దుమ్మురేపుతున్న మహర్షి

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం ‘మహర్షి’. ఈ నెల 9న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. విడుదలైన నాలుగు రోజుల్లోనే రూ.100 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమాలో మూడు గెటప్‌ల్లోనూ మహేష్ అభిమానులను అమితంగా ఆకట్టుకున్నాడు.

ముఖ్యంగా రైతులకు సంబంధించిన సన్నివేశాలు యూత్‌ని సైతం బాగా ఆకట్టుకున్నాయి. సినిమా చూసిన వారంతా వీకెండ్ వ్యవసాయం చేసి ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఒకరకంగా ఇది సినిమా జనాల్లోకి ఎంతలా చేరువయ్యిందో తెలపడానికి ఎంతగానో ఉపయోగపడుతోంది. అతి తక్కువ సమయంలో రూ.100 కోట్ల క్లబ్‌లో చేరడంతో ‘మహర్షి’ చిత్రబృందం ఆనందంలో మునిగి తేలుతోంది.

సూపర్ స్టార్ కెరీర్లో 25వ చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రం ఫస్ట్ వీకెండ్ తెలుగు రాష్ట్రాల్లో రూ.49 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ వసూలు చేసి ట్రేడ్ వర్గాల్లో హ్యాపీ మూడ్ క్రియేట్ చేసింది. మహర్షి సోమవారం వసూళ్లు అదరగొట్టే స్థాయిలోనే ఉన్నాయి. వీక్ డే సోమవారం టెస్ట్ కూడా పాసైంది. నైజాం ఏరియాలో మహర్షి మూవీ ముందు నుంచి అదరగొడుతోంది.

అయిదో రోజు కూడా తన దూకుడు ను కొనసాగించింది. తొలి 4 రోజుల్లో రూ. 16.61 కోట్ల షేర్ వసూలు చేసి నాన్ బాహుబలి రికార్డ్ నెలకొల్పిన సంగతి తెలిసిందే. అయిదవ రోజు సైతం ప్రేక్షకుల ఆదరణ తగ్గలేదు. సోమవారం రూ. 2.31 కోట్ల షేర్ వసూలు చేసింది. దీంతో టోటల్ షేర్ దాదాపు 19 కోట్లకు రీచ్ అయింది.

కోట్ల కళ్ళు చెదిరే షేర్ తో నాన్ బాహుబలి రికార్డ్ ను సాధించింది. నైజాం ఏరియాలో సూపర్‌ స్టార్ కు ఏ రేంజ్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తాను నైజాం నవాబ్ అని మరో సారి చాటిచెప్పాడు. తొలివారం పూర్తయ్యే సమయానికి నాన్ బాహుబలి రికార్డ్ ను నెలకొల్పే దిశగా దూసుకెళ్తుంది మహర్షి.

కృష్ణ జిల్లాలో సైతం మహర్షి సోమవారం నాడు సంతృప్తికర వసూళ్లు సాధించింది. ఇక్కడ తొలి 4 రోజుల్లో రూ. 3.62 కోట్ల షేర్ తో నాన్ బాహుబలి రికార్డ్ ను సాధించింది. అయిదవ రోజుతో మొత్తం వసూళ్లు రూ. 3.9 కోట్లకు చేరుకుంది. కృష్ణ జిల్లాలో అయిదో రోజు 0.27 కోట్ల షేర్ ను కొల్లగొట్టింది మహర్షి. నాలుగో రోజు 0.83 కోట్ల కోట్లు వసూలు చేసింది.

గుంటూరు ఏరియాలో మహర్షి చిత్రం తొలి 4 రోజుల్లో రూ. 5.90 కోట్ల షేర్ వసూలు చేసింది. అయిదవ రోజుతో ఈ మొత్తం రూ. 6.12 కోట్లకు చేరుకుంది. సోమవారం రూ. 0.23 కోట్ల షేర్ వసూలు చేసింది. తొలి రోజు రూ. 4.40 కోట్లు తో నాన్ బాహుబలి రికార్డ్, రెండో రోజు 0.49 కోట్లు, మూడో రోజు 0.45 కోట్ల షేర్, నాలుగో రోజు 0.55 కోట్ల షేర్ ను వసూలు చేసింది.

ఉభయ గోదావరి జిల్లాల్లో అయిదో రోజూ మహర్షి జోరు కొనసాగింది. ఈస్ట్ గోదావరి లో మహర్షి తన జోరును కొనసాగించాడు. ఈస్ట్ గోదావరి లో అయిదో రోజు రూ. 0.30 కోట్లు వసూలు చేసింది. తొలి రోజు రూ. 3.20 కోట్లు, రెండో రోజు 0.60 కోట్లు , మూడో రోజు రూ. 0.59 కోట్ల షేర్, నాలుగో రోజు రూ. 0.53 కోట్ల షేర్ ను వసూలు చేసింది.

మొత్తంగా ఈస్ట్ గోదావరి జిల్లాలో అయిదు రోజులకు 5.22 కోట్ల షేర్ ను సాదించింది. వెస్ట్ గోదావరి, ఉత్తరాంధ్రా, నెల్లూరు అలాగే సీడెడ్ లో అయిదో రోజు మంచి షేర్ ను సాధించినట్లు సమాచారం. మొత్తంగా తెలుగు రాష్ట్రాల నుంచి అయిదో రోజు 4 కోట్లకు పైగా షేర్ ను వసూలు చేసింది. దీంతో అయిదు రోజుల టోటల్ షేర్ 53 కోట్లకు పైగా చేరింది.

ఇది నాన్ బాహుబలి రికార్డ్. రైతులతో పాటు నగర వాసులకు, యువతకు కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్ కావడంతో ప్రతి ఒక్కరి నుంచి సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్‌తో పాటు ప్రశంసల దక్కుతున్నాయి. మండుటెండల బారినుంచి ఉపశమనం పొందేందుకు నగర యువత, చిన్నారులు పొలం బాట పడుతున్నారు. పల్లెలు.. పంట పండించే అన్నదాతల పట్ల పెరుగుతున్న అభిమానం వారిని మాగాణుల వైపు అడుగులు వేయిస్తున్నాయి.

మారిన జీవనశైలితో కాస్త కొత్తదనం, చిన్నారులకు బయటి ప్రపంచాన్ని పరిచయం చేయాలనే ఆలోచనతో పల్లె వాతారణాన్ని పలకరిస్తున్నారు. వికారాబాద్‌ సమీపంలోని ఓ యాక్టివ్‌ ఫామ్‌ స్కూల్‌లో పెంపుడు జంతువులు, పక్షులతో గడిపేందుకు మాగాణి, మెట్ట పంటలు పండించే విధానాన్ని తెలుసుకునేందుకు పంటభూముల్లోని తడిమట్టితో ఆటలాడుకునేందుకు ప్రజలు ఇష్టపడుతున్నారని నిర్వాహకుడు వంశీ తెలిపారు.

మహేష్ బాబు నటించిన మహర్షి సినిమా ప్రభావం.. యువత, చిన్నారులపై ప్రభావం చూపిందనేందుకు ఇదే నిదర్శనం అంటున్నారు. అక్కడకు వచ్చిన సందర్శకులు రైతన్నలు పడే కష్టాన్ని గుర్తించి సాయం చేసేందుకు ముందుకు రావటం శుభపరిణామం అంటూ తన అనుభవాన్ని పంచుకున్నారు. మహర్షి ఘనవిజయం సాధించడంతో ఆనందోత్సాహంలో మునిగిపోయింది చిత్రయూనిట్. ఇప్పటికే ఈ విజయం పట్ల ప్రేక్షకులకు, చిత్ర యూనిట్ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు.

Share

Leave a Comment