మహర్షి ఫస్ట్ వీక్ కలెక్షన్లు

సూపర్ స్టార్ మహేష్ బాబు సిల్వర్ జూబ్లీ మూవీ మహర్షి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. మే 9 వ తేదీన విడుదలైన ఈ సినిమా మొదటి నాలుగు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా 100 కోట్ల గ్రాస్ రాబట్టి మహేష్ కెరీర్‌లో ఓ మైలురాయిగా నిలిచింది. నిన్నటి తో మహర్షి వారం రోజుల రన్ ను పూర్తి చేసుకుంది.

ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో ఏడు రోజులకు రూ.59.37 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ వసూలు చేసి నాన్ బాహుబలి రికార్డ్ ను సాధించింది. ఏరియా వైస్ బ్రేకప్ మీ కోసం. నైజాం ఏరియాలో మహర్షి మూవీ ముందు నుంచి అదరగొడుతోంది. ఏడో రోజు కూడా తన దూకుడు ను కొనసాగించింది. తొలి ఆరు రోజుల్లో రూ. 20.54 కోట్ల షేర్ వసూలు చేసి నాన్ బాహుబలి రికార్డ్ నెలకొల్పిన సంగతి తెలిసిందే.

ఏడవ రోజు సైతం ప్రేక్షకుల ఆదరణ తగ్గలేదు. బుధవారం రూ.1.13 కోట్ల షేర్ వసూలు చేసింది. దీంతో ఏడు రోజులకు నైజాంలో టోటల్ షేర్ రూ. 21.67 కోట్లకు రీచ్ అయింది. నైజాంలో ఆరు రోజుల కలెక్షన్లలో నాన్ బాహుబలి రికార్డ్ ను నెలకొల్పింది మహర్షి. నైజాం ఏరియాలో సూపర్‌ స్టార్ కు ఏ రేంజ్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

కృష్ణ జిల్లాలో సైతం మహర్షి బుధవారం నాడు సంతృప్తికర వసూళ్లు సాధించింది. ఇక్కడ తొలి 4 రోజుల్లో రూ. 3.62 కోట్ల షేర్ తో నాన్ బాహుబలి రికార్డ్ ను సాధించింది. ఏడవ రోజుతో మొత్తం వసూళ్లు రూ. 4.28 కోట్లకు చేరుకుంది. గుంటూరు ఏరియాలో మహర్షి చిత్రం తొలి రోజు రూ. 4.40 కోట్లు తో నాన్ బాహుబలి రికార్డ్ సాధించింది.

ఏడవ రోజు రూ. 0.12 కోట్ల షేర్ వసూలు చేసింది. ఏడవ రోజుతో ఈ మొత్తం రూ. 6.43 కోట్లకు చేరుకుంది. ఉభయ గోదావరి జిల్లాల్లో ఏడో రోజూ మహర్షి జోరు కొనసాగింది. ఈస్ట్ గోదావరి లో మహర్షి తన జోరును కొనసాగించాడు. ఈస్ట్ గోదావరి లో ఏడో రోజు రూ. 0.16 కోట్లు వసూలు చేసింది. మొత్తంగా ఈస్ట్ గోదావరి జిల్లాలో ఏడు రోజులకు 5.63 కోట్ల షేర్ ను సాదించింది.

వెస్ట్ గోదావరిలో ఏడో రోజు రూ. 0.16 కోట్ల షేర్ రాబట్టింది. మొత్తంగా వెస్ట్ గోదావరి జిల్లాలో ఏడు రోజులకు 4.34 కోట్ల షేర్ ను సాదించింది. నెల్లూరు లో ఏడో రోజు 0.09 కోట్ల షేర్ ను రాబట్టింది మహర్షి. మొత్తంగా నెల్లూరు లో ఏడు రోజులకు 2.10 కోట్ల షేర్ ను సాదించింది. ఉత్తరాంధ్రా లో ఏడో రోజు 0.34 కోట్ల షేర్ ను రాబట్టింది మహర్షి.

మొత్తంగా ఉత్తరాంధ్రా లో ఏడు రోజులకు 7.47 కోట్ల షేర్ ను సాదించింది. సీడెడ్ లో ఏడో రోజు 0.23 కోట్ల షేర్ ను రాబట్టింది మహర్షి. మొత్తంగా సీడెడ్ లో ఏడు రోజులకు 7.45 కోట్ల షేర్ ను సాదించింది. మొత్తంగా ఏడు రోజులకు తెలుగు రాస్ట్రాల నుంచి రూ.59.37 కోట్ల షేర్ ను కొల్లగొట్టింది మహర్షి. ఏడు రోజుల్లో అత్యంత ఎక్కువ కలెక్ట్ చేసిన సిన్మాగా నాన్ బాహుబలి రికార్డును సాధించింది మహర్షి.

ఇంకా రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్‌సీస్ కలెక్షన్ల వివరాలు అందాల్సి ఉంది. అవన్నీ కలుపుకుంటే ఇంకా భారీగా ఏడు రోజుల వసూళ్ళు ఉంటాయి. మహర్షి నిర్మాతల్లో ఒకరైన శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ వారు తమ ట్విట్టర్ ఖాతా ద్వారా ఒక పోస్టర్ ను విడుదల చేసారు. సూపర్ స్టార్ కెరీర్ లో మొదటి వారంలో ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఎక్కువ గ్రాస్ కలెక్ట్ చేసిన సినిమాగా మహర్షి రికార్డు సృష్టించిందని దాని మీద డిక్లేర్ చేసారు.

ప్రపంచవ్యాప్తంగా మహర్షి మొదటి వారానికి ఎంత కలెక్ట్ చేసింది అని మాత్రం వారు వెల్లదించలేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రేక్షకలోకం మహర్షి సినిమాకు నీరాజనం పలుకుతున్నారు. రైతు నేపథ్యంలో చిత్రీకరించిన పలు సన్నివేశాలు అన్నివర్గాల ప్రేక్షకులను కట్టి పడేస్తున్నాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్స్ అన్నీ హౌస్‌ఫుల్ బోర్డులతో దర్శనమిస్తూ డిస్ట్రిబ్యూటర్లకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి.

ఇంత పెద్ద సక్సెస్ సాధించడంతో ఫ్యాన్స్ కి థ్యాంక్స్ చెప్పేందుకు బుధవారం (మే 15) నాడు సుద‌ర్శ‌న్ 35 ఎం.ఎం థియేట‌ర్‌కి మహేష్ బాబు మహర్షి టీం తో సహా వెళ్ళి వారిని కలిసారు. అదే వేదికపై మహర్షి సినిమా విజ‌యోత్స‌వ వేడుక‌ తేదీని ప్ర‌క‌టించారు. విజ‌య‌వాడ‌లో ఈ నెల 18న పెద్ద ఎత్తున స‌క్సెస్ ఈవెంట్‌ని నిర్వ‌హించ‌నున్నారని చెప్పారు.

స్నేహం, సామాజిక ఇతివృత్తం, సందేశాత్మకంగా ఉన్న ఈ సినిమాకు పలువురు ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిపస్తున్నారు. ‘మహర్షి’ సినిమాతో రైతుల గురించి చెప్పడంతో ఏకంగా భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు ఈ చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలియజేసారు. మహర్షి ఎఫెక్ట్‌తో వీకెండ్ వ్యవసాయం అనే నయా ట్రెండ్ క్రియేట్ అయింది.

నగరాల్లోని యువత వీకెండ్‌లో తమ సొంతూరుకెళ్లి పొలాల్లో ఫోటోలు దిగుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. మహర్షి చూసిన ప్రతి ప్రేక్షకుడు కథకు బాగా కనెక్ట్ అవుతున్నారు. చూసిన ప్రతీ ఒక్కరూ 25వ సినిమా అంటే ఇలా ఉండాలి అని మహర్షి ని ప్రశంసిస్తున్నారు. ముందు ముందు మహర్షి మరిన్ని కొత్త రికార్డులను నెలకొల్పడం ఖాయం.

స్టార్ క‌థానాయ‌కుల సినిమాలంటే ఇలానే ఉండాలి అనే నియ‌మాన్ని ఎప్పుడో పక్కన పెట్టి కొత్త రూల్స్ ను రాసిన స్టార్ సూపర్ స్టార్ మహేష్ బాబు. క‌మ‌ర్షియ‌ల్ చట్రాల్లో ఉంటూనే, సామాజిక నేప‌థ్యం ఉన్న క‌థ‌ల్ని ఎంచుకునే సాహ‌సం చేయడంలో ఎప్పుడూ ముందు ఉండే ఏకైక స్టార్ ఆయన. అభిమానుల్ని సంతృప్తిప‌రుస్తూనే ఏదో ఓ స‌మ‌స్య‌ని వేలెత్తి చూపిస్తూ ఉంటారు.

అందుకు త‌గిన ప‌రిష్కార మార్గాన్నీ సూచిస్తున్నారు. మ‌హేష్ బాబు ఈ దారిలోనే వెళ్లి ‘శ్రీ‌మంతుడు’, ‘భ‌ర‌త్ అనే నేను’ అనే సినిమాల్ని చేశారు. అవి క‌మర్షియ‌ల్ విజ‌యాల్ని అందుకుంటూనే మ‌హేష్‌కి మంచి పేరు తీసుకొచ్చాయి. ఈసారి త‌న 25వ సినిమాకీ అలాంటి ఒక మంచి కథను ఎంచుకుని ‘మ‌హర్షి’గా మారారు. దీంతో సూపర్ స్టార్ పై ప్రశంసల వర్షంతో పాటు కలెక్షన్లు కూడా భారీగా కురుస్తున్నాయి.

Share

Leave a Comment