మహర్షి పొలంలో దిగాడుగా

సూపర్ స్టార్ మహేష్ బాబు తాజా చిత్రం ‘మహర్షి’ మే 9 రిలీజ్ కానుందన్న సంగతి తెలిసిందే. దీంతో ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి ‘ఛోటీ ఛోటీ బాతే’, ‘నువ్వే సమస్తం’ అంటూ సాగే లిరికల్ సాంగ్స్, ‘ఎవరెస్ట్ అంచున’ అంటూ సాగే వీడియో సాంగ్ ప్రోమో తో పాటు లిరికల్ ను కూడా విడుదల చేశారు.

తాజాగా ఈ సినిమా నుండి మరో లిరికల్ సాంగ్ రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్ చేశారు. అంటే మహర్షి సినిమా నుంచి నాలుగో సింగిల్ అనమాట. ఈ పాట పదరా పదరా అంటూ సాగుతుంది. ‘పదరా పదరా పదరా.. నీ అడుగుకి పదును పెట్టి పదరా, ఈ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా’ అంటూ రైతులతో కలిసి అడుగులు వేస్తున్నాడు సూపర్ స్టార్.

స్ఫూర్తి రగిలించే విధంగా ఉండే పదాలతో శ్రీమణి సాహిత్యం అందించారు అని ఈ వ్యాఖ్యలు చూస్తే మనకు అర్థం అవుతుంది. ఈ పాటను బుధవారం నాడు సాయంత్రం 4.05 గంటలకు రిలీజ్ చేస్తామని దర్శకుడు వంశీ పైడిపల్లి తన ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రకటించారు. ఈ విషయంతో పాటు ఒక కొత్త మహర్షి పోస్టర్ ను కూడా వదిలారు ఆయన.

రిలీజ్ చేసిన పోస్టర్ లో మహేష్ బాబు ఒక పొలంలో నడుచుకుంటూ వెళుతున్నట్లు కనిపిస్తున్నాడు. పలుగు, పార, నాగలి చేతబట్టిన రైతులకు ముందు నిలబడి కదం తొక్కుతున్నాడు. వెనకాల గమనిస్తే ఇంకా చాలా మంది జనతో పాతు ఎద్దులను కూడా మనం చూడవచ్చు. అచ్చమైన పల్లెటూరి వాతావరణాన్ని ప్రతిబింబిస్తుంది ఈ పోస్టర్.

పైర్ల పచ్చదానికి సింబల్ అన్నట్టుగా ఆకుపచ్చ రంగు చొక్కా వేసుకొని, ప్యాంటు ను పైకి మడిచి తలకు టవలును తలపాగా లాగా కట్టిమరీ మోడరన్ రైతులా కనిపిస్తున్నాడు మన మహేష్. ఈ సినిమాలో మహేష్ బాబు రైతు సమస్యలపై పోరాడతాడని ఇప్పటికే వార్తలు వచ్చాయి. మహేష్ రైతులకు అండగా ఉండబోతున్నట్లు పోస్టర్‌ చూస్తే తెలిసిపోతుంది.

ఈ పాట సాహిత్యం, పోస్టర్ చూస్తుంటే అది నిజమేననిపిస్తోంది. బుధవారం సాయంత్రాని కల్లా పదరా పదరా పాట ఎలా ఉందో మనకు తెలుస్తుంది. ‘పదరా పదరా పదరా’ పాట గురించి దీన్ని రాసిన శ్రీమణి గారు చాలా ఉద్వేగంగా తన ట్విట్టర్ ఖాతాలో ఒక పోస్ట్ పెట్టారు. ‘నాలో కవిత్వ దాహాన్ని రేపిన పాట, నాలో పరిశోధనని పుట్టించిన పాట, కలం హలమై మట్టి హృదయాన్ని తట్టి లేపిన పాట.

పదరా పదరా పదరా పాట మీ ముందుకు ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాను’ అని ట్వీట్ చేసారు ఆయన. దీని బట్టి ఈ పాట ఆయన హృదయానికి ఎంత దగ్గరగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. మహర్షిలో పాటలన్నీ శ్రీమణి గారే రాసారు. ఇప్పటివరకూ రిలీజ్ ఐన పాటలలో సాహిత్యం చాలా బావుందని అందరూ అంటున్నారు.

మహర్షి చిత్రంలో మహేష్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుండగా అల్లరి నరేష్ మహేష్ స్నేహితుడు రవి గా ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. దిల్ రాజు, అశ్వినీదత్, ప్రసాద్ వి పొట్లూరి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. మహేష్ కెరీర్‌లో 25వ చిత్రంగా రాబోతున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

మహేష్ బాబు మూడు షేడ్స్ లో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. స్టూడెంట్ గా, బిజినెస్ మెన్ గా కనిపిస్తున్నట్లు ఇది వరకు విడుదలైన మహర్షి ప్రచార చిత్రాలు, టీజర్ తో మనకు స్పష్టత వచ్చింది. ఇక ఇప్పుడు వచ్చిన ఈ పదరా పదరా పదరా పోస్టర్ తో మహేష్ మనకు ఒక రైతుగా కూడా కనిపించనున్నాడని క్లారిటీ వచ్చేసింది.

ఈ రైతు పాత్రే సినిమాకు కీలకంగా మారనుందని సమాచారం. ఎక్కడో అమెరికాలో ఉండే రిషి ఇండియా వచ్చి రైతుగా ఎందుకు మారాల్సి వచ్చింది? రిషి నుంచి మహర్షిగా తను ఎందుకు మారాడు అన్నదే ఈ సినిమా కథ అని మొదటి నుండి దిల్ రాజు గారు ప్రెస్ మీట్స్ లో చెబుతూనే ఉన్నారు. ఈ ప్రశ్నలన్నిటికీ సమాథానాలు కావాలంటే మే 9 వరకు ఎదురుచూడాల్సిందే.

మహర్షి కౌంట్ డౌన్ తో సూపర్‌స్టార్ మహేష్ బాబు అభిమానులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రోజు ఒక హ్యాష్‌ట్యాగ్ తో మహర్షి ని సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తూ సినిమాపై తమకున్న అంచనాలను తెలియజేస్తున్నారు. ఆ అంచనాలన్నిటినీ అధిగమించి మహర్షి ఘన విజయం సాధించడం ఖాయమని మహర్షి యూనిట్ చాలా కాన్‌ఫిడెంట్ గా ఉంది.

అభిమానుల అందరి చూపు మహర్షి ట్రైలర్ ప్లస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వివరాల గురించే. 25వ చిత్రం అవ్వడం వల్ల అభిమానులు పెద్ద ఎత్తున ప్రీ రిలీజ్ వేడుకకు హాజరై సూపర్ స్టార్ పై తమకు ఉండే అభిమానాన్ని చూపించాలని తహహలాడుతున్నారు. త్వరలోనే ప్రీ రిలీజ్ ఈవెంట్ తేదీ మరియు చోటును ప్రకటించే అవకాశం ఉంది.

మహేష్‌ బాబు పోషించిన రిషి పాత్ర ప్రయాణమే ‘మహర్షి’ సినిమా. మనలో ప్రతి ఒక్కరి జీవితానికి ఒక ప్రయాణం ఉంది. ఇదీ అంతే. మనలోని ప్రతి ఒక్కరి కథ ఇదని, ఓ సామాన్య యువకుడు తన జీవన ప్రయాణంలో మహర్షిగా ఎలా మారాడన్నది కథ. చివరి వారానికి ఫైనల్ కాపీ రెడీ చేయబోతున్నారు.

ఈ సమ్మర్ సీజన్ లో రిలీజ్ కానున్న సినిమాల్లో మహర్షి మీద ఉన్న అంచానాలు మరే ఇతర సినిమాలపై లేవు. విడుదలకు ముందే రికార్డులను సృష్టిస్తున్న మహర్షి ఇక విడుదల తరువాత ఇండస్ట్రీ రికార్డులను తిరగరాయడం ఖాయం అని ట్రేడ్ వర్గాల మాట. అందరి దృష్టి మహేష్ సినిమాపై ఉంది. మహర్షి విడుదల గురించి సినీ ప్రియులు ఆశక్తిగా ఎదురుచూస్తున్నారు.

Share

Leave a Comment