అంతలా ఇన్‌స్పైర్ చేసింది

గజిని, సింగం సిరీస్ లాంటి చిత్రాలతో సూర్య తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా చేరువయ్యారు. సూర్య నటించిన ప్రతి చిత్రం తెలుగులో కూడా అనువాదం అవుతూ ఉంటుంది. ఇటీవల సూర్య నటించిన చిత్రం ఎన్జీకే. సీనియర్ దర్శకుడు సెల్వరాఘవన్ ఈ చిత్రానికి దర్శకుడు. ఈ సందర్భంగా హైదరాబాద్‌ వచ్చి సినిమా ప్రమోషన్లలో పాల్గొన్నారు సూర్య.

మీడియాతో ముచ్చటిస్తూ పలు విషయాలను పంచుకున్నారు ఆయన. ఈ సందర్భంగా సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి అలాగే మహర్షి సినిమా గురించి కూడా ఆయన ముచ్చటించారు. ‘చిన్నప్పుడు నేను, మహేష్ బాబు ఒకే స్కూల్ లో చదువుకున్నాం. మా స్కూల్ నుంచి చాలా మంది ఇప్పుడు సినిమాల్లో ఉన్నారు. మంచి మెమొరీస్ అవి.

మహర్షి సినిమా చూసాను. చాలా బాగుంది. వంశీ గారికి పర్సనల్ గా ఫోన్ చేసి సినిమా గురించి ఏం చెప్పలేదు. ఇప్పుడు మీ అందరి ముందు వాళ్ళకు చెప్తున్నాను. నాకు మహర్షి సినిమా చాలా బాగా నచ్చింది. ఈ సినిమాను నేను చెన్నైలో చూసాను. హౌస్‌ఫుల్ ధియేటర్ లో ఈ సినిమాను చూసాను. మహర్షితో సూపర్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ వచ్చింది అందరికి.

చాలా నచ్చింది నాకు. చాలా ప్లెసెంట్ సినిమా చూసిన ఫీలింగ్ వచ్చింది. అసలు చాలా లెంగ్ట్ ఉన్న సినిమా చూసిన ఫీలింగే రాలేదు. సినిమాలో ఎన్ని లేయర్స్, ఎన్ని వేరియేషన్స్, ఎన్ని స్టోరీస్ ఉన్నాయి. సూపర్బ్ గా ఉంది. ఇంకా నేను సోషల్ మీడియాలో చాలా పోస్ట్ లు చూసాను. మహర్షి సినిమా చూసి వీకెండ్ ఫార్మింగ్ అని ఎంతో మంది కిడ్స్ ఫొటోలు పెట్టారు.

మహర్షి అంతలా ఇన్‌స్పైర్ చేసింది అందరినీ. చాలా మంచి సినిమా’ అని చెప్పారు సూర్య. సూర్య‌, సాయి ప‌ల్ల‌వి, ర‌కుల్ ప్రీత్ సింగ్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో తెర‌కెక్కిన చిత్రం ఎన్‌జీకే. సూర్య ఫ్యామిలీకి మహేష్ ఫ్యామిలీకి మంచి రిలేషన్ యే ఉంది. సూర్య సోదరుడు కార్తి, మహేష్ స్కూల్ లో సేం బ్యాచ్. వాళ్ళిదరికి మంచి స్నేహం ఉంది.

మహర్షి షూటింగ్ టైమ్‌లో కార్తి సెట్స్ కు వచ్చి మహేష్ తో ముచ్చటించిన సంగతి తెలిసిందే. ఇది వరకు కూడా అనేక సందర్భాలలో మహేష్ గురించి తెలియజేసారు కార్తి. ‘మహేష్ సిన్‌సియర్ పెర్ఫార్మర్. మహేష్ దగ్గర నుంచి వాట్ ఉయ్ కన్ సీ ఈజ్ సిన్‌సియర్ పెర్ఫార్మన్స్. సిన్‌సియరిటీ, షార్ప్‌నెస్ హిస్ మైన్‌టైండ్ లైక్ దట్. ఆ టైం లో నాకు మహేష్ లో ఈ యాంగిల్ తెలీదు ఇంత మంచి యాక్టర్ అని.

స్కూల్‌లో ఉన్నప్పుడు మహేష్ లో ఆ ఫోర్స్ నేను చూడలేదు. బట్ ఫిలింస్ లో మాత్రం సూపర్బ్. ఐ బికేం హిస్ ఫ్యాన్ ఆఫ్టర్ సీయింగ్ హిస్ ఫిలింస్. ఐ జస్ట్ లవ్ హిస్ పెర్ఫార్మన్స్’ అని చెప్తారు కార్తి. వైజయంతి మూవీస్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పీవీపీ సినిమా బ్యానర్లపై సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన మహర్షి చిత్రం బాక్సాఫీస్ వద్ద చెలరేగిపోతున్నది.

అయిదు వారాలు దాటినా కలెక్షన్ల ధాటిని కొనసాగిస్తూ దూసుకుపోతున్నది. నేషనల్ మల్టీప్లెక్స్ లలో గత అయిదు వారాంతాల్లో ఎక్కువ మంది చూసిన సినిమాగా మహర్షి నిలిచింది. భారత్ ని వెనుకకి నెడుతూ ఈ వీకెండ్ కూడా మొదటి స్థానంలో నిలిచింది మహర్షి. అంటే సల్మాన్ ఖాన్ సినిమా మొదటి వీకెండ్ ఆక్యుపెన్సీ ని అయిదో వారంలో ఉన్న మహేష్ బాబు సినిమా దాటేసింది అనమాట.

ఈ ఘనాంకాలు ఇండియా మొత్తంలో ఉన్న మల్టీప్లెక్స్ లవి. ఇది మహేష్ బాబు కు దేశవ్యాప్తంగా ఉన్న ఫాలోయింగ్ మరియు క్రేజ్ కు నిదర్శనంగా చెప్పవచ్చు. మహర్షి అయిదు వారాలుగా నెంబర్ వన్ గా కొనసాగుతుందంటే ఆ ఘనత సూపర్‌స్టార్ మహేష్ బాబు దే అని చెప్పాలి. నాలుగో వీకెండ్ కన్నా అయిదో వీకెండ్ కి ఆక్యుపెన్సీ పెరగడం గమనార్హం.

నాలుగో వీకెండ్ 62 శాతం ఉంటే అయిదో వీకెండ్ కి అది 64 శాతం కు చేరింది. మహర్షి కి ఇంకా ఈ రేంజ్ లో ఆదరణ లభిస్తుందంటే అది మహేష్ స్టార్‌డమ్ వల్లే అని అందరూ ఒప్పుకునే నిజం. మహేష్ స్టార్ పవర్ కి మంచి కథ కూడా తోడవడంతో మహర్షి జనాల్లోకి అంతలా చొచ్చుకుపోయింది. స్నేహం, సామాజిక ఇతివృత్తం, సందేశాత్మకంగా ఉన్న ఈ సినిమాకు ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిపస్తున్నారు.

మహర్షి సక్సెస్‌ తర్వాత ఫ్యామిలీతో కలసి ఆయన ఫారిన్‌ ట్రిప్‌ వెళ్లిన సంగతి తెలిసిందే. కుటుంబంతో క్వాలిటీ టైమ్‌ను ఎంజాయ్‌ చేస్తున్నారు. ప్రస్తుతం ఇంగ్లాండ్ లో ఇండియా క్రికెట్ ప్రపంచ కప్ మ్యాచులు ఎంజాయ్ చేస్తున్న ప్రిన్స్ త్వరలోనే తిరిగి రానున్నట్టు తెలిసింది. తిరిగొచ్చాక అనీల్ రావిపూడితో క‌లిసి మ‌హేష్ త‌న 26వ సినిమా సరిలేరు నీకెవ్వరు షూటింగ్ లో పాల్గొననున్నారు.

Share

Leave a Comment