సూపర్ సీఈఓ ను కలవండి

సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు హీరోగా, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌. వైజయంతి, పివిపి సినిమా పతాకాలపై రూపొందుతున్న భారీ చిత్రం మహర్షి రిలీజ్‌కి రెడీ అవుతోంది. వచ్చే నెల 9న భారీ అంచనాల నడుమ మనందరి ముందుకు రాబోతున్నాడు మహర్షి. దాంతో ప్రమోషనల్‌ కార్యక్రమాల స్పీడ్‌ పెంచింది చిత్ర బృందం.

మహర్షి కౌంట్ డౌన్ తో అభిమానులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వాళ్లకు జోష్ ఇచ్చేందుకు అన్నట్టు కొద్ది రోజుల క్రితం ఫ్రెండ్ షిప్ సాంగ్ ని రిలీజ్ చేసిన మహర్షి టీమ్ తాజాగా మహర్షి స్వభావాన్ని ప్రతిబింబించే పాటను సినిమా నుంచి రెండో సింగిల్ గా విడుదల చేసింది.‘నువ్వే సమస్తం… నువ్వే సిద్ధాంతం..’ అంటూ సాగే పాటను ను శుక్రవారం రిలీజ్‌ చేసారు.

‘నువ్వే సమస్తం.. నువ్వే సిద్ధాంతం….నువ్వే నీపంతం, నువ్వేలే అనంతం.. ప్రతి నిసీ మసై.. నీలో కసే దిశై.. అడుగేైసెయ్ మిసైలులా’ అంటూ శ్రీమణి రాసిన పాటను దేవిశ్రీప్రసాద్ స్వరపరచగా, యాజిన్ నిజార్ ఎంతో ఉద్వేగంతో గానం చేశారు. శ్రీమణి సాహిత్యం అందర్నీ ఆకట్టుకునేలా ఉండడం వల్ల ఈ పాట మరో సెన్సేషన్ క్రియేట్ చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

అసలైన మేజిక్ లిరికల్ వీడియోలో ఉంది. మహేష్ సూపర్ కూల్ లుక్స్ తో అందరినీ కట్టిపడేస్తున్నాడు. ఓ పెద్ద కంపెనీకి సిఈఓగా అల్ట్రా స్టైలిష్ గా మహేష్ ను ప్రెజెంట్ చేసిన తీరు చూస్తే ఈ పాటను మళ్ళీ మళ్ళీ రిపీట్ మోడ్ లోకి వెళ్ళడానికి ఇవి చాలనిపిస్తుంది. ఈ పాటలో మహేష్ ను చూసి ధియేటర్లు దద్దరిల్లడం ఖాయం. ఆ సూపర్ హ్యాడ్‌సం స్టాలిష్ సీఈఓ ను మీరు కూడా కలవండి.

1)

2)

3)

4)

5)

6)

7)

8)

యువతకు స్ఫూర్తి గీతంగా నిలిచిపొయ్యేలా వుంది నువ్వే సమస్తం. లిరిసిస్ట్ శ్రీమణి ఇచ్చిన ఇన్స్‌పిరేటివ్ లైన్స్‌ని పటిష్టమైన గొంతుతో పాడి అలరించాడు సింగర్ యాజిన్ నిజార్. బీట్స్‌లో దేవిశ్రీ మార్క్ స్పష్టంగా కనిపించింది. చాలా శక్తివంతమైన పదాలతో శ్రీమణి మహర్షి వ్యక్తిత్వాన్ని వర్ణించిన తీరు హీరోయిజంకి నిజమైన డెఫినేషన్ లా ఉంది.

ప్రాసతో ఆడుకున్న వైనం అతని కలంలో పెరుగుతున్న పరిణితిని సూచిస్తోంది. ఈ పాట సినిమాలో రిషి పరిచయ గీతం అయ్యే ఉండాలి. స్లో పాయిజన్ లాగా విజువల్ థింగ్స్ తోడయ్యాక ఈ పాట ఖచ్చితంగా ధియేటర్లో ఊపేయడం ఖాయం. యాజిన్ నిజార్ గాత్రం బాగుంది. రిథమ్ కు తగ్గట్టు పదాలను పలకడంలో ఎలాంటి ఇబ్బంది పడలేదు.

మొత్తానికి ఫాన్స్ ని టార్గెట్ చేసిన రెండో ఆడియో సింగల్ మహర్షిలో మహేష్ పోషిస్తున్న పాత్ర రిషి యొక్క వ్యక్తిత్వాన్ని ని చెప్పే ప్రయత్నం గట్టిగానే చేసింది. దాంట్లో గట్టిగానే సక్సెస్ కూడా సాధించిందని చెప్పి తీరాల్సిందే. మహర్షి మూవీకి సంబంధించిన ప్రతి వార్త ఒక సంచనలంగా మారుతోంది.

ఇంతకుముందే విడుదైలెన ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ ‘ఛోటి ఛోటి ఛోటి బాతే.. మీటి మీటి మీటి యాదే’ యూత్‌కి బాగా కనెక్ట్ అయింది, శ్రోతలను విశేషంగా ఆకట్టుకుంటోంది. మహర్షి చిత్రానికి సంబంధించిన టీజర్ ఉగాది కానుకగా విడుదలై కొన్ని గంటల్లోనే 16 మిలియన్ రియల్ టైమ్ వ్యూస్ సాధించి ఆల్‌టైమ్ రికార్డును క్రియేట్ చేసింది.

రిలీజ్ కు ముందునుంచే భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ పరంగా సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. వరల్డ్ వైడ్ గా ఈ సినిమా థియేట్రికల్ హక్కులు 100 కోట్లకు పైగా అమ్ముడుపోగా.. నాన్ థియేట్రికల్ హక్కులు మరో 45 కోట్ల వరకు అమ్ముడుపోయాయట. ఈ లెక్కన మహర్షి టోటల్ బిజినెస్ అవలీలగా 145 కోట్లకు పై మాటే.

మహేష్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. అల్లరి నరేష్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని మే 9న వరల్డ్‌వైడ్‌గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కె.యు.మోహనన్ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. హరి, సాల్మన్, సునీల్‌బాబు, కె.ఎల్.ప్రవీణ్, రాజు సుందరం, శ్రీమణి, రామ్-లక్ష్మణ్ పనిచేస్తున్న ముఖ్య సాంకేతికవర్గం.

Share

Leave a Comment