కేవలం 24 గంటల్లో

సూపర్ స్టార్ మహేష్ బాబు కొత్త సినిమా ‘మహర్షి’ ప్రమోషన్ కార్యక్రమాలు మొదలయ్యాయి. అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫస్ట్ సింగిల్ ఛోటీ ఛోటీ బాతే రిలీజ్ అయింది. సంగీత ప్రియులను మెప్పించింది. దేవీ మరోసారి తనదైన స్టైల్లో ట్యూన్ చేయడమే కాకుండా స్వయంగా పాడి మరీ మహర్షి మ్యూజిక్ ప్రమోషన్స్ కు మంచి ఆరంభాన్నిచ్చారు.

‘ఛోటి ఛోటి చోటి ఛోటీ బాతే.. మీటి మీటి మీటి మీటీ యాదే.. ఓ పరిచయం ఎప్పుడూ చిన్నదే.. ఈ చెలిమికే కాలమే చాలదే’ అంటూ శ్రీమణి రాసిన పాటకు దేవీ శ్రీ ప్రసాద్ బాణీలు కట్టారు. ఈ పాట సింప్లీ సూపర్బ్‌గా ఉంది. శ్రీమణి రాసిన సాహిత్యం, దేవిశ్రీ ప్రసాద్ చేసిన కంపోజింగ్ యూత్‌కు తెగ నచ్చేసింది.

నీ కష్టం తనదనుకుంటూ నీ కలనే తనదిగా కంటూ నీ గెలుపుని మాత్రం నీకే వదిలేస్తూ, ఎన్నో వేల కథలు ఇంకో కథ మొదలు అంటూ స్నేహంలోని గొప్పతనాన్ని ఆవిష్కరిస్తూ అద్బుతంగా పదాలను జతపరిచారు అనే చెప్పాలి. స్నేహం అంటే పుస్తకాలు చెప్పని పాఠం, కన్నవాళ్లు ఇవ్వలేని ఆస్తి అంటూ శ్రీమణి రాసిన సాహిత్యం బాగుంది.

ఈ పాటకు శ్రోతల నుంచి అదిరిపోయే ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వస్తోంది. కేవలం 24 గంటల్లోనే ఈ పాటకు 3.2 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఈ విషయాన్ని తెలుపుతూ తాజాగా ఒక పోస్టర్ రిలీజ్ చేసింది మహర్షి చిత్రయూనిట్. ఈ సినిమాకి సంబంధించి ప్రతివారం ఒక పాటను విడుదల చేయబోతున్నారు.

ఈ లిరికల్ వీడియోలో కొన్ని మహర్షి స్టిల్స్ ను కూడా పొందుపరిచారు. ఆ ఫొటోల్లో మహేష్ బాబు, అల్లరి నరేష్, పూజా హెగ్డేలు స్టూడెంట్స్ గెటప్పులలో కాలేజీలో అలా నడుచుకుంటూ వస్తున్నారు. మహర్షి టీజర్ లో కనిపించిన డ్రెస్ లోనే మహేష్ రఫ్ గా డోంట్ కేర్ యాటిట్యూడ్ ఉండే యంగ్ స్టర్ గా కనిపిస్తున్నారు.

అల్లరి నరేష్ మాత్రం డీసెంట్ ఒక అమాయకుడి గెటప్ లో కల్లజోడుతో కనిపిస్తున్నారు. ఇక పూజా హెగ్డే యాజ్ యూజువల్ గా అందంగా టీ-షర్ట్, ప్యాంట్, స్పోర్ట్స్ షూ ధరించి క్యాజువల్ గా ఉన్నారు. మహేష్ చేతిలో ల్యాప్ టాప్, పూజ చేతిలో బుక్స్ ఉండగా అల్లరి నరేష్ మాత్రం ఒక స్టూడెంట్ బ్యాగ్ తగిలించుకున్నారు.

ఓవరాల్ గా మహర్షి బ్యాచ్ అదిరిపోయింది. కాలేజ్ నేపథ్యంలో ముగ్గురు స్నేహితుల మధ్య చోటుచేసుకున్న సన్నివేశాల ఆధారంగా వచ్చే ఈ సాంగ్‌ని మహేష్ బాబు, అల్లరి నరేష్, పూజా హెగ్డే పై చిత్రీకరించారని ఈ వీడియోలోని స్టిల్స్ చూస్తే మనకు అర్థమవుతుంది. కాలేజ్ బ్యాక్ డ్రాప్ మహర్షి కి కీలకంగా ఉన్నట్టు ఉంది.

ఈ సినిమాలో కాలేజి ఎపిసోడ్ ఎంతో ఫన్నీగా సాగుతుందని, మహర్షి బ్యాచ్ చేసే అల్లరి ప్రేక్షకులను మురిపిస్తుందనే టాక్ ఉంది. మరి ఈ గెటప్పులు, ముగ్గురు ఉన్న స్టిల్స్ చూస్తుంటే అది నిజమేననిపిస్తోంది. మరి ఆ సంగతి తెలియాలంటే మాత్రం మే 9 వరకూ వేచి చూడకతప్పదు. ఫ్రెండ్‌షిప్ నేప‌థ్యంలో సాగే ఈ పాట ఎంతో రీఫ్రెషింగ్‌గా కొత్త‌గా అనిపిస్తోంది.

ఫస్ట్ సాంగ్‌ సినిమాపై భారీగా అంచనాలను పెంచేసింది. ఈ ప్రపంచంలో ప్రేమించని మనసు ఉంటుందేమో గానీ స్నేహం చేయని మనిషి ఉండడు. చెడ్డీల వయసులోనో, కాలేజీకెళ్లే టైములోనో ఎవరిదో ఓ భుజం ఆసరా అవుతుంది. ఓ చేయి కన్నీళ్లు తుడుస్తుంది. పంచుకున్న వన్‌ బై టూ టీ ముచ్చట్లు, దొంగచాటుగా కొట్టుకొచ్చిన జామకాయ రుచులు, క్రికెట్‌లో తగిలిన దెబ్బలు ఇవన్నీ మధుర జ్ఞాపకాలే.

అలాంటి బాల్య స్నేహితుల కథ మహర్షి లోనూ చూడొచ్చు. ఆ స్నేహితులుగా మహేష్ బాబు, అల్లరి నరేష్, పూజా హెగ్డే లు మనకు మహర్షిలో కనిపించనున్నారు. ప్రతి స్నేహానికి ఓ కథ ఉంది. ఈ పాట వింటూ మీ కథని గుర్తు చేసుకోండి. మీ స్నేహాన్ని ఉత్సవంగా జరుపుకోండి అని చిత్ర యూనిట్ తెలిపారు.

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, వైజయంతి మూవీస్‌, పి.వి.పి సినిమా పతాకాలపై హై టెక్నికల్‌ వేల్యూస్‌తో రూపొందుతోన్న భారీ చిత్రం మహర్షి. సూపర్‌స్టార్‌ మహేష్‌కు ఇది 25వ చిత్రం కావడం విశేషం. మహేష్‌కు ల్యాండ్ మార్క్ మూవీ కావడంతో మహర్షి పై స్పెషల్ ఫోకస్ పెట్టారు చిత్ర యూనిట్.

ఈ మూవీని మహేష్‌ కెరీర్‌లోనే మెమరబుల్‌ చిత్రంగా మలచాలని అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది మహర్షి యూనిట్. ఈ ప్రేస్టిజియస్ మూవీలో కాలేజ్ స్టూడెంట్‌గా, ఎన్.ఆర్.ఐ.గా రెండు వేరియేషన్స్‌ ఉన్న పాత్రల్లో కనిపించబోతున్నాడు మహేష్‌. మహేష్‌కు ఫ్రెండ్ క్యారెక్టర్‌లో అల్లరి నరేష్ నటిస్తుంటే, హీరోయిన్‌గా పూజా హేగ్డే నటిస్తోంది.

ఈ క‌థ ఎంతో విభిన్నంగా, స‌రికొత్తగా ఉంటుంద‌ని సినిమా యూనిట్ వెల్లడిస్తోంది. ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ విడుద‌లైన‌ప్ప‌టి నుంచి అభిమానులు క‌థ గురించి ఎన్నో వూహాగానాలు చేస్తుండ‌డం విశేషం. పోస్ట‌ర్‌లో మ‌హ‌ర్షి టైటిల్ వ‌ద్ద ఒక‌వైపు ప‌ల్లెటూరు, మ‌రోవైపు అమెరికా ఉండ‌డం ఇలా అన్నీ గమనించి తమకు తోచిన కథ అల్లుకుంటున్నారు. మ‌రి, అస‌లు ఈ సినిమా క‌థేంట‌న్న‌ది తెలియాలంటే విడుద‌ల వ‌ర‌కూ ఆగాల్సిందే.

Share

Leave a Comment