మహర్షి ఆల్బమ్‌కు సిద్ధమా?

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు హీరోగా వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న‌ సినిమా ‘మ‌హ‌ర్షి’. పూజా హెగ్డే క‌థానాయిక‌గా నటిస్తున్న‌ ఈ చిత్రంలో అల్ల‌రి న‌రేష్ ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు. మ‌హేష్ కెరీర్‌లో 25వ చిత్రం కావ‌డంతో ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ సినిమాకి దేవిశ్రీ ప్ర‌సాద్ స్వ‌రాల‌ను అందిస్తున్న సంగ‌తి తెలిసిందే.

మొదటగా విడుద‌ల చేసిన‌ ఫస్ట్ సింగిల్‌ ‘చోటీ చోటీ బాతే’ మ‌హేష్ ఫ్యాన్స్‌తో పాటు శ్రోత‌ల‌ను కూడా విశేషంగా అల‌రిస్తోంది. అలాగే సినిమాలో మ‌హేష్ క్యారెక్ట‌ర్ తాలూకు `స‌క్సెస్‌`ఫుల్ జ‌ర్నీని ఎలివేట్ చేస్తూ విడుద‌ల చేసిన సెకండ్ సింగిల్‌ ‘నువ్వే స‌మ‌స్తం’ కి కూడా మంచి రెస్పాన్స్ లభించింది. ‘ఎవరెస్ట్ అంచున’ అంటూ సాగే డ్యూయట్ ను తాజాగా విడుదల చేసారు.

ఈ పాటలో మహేష్, పూజా హెగ్డేల జోడీ చూసి ఫిదా అవుతున్నారు ప్రేక్షకులు. ‘ఎవరెస్ట్ అంచున పూసిన రోజా పువ్వే ఓ చిరునవ్వే విసిరిందే..టెలీస్కోప్ అంచుకి చిక్కని తారే నాతో ప్రేమలో చిక్కానంటోందే..’ అంటూ శ్రీమణి రాసిన లిరిక్స్ చాలా క్యాచీగా ఉన్నాయి. ‘వర్ణాలు ఉండె గడిలో.. కురిసే రంగులు ఎవో..పక్కనే నువ్వే నిలబడి ఉంటే..మెరిసే నా చెంపల్లొ..నొబెల్ ప్రైజ్ ఉంటే..నీకే ఫ్రీజ్ అంతే.. వలపుల సబ్జెక్ట్ లో..’ లాంటి మాటలు అభిమానులను అలరిస్తున్నాయి. పాట ఖచ్చితంగా ఇప్పటి జెనరేషన్ కు తగ్గట్లు చాలా ట్రెండీగా ఉంది.

విడుదల చేసిన పాటలు దేనికవే భిన్నమైన జానర్ కు సంబంధించినవే కావడం విశేషం. దీంతో మహర్షి లో ఒక మంచి మాస్ బీట్ ఉన్న పాట కూడా ఉంటే బావుంటుందని అభిమానుల కోరిక. మహర్షి లో ఒక మంచి మాస్ సాంగ్ కూడా ఉన్నట్లు సమాచారం. ఇక అందరూ ఎదురుచూస్తున్న మహర్షి టైటిల్ సాంగ్ కూడా ఉంది.

మహర్షి టైటిల్ సాంగ్ చార్ట్ బస్టర్ గా నిలవడం ఖాయమని సినీ సర్కిల్స్ మాట. ఏ కమర్షియల్ సినిమా తీసుకున్నా ఆరు పాటలు ఉండడం సహజం. టాలీవుడ్ స‌ర్కిల్స్‌లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం మహర్షి లో రెండు బిట్ సాంగ్స్ కు కూడా చోటు ఉందంట. ఇందులో ఎంత నిజ‌ముందో త్వ‌ర‌లోనే తెలుస్తుంది.

ఇంకా మహర్షి లో ఎలాంటి జానర్ పాటలు ఉన్నాయో తెలియాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే. ఈ సినిమాలో మొత్తంగా ఎన్ని పాట‌లు ఉంటాయో అని సినీ ప్రేక్షకులు ఆరాటపడుతున్నారు. ఈ నెలాఖ‌రులో మ‌హ‌ర్షి నుంచి ఫుల్ ఆల్బ‌మ్ వ‌చ్చే అవ‌కాశ‌ముంది. అంటే ఇంకా కొద్ది రోజులు ఓపిక పడితే మహర్షిలో ఎన్ని పాటలు అన్న సంగతి మనకు తెలుస్తుంది.

ఇప్పటి వరకు విడుదల చేసిన పాటల్లో మొదటి పాటను స్నేహానికి సంబంధించిన అంశాలతో డిజైన్ చేశారు. ఓ పరిచయం ఎప్పుడూ చిన్నదే.. ఈ చెలిమికే కాలమే చాలలే… ఎన్నో వేల కథలు.. ఇంకో కథ మొదలు’ అంటూ సాగే లిరిక్స్ ఆకట్టున్నాయి. ‘నీ కష్టం తనదనుకుంటూ..నీ కలనే తనదిగా కంటూ… నీ గెలుపుని మాత్రం నీకే వదిలేస్తూ…ఎన్నో వేల కథలు… ఇంకో కథ మొదలు’ అంటూ స్నేహంలోని గొప్పతనాన్ని ఆవిష్కరించింది.

‘నువ్వే సమస్తం’ హీరో పరిచయ గీతం అయి ఉండవచ్చు. మహర్షి వ్యక్తిత్వాన్ని వర్ణించిన తీరు హీరోయిజంకి నిజమైన డెఫినేషన్ లా ఉంది. ‘నువ్వే సమస్తం..నువ్వే సిద్ధాంతం..నువ్వే నీ పంతం..నువ్వేలే అనంతం.. ప్రతి నిసీ మసై.. నీలో కసే దిశై.. అడుగేసేయ్ మిసైలులా’ అంటూ మహర్షి లో హీరో క్యారెక్టర్ గురించి గొప్పగా రాసారు.

మూడో పాట ‘ఎవరెస్ట్ అంచున పూసిన రోజా పువ్వే ఓ చిరునవ్వే విసిరిందే..టెలీస్కోప్ అంచుకి చిక్కని తారే నాతో ప్రేమలో చిక్కానంటోందే..’ అంటూ మంచి డ్యుయెట్ సాంగ్ లా ఉంది. ఈ పాట వీడియో ప్రివ్యూను కూడా విడుదల చేశారు. పూజా హెగ్డే సూపర్ గ్లామరస్ గా ఈ పాటలో కనిపిస్తుంది. ఇక మహేష్ బాబు రాక్ స్టార్ లాగా ఉన్నాడు. డార్క్ కలర్ చిరుగుల జీన్స్, పొడవైన బూట్లు, మెరుస్తూ ఉండే జాకెట్ వేసుకున్న మహేష్ పెద్ద గాగుల్స్ కూడా పెట్టుకోవడంతో యమా స్టైలిష్ గా ఉన్నాడు.

ఇక రాబోయే మిగతా పాటల్లో మహర్షి టతిల్ సాంగ్ మరియు మాస్ సాంగ్ కోసం అభిమానులంతా వెయిటింగ్. ఇంకో వారం రోజుల్లో మహర్షి ఆల్బం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. మరి మీరు సిద్ధమా? అభిమానుల ఆశను నిజం చేస్తూ మహేష్ కు తన 25 వ సినిమా ఎప్పటికీ నిలిచిపోయేలా మహర్షి ఉండాలని వారి కోరిక.

అభిమానుల చూపు ప్రీ రిలీజ్ ఈవెంట్ తో పాటు ట్రైలర్ మీద ఉంది. వీటికి సంబంధించిన డేట్స్ ఇంకా ప్రకటించాల్సి ఉంది. చిత్రాన్ని మే 9 వ తేదీన విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సమ్మర్ సీజన్ లో రిలీజ్ కానున్న సినిమాల్లో మహర్షి మీద ఉన్న అంచానాలు మరే ఇతర సినిమాలపై లేవు. అందరి దృష్టి మహేష్ సినిమాపై ఉంది. మహేష్ రేంజ్ స్టార్ హీరో సినిమా లేక డల్ గా ఉన్న బాక్స్ ఆఫీస్ కు మహేష్ కొత్త ఊపిరి ఇవ్వడం ఖాయమని ట్రేడ్ చాలా ఆశలు పెట్టుకుంది.

Share

Leave a Comment