమాట.

Share

Leave a Comment