ఆలోచింపజేసిన మహర్షి డైలాగ్స్

ఒక సినిమా చూసి మహా అయితే ఎంజాయ్ చేస్తాం, బోర్ కొడితే ఫోన్ చూసుకుంటూ కూర్చుంటాం. కానీ ఒక సినిమా ఆలోజింపజేస్తే ఎలా ఉంటుంది. ఇదివరకు అలాంటి సినిమాలోచ్చాయి. కానీ “మహర్షి”లో సక్సెస్ యొక్క ఇంపార్టెన్స్ గురించి, మన సమాజానికి రైతు అవసరం గురించి సూపర్‌స్టార్‌ మహేష్ బాబు చెబుతుంటే నిజమే కదా అనిపిస్తుంది. అందుకే మహర్షిలోని కొన్ని అద్భుతమైన మరియు ఆలోజింపజేసే సంభాషణలు మీకోసం!!

1)

2)

3)

4)

5)

6)

7)

8)

9)

10)

11)

12)

13)

14)

15)

16)

17)

18)

19)

20)

21)

22)

23)

24)

25)

26)

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం ‘మహర్షి’. ఈ నెల 9న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. విడుదలైన నాలుగు రోజుల్లోనే రూ.100 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమాలో మూడు గెటప్‌ల్లోనూ మహేష్ అభిమానులను అమితంగా ఆకట్టుకున్నాడు.

ముఖ్యంగా రైతులకు సంబంధించిన సన్నివేశాలు యూత్‌ని సైతం బాగా ఆకట్టుకున్నాయి. సినిమా చూసిన వారంతా వీకెండ్ వ్యవసాయం చేసి ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఒకరకంగా ఇది సినిమా జనాల్లోకి ఎంతలా చేరువయ్యిందో తెలపడానికి ఎంతగానో ఉపయోగపడుతోంది. మ‌హ‌ర్షి చిత్రానికి దేవి శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందించ‌గా, దిల్ రాజు, అశ్విని ద‌త్‌, పీవీపి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.

అల్లరి నరేష్ అన్నట్టు సినిమాలు ఎప్పుడూ చేస్తూనే ఉంటారు. హిట్ అయితే పేరు వస్తుంది. కాని రెస్పెక్ట్ మాత్రం మాత్రం కొన్ని చిత్రాలతోనే వస్తుంది. మహర్షి చిత్రం హిట్టా, బ్లాక్ బస్టరా? సూపర్ డూపర్ హిట్టా? లాంటి విషయాలను పక్కన పెట్టేస్తే రైతంటే సింపథీ కాదు రెస్పెక్ట్ అనే సోషల్ మెసేజ్‌తో చాలా మందిలో చైతన్యం తీసుకువచ్చింది.

సినిమా అంటే కేవలం వినోదం పంచడం మాత్రమే కాదు సమాజంలో మంచి మార్పు తెచ్చేలా ఉండాలని తపన పడే మహేష్ బాబు మహర్షి ద్వారా ఒక అద్భుతమైన కాన్సెప్టును ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఇందుకోసం ‘వీకెండ్ వ్యవసాయం’ అనే కొత్త కాన్సెప్ట్‌ను మహర్షి చిత్రంలో చూపించారు. ఇప్పటికే సోషల్ మీడియాలో మహర్షి వీకెండ్ వ్యవసాయానికి అనూహ్య స్పందన లభిస్తోంది. అనేక మంది యువత పంటపొలాల్లో వ్యవసాయం చేస్తూ ఫొటోలు దిగి వాటిని సోషల్ మీడియాలో ‘మహర్షి వీకెండ్ వ్యవసాయం’ పేరుతో ట్యాగ్ చేస్తున్నారు.

Share

Leave a Comment