ఇండియాలోనే నెంబర్ వన్

సూపర్‌స్టార్ మహేష్ బాబు నటించిన ‘మహర్షి’ సినిమా మే 9 న రిలీజ్ అయ్యి ప్రేక్షకుల నుండి అద్భుతమైన్స్ రెస్పాన్స్ ని అందుకుంది. ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు నుండి బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతుంది. ముఖ్యమైన అన్ని సెంటర్లలో కొత్త రికార్డులను లిఖిస్తూ ముందుకు సాగిపోతుంది మహర్షి.

ఇప్పటికే ఎన్నో రికార్డులను తిరగరాస్తున్న మహర్షి ఇంకో ప్రత్యేకమైన రికార్డును కూడా తన ఖాతాలో వేసుకుంది. అదేంటంటే నేషనల్ మల్టీప్లెక్స్ లలో గత అయిదు వారాంతాల్లో ఎక్కువ మంది చూసిన సినిమాగా మహర్షి నిలిచింది. ఇది చాలా గొప్ప విషయం. ఎందుకంటే నేషనల్ మల్టీప్లెక్స్ లలో అన్ని బాషల సినిమాలు విడుదల అవుతాయి.

ఎప్పటికప్పుడు ప్రతీ వారం కొత్త సినిమాలు విడుదల అవుతూనే ఉంటాయి. పైగా ఈ వారం రంజాన్ స్పెషల్ గా సల్మాన్ ఖాన్ నటించిన ‘భారత్’ విడుదల అయ్యింది. సల్మాన్ ఖాన్ సినిమా పైగా మొదటి వీకెండ్, అయినా కూడా మహేష్ బాబు మహర్షి జోరు ఏమాత్రం తగ్గలేదు. భారత్ ని వెనుకకి నెడుతూ ఈ వీకెండ్ కూడా మొదటి స్థానంలో నిలిచింది మహర్షి.

అంటే సల్మాన్ ఖాన్ సినిమా మొదటి వీకెండ్ ఆక్యుపెన్సీ ని అయిదో వారంలో ఉన్న మహేష్ బాబు సినిమా దాటేసింది అనమాట. ఈ ఘనాంకాలు ఇండియా మొత్తంలో ఉన్న మల్టీప్లెక్స్ లవి. ఇది మహేష్ బాబు కు దేశవ్యాప్తంగా ఉన్న ఫాలోయింగ్ మరియు క్రేజ్ కు నిదర్శనంగా చెప్పవచ్చు. మహర్షి అయిదు వారాలుగా నెంబర్ వన్ గా కొనసాగుతుందంటే ఆ ఘనత సూపర్‌స్టార్ మహేష్ బాబు దే అని చెప్పాలి.

మహర్షి విడుదలైన మొదటి వారాంతం అంటే మే 10-12 వరకు 73 శాతం ఆక్యుపెన్సీ తో నేషనల్ మల్టీప్లెక్స్ లలో మహర్షి మొదటి స్థానంలో నిలిచింది. విడుదలైన మొదటి వారం గనుక సూపర్ స్టార్ క్రేజ్ కి మొదటి స్థానంలో ఉండటం పెద్ద విషయం ఏమీ కాదు. అది అందరూ ఊహించిన విధంగానే మొదటి స్థానంలో నిలిచింది.

ఇక రెండో వారాంతం అంటే మే 17-19 వరకు 65 శాతం ఆక్యుపెన్సీ తో, మూడో వారం అంటే మే 24-26 వరకు 65 శాతం ఆక్యుపెన్సీ తో మొదటి స్థానంలోనే కొనసాగింది మహర్షి. రెండో వారానికి మూడో వారానికి ఆక్యుపెన్సీ లో ఏ మాత్రం తేడా లేకపోవడం మహేష్ స్టార్‌డమ్ కి నిదర్శనం. ఇక నాలుగో వారాంతం అంటే మే 31- జూన్ 2 వరకు 62 శాతం ఆక్యుపెన్సీ తో మొదటి స్థానంలోనే కొనసాగింది మహర్షి.

ముడో వారానికి నాలుగో వారానికి ఆక్యుపెన్సీ లో పెద్దగా మార్పు ఏం లేదు. ఇక అయిదో వారం భారత్ విడుదల అవ్వడంతో మహర్షి ఆక్యుపెన్సీలో తగ్గుదల ఉంటుందని అనుకున్నారు. కానీ తన అయిదో వారాంతంలో కూడా జూన్ 7-9 వరకు 64 శాతం ఆక్యుపెన్సీ తో సూపర్ స్టార్ కు అసలైన అర్థం చెప్పారు మహేష్. నాలుగో వీకెండ్ కన్నా అయిదో వీకెండ్ కి ఆక్యుపెన్సీ పెరగడం గమనార్హం.

నాలుగో వీకెండ్ 62 శాతం ఉంటే అయిదో వీకెండ్ కి అది 64 శాతం కు చేరింది, అంటే దాదాపు రెండో వీకెండ్ కు సమానం అనమాట. మహర్షి కి ఇంకా ఈ రేంజ్ లో ఆదరణ లభిస్తుందంటే అది మహేష్ స్టార్‌డమ్ వల్లే అని అందరూ ఒప్పుకునే నిజం. మహేష్ స్టార్ పవర్ కి మంచి కథ కూడా తోడవడంతో మహర్షి జనాల్లోకి అంతలా చొచ్చుకుపోయింది.

ఇలాంటి ఎన్నో రికార్డులను సృష్టిస్తుంది మహర్షి. నైజాంలో మహర్షి ఇప్పటికి రూ.31 కోట్లకు పైగా షేర్ ను వసూలు చేసి బాహుబలి సినిమాల తరువాత 30 కోట్ల షేర్ వసూలు చేసిన మొదటి సినిమాగా రికార్డు నెలకొల్పింది. ఉత్తరాంధ్రాలో రూ.12 కోట్లకు పైగా షేర్ సాధించి సూపర్ స్టార్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది మహర్షి.

చూస్తుంటే మహర్షి జోరు ఇప్పటిలో ఆగేలా లేదు. మరో వారం రోజులు ఈ సినిమా జోరుగానే వసూళ్లు రాబడుతుందని అంటున్నారు ట్రేడ్ పండితులు. మహేష్ నటించే ప్రతి సినిమా సంథీంగ్ స్పెషల్ అనే విధంగా ఉంటాయి. శ్రీమంతుడు చిత్రంలో ఊళ్ళను దత్తత తీసుకొని అక్కడి వారి కష్టాలు ఎలా తీర్చాలో అన్న కాన్సెప్ట్ అదిరిపోయింది. తర్వాత వచ్చిన భరత్ అనే నేను రాష్ట్రాభివృద్ది కోసం నిధులు ఎలా వినియోగించుకోవాలి, ప్రజల నమ్మకాన్ని డబ్బు తో కాదు అభివృద్ది చూపించి గెల్చుకోవాలన్న కాన్సెప్ట్ సూపర్ గా ఉంది.

ఇక ఇప్పుడు మహర్షి. ఈ చిత్రాన్ని రైతు సమస్యలపై అద్భుతంగా ఆవిష్కరించారు. రైతులకు సరైన గౌరవాన్ని ఇవ్వాలని, వారిని దోచుకుంటున్న దళారీలను తరిమి కొట్టేది సామాన్య ప్రజలే అని ఎన్నో మంచి విషయాలు ఈ చిత్రంలో చూపించారు. వారాంతపు వ్యవసాయం, సామాజిక సమస్యల నేపథ్యంలో తెరకెక్కిన మహర్షి అందరి ప్రశంసలు అందుకుంటుంది.

మహర్షి సక్సెస్‌ తర్వాత ఫ్యామిలీతో కలసి మహేష్ ఫారిన్‌ ట్రిప్‌ వెళ్లిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇంగ్లాండ్ లో ఇండియా క్రికెట్ ప్రపంచ కప్ మ్యాచులు ఎంజాయ్ చేస్తున్న ప్రిన్స్ త్వరలోనే తిరిగి రానున్నట్టు తెలిసింది. తిరిగొచ్చాక అనీల్ రావిపూడితో క‌లిసి మ‌హేష్ త‌న 26వ సినిమా సరిలేరు నీకెవ్వరు షూటింగ్ లో పాల్గొననున్నారు.

ఈ సినిమాను దిల్ రాజు, రామబ్రహ్మం సుంకర, మహేష్ బాబు కలిసి సంయుక్తంగా నిర్మిస్తుండటం విశేషం. సరిలేరు నీకెవ్వరు పై ఇంకా షూటింగ్ కూడా మొదలవకుండానే అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఏకధాటిగా షూటింగ్ చేస్తూ 2020 సంక్రాంతి కానుకగా సరిలేరు నీకెవ్వరు ను మన ముందుకు తేవాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నారు.

Share

Leave a Comment