మహర్షి కోసం అరుదైన కలయిక

బాలనటుడిగా కెరీర్ ప్రారంభించి 1999లో రాజకుమారుడు రూపంలో డెబ్యూ మూవీనే హీరోగా సూపర్ హిట్ అందుకున్న మహేష్ బాబుకు మహర్షి 25వ సినిమాగా ప్రత్యేకంగా నిలవనుంది. ఫ్యాన్స్ ఇప్పటికే దీని పట్ల చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నారు. రెండు దశాబ్దాల కెరీర్ లో ఇండస్ట్రీ హిట్స్ తో పాటు తనకు మాత్రమే సాధ్యమయ్యే ప్రత్యేకమైన ఫాలోయింగ్ ని సంపాదించుకున్న మహేష్ సిల్వర్ జూబ్లీ సినిమా ‘మహర్షి’ సంబరాలను స్పెషల్ గా జరిపేందుకు రెడీ అవుతున్నట్టు సమాచారం.

సూపర్‌స్టార్ మహేష్ బాబు 25వ సినిమాగా రాబోతున్న ‘మహర్షి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ మునుపెన్నడూ లేనివిధంగా ప్రత్యేకతను సంతరించుకోనుందని తెలుస్తోంది. కార్మిక దినోత్సవం నాడు మే 1న జరిగే మహర్షి ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం అభిమానులు చాలా ఉత్సాహంతో ఎదురు చూస్తున్నారు. మహేష్ బాబు కెరీర్ లో 25వ సినిమా కాబట్టి వేడుక చాలా స్పెషల్ గా ఉండేలా ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది.

ఇప్పటి వరకూ మహేష్ సినిమాలకు దర్శకత్వం వహించిన దర్శకులందరినీ మహర్షి ప్రీ రిలీజ్ వేడుకపైకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారట యూనిట్ సభ్యులు. అంటే మహేష్ హీరోగా వచ్చిన మొదటి చిత్రం ‘రాజకుమారుడు’ దర్శకులు రాఘవేంద్రరావు గారు మొదలుకొని 25 వ సినిమాగా రాబోతున్న ‘మహర్షి’ దర్శకుడు వంశీ పైడిపెల్లి వరకు అందరు దర్శకులు ఈ వేడుకపై సందడి చేయనున్నారన్నమాట.

దాదాపు అందరూ అందుబాటులోనే ఉన్నారు. ఈజీగా సమీకరించవచ్చు. కాని ఒక్క దర్శకుడు మాత్రం మిస్ అవుతారు. ‘బాబీ’ దర్శకుడు శోభన్ గారు 11 ఏళ్ళ క్రితమే కాలం చేశారు. సో ఆయన తప్ప మిగలిన అందరూ వచ్చే అవకాశం ఉంది. శోభన్ గారు కూడా బ్రతికి ఉంటే నిజంగానే గొప్ప జ్ఞాపకంగా మిగిలేది. ఆయన లేని లోటుని భర్తీ చేసేది కాదు కాబట్టి ఏమి చేయలేని పరిస్థితి.

ఈ విషయంపై అధికారిక ప్రకటన రానప్పటికీ ఇందుకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు ఇప్పటికే పూర్తి చేశారని సమాచారం. ఇదే నిజమైతే గతంలో ఎన్నడూ లేని విధంగా దర్శకులందరినీ ఒకే వేదికపైకి తీసుకొచ్చిన అరుదైన ఘనత సూపర్‌స్టార్ కే దక్కుతుంది. మే 1వ తేదీన సాయంత్రం 6 గంటలకు నెక్లెస్ రోడ్ లోని పీపుల్స్ ప్లాజాలో మహర్షి ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది.

ఇప్పటికే ఆడియోలో నాలుగు పాటలు వచ్చేసాయి కాబట్టి బాలన్స్ పాటల తో పాటు సూపర్‌స్టార్ అభిమానులు అందరూ ఎదురుచూస్తున్న మహర్షి ట్రైలర్ ను కూడా అదే రోజు విడుదల చేసే అవకాశం ఉంది. వంశీ పైడిపెల్లి దర్శకత్వంలో మహేష్ బాబు 25 వ సినిమాగా ఈ చిత్రం రూపొందించబడింది. చిత్రంలో మహేష్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించగా అల్లరి నరేష్ కీలక పాత్ర పోషించారు.

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన అన్ని అప్‌డేట్స్ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశాయి. పైగా ఇది మహేష్ కెరీర్‌లో 25వ సినిమా కావడంతో ప్రేక్షకుల అంచనాలు ఆకాశాన్నంటాయి. చిత్రాన్ని మే 9వ తేదీన విడుదల చేస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన పాటలు మంచి ఆదరణ పొందుతున్నాయి.

తాజాగా ‘పదరా పదరా ఈ వెలుగను పలుగు దించి పదరా’ అంటూ సాగే లిరికల్ సాంగ్ ని విడుదల చేసింది చిత్ర బృందం. చాలా చక్కటి సాహిత్యం తో ఈ పాట ఎంతో అర్ధవంతంగా ఉండటం తో అందరు ఫ్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ పాట వింటుంటే రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయని శంకర్ మహదేవన్ వాయిస్ పాట స్థాయిని పెంచేసిందని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

పదర పదర పదరా ఈ వెలుగను పలుగు దించి పదరా పగుళ్లతో పనికి రానిదను బ్రతుకు భూములిక మెతుకులిచ్చు కదరా.. పదరా పదరా పదరా నీ అడుగుకి పదును పెట్టి పదరా.. ఈ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా..అని సాహిత్యం ఉన్న ఈ పాట అందరిలో స్పూర్తి రగిలించే విధంగా ఉంది.

ఈ పాటకు దేవీ శ్రీ ప్రసాద్ స్వరాలను సమకూర్చగా ప్రముఖ నేపథ్య గాయకుడు శంకర్ మహదేవన్ ఆలపించారు. శ్రీమణి సాహిత్యం అందించారు. ఈ పాట తో శ్రీమణి మరోసారి తన కలం యొక్క ప్రతిభ ని చూపించారు. అద్భుతమైన లిరిక్స్ తో అదరగొట్టారు. అంతే పవర్‌ఫుల్ గా పాడి పాట ని మరో స్థాయి కి తీసుకేళ్ళారు శంకర్ మహదేవన్.

ఎడ్లను కట్టి పొలాన్ని దున్నుతున్న మహేష్ మోడ్రన్ రైతుల కనిపిస్తున్నాడు. చూడటానికి ఎంతో న్యాచురల్ గా ఉన్నందున అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సాహిత్యానికి తగ్గట్టు చిత్రీకరణ ఉండటం తో అభిమానులందరూ ఎప్పుడెప్పుడు ఈ పాట ని చూద్దామా అని వేచి చూస్తున్నారు. ఈ సమ్మర్ సీజన్ లో రిలీజ్ కానున్న సినిమాల్లో మహర్షి మీద ఉన్న అంచానాలు మరే ఇతర సినిమాలపై లేవు.

Share

Leave a Comment