గెలుపుకు నిర్వచనం

వచ్చే నెల 9న విడుదల కాబోతున్న సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు 25వ సినిమాగా రూపొందుతున్న మహర్షి కౌంట్ డౌన్ తో అభిమానులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వాళ్లకు జోష్ ఇచ్చేందుకు అన్నట్టు కొద్దిరోజుల క్రితం ఫ్రెండ్ షిప్ సాంగ్ ని రిలీజ్ చేసిన మహర్షి టీమ్ తాజాగా మహర్షి స్వభావాన్ని ప్రతిబింబించే పాటను ఇందాకే సాయంత్రం 4 గంటల 5 నిముషాలకు విడుదల చేసింది.

‘నువ్వే సమస్తం..నువ్వే సిద్ధాంతం..నువ్వే నీ పంతం..నువ్వేలే అనంతం’ అంటూ మహర్షి చిత్రంలోని రెండో లిరికల్‌ వీడియో విడుదలైంది. శ్రీమణి రాసిన సాహిత్యానికి దేవిశ్రీ ప్రసాద్ అందించిన బీట్ బేస్డ్ ట్యూన్ మంచి కిక్ ఇచ్చేలా ఉంది. ఇది బహుసా హీరో పరిచయ గీతం అయి ఉండవచ్చు.

చాలా శక్తివంతమైన పదాలతో గీత రచయిత శ్రీమణి మహర్షి వ్యక్తిత్వాన్ని వర్ణించిన తీరు హీరోయిజంకి నిజమైన డెఫినేషన్ లా ఉంది. ప్రాసతో ఆడుకున్న వైనం అతని కలంలో పెరుగుతున్న పరిణితిని సూచిస్తోంది. అసలైన మేజిక్ లిరికల్ వీడియోలో ఉంది. మహేష్ సూపర్ కూల్ లుక్స్ తో పాటు ఓ పెద్ద కంపెనీకి సిఈఓగా అల్ట్రా స్టైలిష్ గా ప్రెజెంట్ చేసారు.

సూపర్ స్టార్ ను ప్రెసెంట్ చేసిన తీరు చూస్తే మళ్ళీ మళ్ళీ ఇది రిపీట్ మోడ్ లోకి వెళ్ళడానికి ఇవి చాలనిపిస్తుంది. ‘ది ఔరా ఆఫ్‌ రిషి’ పేరుతో ఈ పాటను విడుదల చేశారు. దేవి బెస్ట్ టైటిల్ ట్రాక్ అని చెప్పలేం కానీ స్లో పాయిజన్ లాగా విజువల్ థింగ్స్ తోడయ్యాక పాట ఖచ్చితంగా అందరికీ ఎక్కేస్తుంది అని చెప్పవచ్చు.

యాజిన్ నిజార్ గాత్రం బాగుంది. రిథమ్ కు తగ్గట్టు పదాలను పలకడంలో ఎలాంటి ఇబ్బంది పడలేదు. మొత్తానికి ఫాన్స్ ని టార్గెట్ చేసిన రెండో ఆడియో సింగల్ మహర్షిలో మహేష్ క్యారెక్టర్ రిషి ఎలాంటి వాడో చెప్పే ప్రయత్నం గట్టిగానే చేసింది. గెలుపు ఎలా వస్తుంది, ఓటమి నిన్ను చూసి భయపడాలంటే నీలో ఏముండాలి, నువ్వు ఎలా ఉండాలి అనే థీమ్ తో సాంగ్ ఉండటం విశేషం.

అందులో వంద శాతం సక్సెస్ అయ్యాడని చెప్పవచ్చు. ఇటీవలే ఉగాది సందర్భంగా విడుదల చేసిన టీజర్‌ యూట్యూబ్‌లో దుమ్మురేపింది. కేవలం రిలీజైన 24 గంటల్లోనే 12.6 మిలియన్ వ్యూస్ తో మహర్షి దుమ్ము దులిపేశాడు. అయితే ఈ సినిమా నుండి ఒక్కో సింగిల్‌ని విడుదల చేస్తుంది మహర్షి చిత్ర యూనిట్‌.

అందులో బాగంగా ఈ రోజు నువ్వే సమస్తం అంటూ సాగే లిరికల్‌ సాంగ్‌ విడుదల చేశారు. దిల్ రాజు, అశ్వనిదత్, పివిపి కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మహేష్ సరసన పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో అల్లరి నరేష్ కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడు. మొత్తానికి మహేష్ నుండి మరో అద్భుతమైన సినిమా రాబోతుందని తెలుస్తుంది.

మే 9న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలోని మొదటి సాంగ్ చోటి చోటి బాతె ఇప్పటికే ప్రేక్షకులను అలరించింది. స్టార్ హీరోలకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. అదే సూపర్ స్టార్ మహేష్ బాబుకు అయితే మామూలు స్టార్లకుండే ఫాలోయింగ్ కు నాలుగింతలు ఫాలోయింగ్ ఉంటుంది.

మహేష్ సినిమా కోసం వాళ్ళు ప్రతిసారి ఏడాది వేచి చూడాల్సి ఉంటుంది. అందుకే ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్, లిరికల్ సాంగ్ ఇలా ఏది రిలీజ్ అయినా పండగే. మహర్షి సినిమా నుంచి ఒక్క అప్డేట్ వస్తే చాలు రికార్డ్స్ క్రియేట్ చేయటానికి సోషల్ మీడియాని షేక్ చెయ్యడానికి సిద్ధంగా ఉన్నారు మహేష్ అభిమానులు. మహేష్ బాబు కెరీర్లో ల్యాండ్ మార్క్ 25వ చిత్రం కావడంతో మహర్షి పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

మహేష్‌బాబు పోషించిన రిషి పాత్ర ప్రయాణమే మహర్షి సినిమా. మనలో ప్రతి ఒక్కరి జీవితానికి ఒక ప్రయాణం ఉంది. ఇదీ అంతే. సినిమాలో మూడు విభిన్న కాలాలు ఉంటాయి. అందుకే, మహేష్ మూడు విభిన్న షేడ్స్‌లో కనిపిస్తారు. ఆ మూడు వేరియేషన్లు ప్రేక్షకులకు తెలిసేటట్లు తను టీజర్ ను కట్ చేసానని వంశీ పైడిపల్లి తెలిపారు.

Share

Leave a Comment