ఎనిమిది రోజుల్లో రేర్ రికార్డ్

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందిన ‘మహర్షి’ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు అదరగొడుతోంది. ఇప్పటికే పలు నాన్ బాహుబలి రికార్డులను బద్దలు కొట్టి వార్తల్లోకి ఎక్కిన ఈ చిత్రం సూపర్ స్టార్ కెరీర్ లోనే హయ్యెస్ట్ గ్రాసర్ దిశగా దూసుకుపోతుంది. ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది రోజులకు రూ.80 కోట్లకు పైగా డిస్ట్రిబ్యూటర్ షేర్ వసూలు చేసింది.

మహర్షి మహేష్ కెరీర్ లో మూడో రూ.80 కోట్ల షేర్ సాధించిన సినిమా. ఇంతకు ముందు శ్రీమంతుడు, భరత్ అనే నేను రూ.80 కోట్ల షేర్ ను వసూలు చేసాయి. తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఏ హీరోకు కూడా ఇన్ని రూ.80 కోట్ల షేర్ సినిమాలు లేవు. మహర్షి తో ఈ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు మహేష్ బాబు.

నైజాం ఏరియాలో మహర్షి మూవీ ముందు నుంచి అదరగొడుతోంది. ఎనిమిదో రోజు కూడా తన దూకుడు ను కొనసాగించింది. తొలి ఏడు రోజుల్లో రూ. 21.67 కోట్ల షేర్ వసూలు చేసి నాన్ బాహుబలి రికార్డ్ నెలకొల్పిన సంగతి తెలిసిందే. ఎనిమిదవ రోజు సైతం ప్రేక్షకుల ఆదరణ తగ్గలేదు. రూ.0.84 కోట్ల షేర్ వసూలు చేసింది. దీంతో ఎనిమిది రోజులకు నైజాంలో టోటల్ షేర్ రూ. 22.5 కోట్లకు రీచ్ అయింది.

మిగిలిన ప్రాంతాల్లో కూడా మహర్షి తన జోరును ఎనిమిదో రోజు కూడా కొనసాగించాడు. ఎనిమిది రోజు ఉత్తరాంధ్రా లో రూ. 0.33 కోట్ల షేర్ ను సాధించి తన జోరును కొనసాగించాడు మహర్షి. మొత్తంగా ఎనిమిది రోజులకు తెలుగు రాస్ట్రాల నుంచి రూ.61 కోట్లకు పైగా షేర్ ను కొల్లగొట్టింది మహర్షి. ఇంకా రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్‌సీస్ నుంచి రూ.19 కోట్లకు పైగా షేర్ ను వసూలు చేసింది.

దీంతో ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది రోజులకు రూ.80 కోట్లకు పైగా డిస్ట్రిబ్యూటర్ షేర్ ను కొల్లగొట్టింది మహర్షి. మహర్షి జోరు ఇంకా కొనసాగుతుంది. ఈ శనివారం మరియు ఆదివారం మహర్షి కలెక్షన్లకు చాలా యాడ్ అవుతాయనే ఆశిస్తున్నాం. ఈ వీకెండ్ కలెక్షన్ల బట్టి మహర్షి ఎక్కడకు చేరుకుంటాడోనని మనం ఒక లెక్కకు రావచ్చు.

ఇప్పటి వరకు మహేష్ బాబు కెరీర్లో హయ్యస్ట్ గ్రాసర్ గా ఉన్న ‘భరత్ అనే నేను’ ను ఇంకొన్ని రోజుల్లో మహర్షి దాటేయడం ఖాయం. అది ఎన్ని రోజులకు దాటుతుందో ఈ వీకెండ్ బట్టి మనం అచనాకు రావచ్చు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రేక్షకలోకం మహర్షి సినిమాకు నీరాజనం పలుకుతున్నారు. రైతు నేపథ్యంలో చిత్రీకరించిన పలు సన్నివేశాలు అన్నివర్గాల ప్రేక్షకులను కట్టి పడేస్తున్నాయి.

దీంతో తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్స్ అన్నీ హౌస్‌ఫుల్ బోర్డులతో దర్శనమిస్తూ డిస్ట్రిబ్యూటర్లకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. మహేష్ బాబు కెరీర్లో 25వ ల్యాండ్ మార్క్ మూవీ కావడం దిల్ రాజు, అశ్వినీదత్, పివిపి లాంటి బడా నిర్మాతలు ఈ ప్రాజెక్టులో ఇన్వాల్వ్ అయి ఉండటంతో ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ చేశారు. రిలీజ్ అయిన అన్ని చోట్ల అదిరిపోయే వసూళ్ళను రాబడుతున్నాడు.

స్నేహం, సామాజిక ఇతివృత్తం, సందేశాత్మకంగా ఉన్న ఈ సినిమాకు పలువురు ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిపస్తున్నారు. ‘మహర్షి’ సినిమాతో రైతుల గురించి చెప్పడంతో ఏకంగా భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు ఈ చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలియజేసారు. మహర్షి ఎఫెక్ట్‌తో వీకెండ్ వ్యవసాయం అనే నయా ట్రెండ్ క్రియేట్ అయింది.

అటు బాక్సాఫీస్ పరంగా మరియు ప్రసంశల పరంగా మహర్షి కి లభిస్తున్న ఆదరణను చూసి చిత్ర యూనిట్ చాలా ఆనందంగా ఉన్నారు. ప్రేక్షకులకు కృతఘ్నతలు తెలపడం కోసం సక్సెస్‌మీట్‌ ను జరపదలిచారు. ఈ క్రమంలో ఇవాళ విజయవాడలో మహర్షి గ్రాండ్ సక్సెస్‌మీట్ జరగనుంది. సిద్దార్థ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్ గ్రౌండ్స్ లో ఈ కార్యక్రమం జరగనుంది.

సాయంత్రం ఆరు గంటల నుంచి ప్రారంభం కానున్న ఈ ప్రోగ్రామ్‌లో చిత్ర యూనిట్‌ పాల్గొననుంది. మహేష్ బాబుతో పాటు పూజా హెగ్డే, అల్లరి నరేష్, దర్శకుడు వంశీ పైడిపల్లి, నిర్మాతలు దిల్ రాజు, పివిపి, అశ్వినీదత్ ల తో పాటు మహర్షి సినిమా కు పని చేసిన వారందరూ ఈ వేడుకలో సందడి చేయబోతున్నారు. మహేష్ బాబు అభిమానులు భారీ సంఖ్యలో తరలి రాబోతున్న నేపథ్యంలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.

మహేష్ బాబు కెరీర్లో 25వ సినిమా కావడంతో మహర్షి మరింత ప్రత్యేకంగా మారింది. రైతుల గురించి, వ్యసాయం ప్రాముఖ్యత గురించి వివరిస్తూ ఒక మంచి సందేశాత్మక చిత్రంగా తెరకెక్కించడంతో చాలా మందికి కనెక్ట్ అవుతోంది. మహర్షి చూసిన ప్రతి ప్రేక్షకుడు కథకు బాగా కనెక్ట్ అవుతున్నారు. చూసిన ప్రతీ ఒక్కరూ 25వ సినిమా అంటే ఇలా ఉండాలి అని మహర్షి ని ప్రశంసిస్తున్నారు.

ముందు ముందు మహర్షి మరిన్ని కొత్త రికార్డులను నెలకొల్పడం ఖాయం. క‌మ‌ర్షియ‌ల్ చట్రాల్లో ఉంటూనే, సామాజిక నేప‌థ్యం ఉన్న క‌థ‌ల్ని ఎంచుకునే సాహ‌సం చేయడంలో ఎప్పుడూ ముందు ఉండే ఏకైక స్టార్ మహేష్ బాబు. అభిమానుల్ని సంతృప్తిప‌రుస్తూనే ఏదో ఓ స‌మ‌స్య‌ని వేలెత్తి చూపిస్తూ ఉంటారు.

అందుకు త‌గిన ప‌రిష్కార మార్గాన్నీ సూచిస్తున్నారు. మ‌హేష్ బాబు ఈ దారిలోనే వెళ్లి ‘శ్రీ‌మంతుడు’, ‘భ‌ర‌త్ అనే నేను’ అనే సినిమాల్ని చేశారు. అవి క‌మర్షియ‌ల్ విజ‌యాల్ని అందుకుంటూనే మ‌హేష్‌కి మంచి పేరు తీసుకొచ్చాయి. ఈసారి త‌న 25వ సినిమాకీ అలాంటి ఒక మంచి కథను ఎంచుకుని ‘మ‌హర్షి’గా మారారు. దీంతో సూపర్ స్టార్ పై ప్రశంసల వర్షంతో పాటు కలెక్షన్లు కూడా భారీగా కురుస్తున్నాయి.

Share

Leave a Comment