విడుదలకు ముందే సరికొత్త రికార్డులతో

మహేష్ బాబు కెరీర్‌లోనే ల్యాండ్ మార్క్ మూవీగా తెరకెక్కుతున్న చిత్రం మహర్షి. వంశీ పడిపల్లి డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం మహేష్ ఫ్యాన్స్ ఈగర్‌గా వెయింట్ చేస్తున్నారు. కొత్త కన్సెప్ట్‌తో వస్తున్న ఈ సినిమాతో మహేష్ ఖాతాలో మరో హిట్ ఖాయం అంటున్నారు.

మే 9న ప్రేక్షకుల రిలీజ్ కాబోతుంది. ఇందులో మహేష్ మూడు వేరియేషన్స్ ఉన్న పాత్రలో నటిస్తుండటంతో ఈ సినిమా పై అంచనాలు భారీగానే ఉన్నాయి. మునుపెన్నడూ లేని విధంగా భారీ బిజినెస్ చేసింది మహర్షి. బాక్సాఫీస్ లెక్కలు మారూస్తూ సరికొత్త రికార్డులని నెలకొల్పుతున్నాడు మహర్షి.

డిజిటల్‌, శాటిలైట్‌ రూపంలో ఈ చిత్రానికి రూ.47.5 కోట్లు వచ్చినట్టు ట్రేడ్‌ వర్గాలు లెక్కగడుతున్నాయి. ఆడియో హక్కులకు మరో రూ.2 కోట్లు. ఇక ఓవర్సీస్‌ హక్కులను మంచి రేటుకు సొంతం చేసుకున్నారు. ఆంధ్రా, సీడెడ్‌, నైజాం ఇలా ఏరియాల పరంగా కూడా ఈ సినిమాని ఇది వరకే రికార్డు ధరకి అమ్మేశారు.

మొత్తమ్మీద రూ.140 కోట్ల లెక్క పై మాటే తేలుతోంది. విడుదలకు ముందే ఇన్ని రికార్డులను సృష్టిస్తున్న మహర్షి ఇక విడుదల తరువాత ఇండస్ట్రీ రికార్డులను తిరగరాయడం ఖాయం అని ట్రేడ్ వర్గాల మాట. మహర్షి కౌంట్ డౌన్ తో సూపర్‌స్టార్ మహేష్ బాబు అభిమానులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

రోజు ఒక హ్యాష్‌ట్యాగ్ తో మహర్షి ని ట్రెండ్ చేస్తూ తమ ఆతురత ని తెలియజేస్తున్నారు. వాళ్ల ఎదురుచూపులకు ఊరటగా రోజుకో సర్ ప్రైజ్ ఇస్తూ అభిమానులను హ్యాపీగా చేస్తున్నారు మహేష్ మహర్షి చిత్ర యూనిట్. ఇప్పటికే ఛోటీ ఛోటీ బాతేన్, నువ్వే సమస్తం అనే పాటలకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.

తాజాగా ఈ సినిమా నుండి ఎవరెస్ట్ అంచున అనే వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు. దేవి శ్రీ ప్రసాద్ పాడిన ఈపాట కూడా అందరినీ ఆకట్టుకుంటుంది. చాలా రిచ్‌గా, స్టైలిష్‌గా సాంగ్‌ని చిత్రీకరించారు. ఈ పాటలో మహేష్ డిఫరెంట్ లుక్‌లో కనిపిస్తుంటే, పూజా హెగ్డే మరింత గ్లామర్‌గా కనిపిస్తుంది.

మహర్షి సినిమా విషయంలో సూపర్ కాన్ఫిడెంట్ గా ఉన్నానని తెలిపారు మహేష్. “తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలవనుందని… 25వ సినిమా నాకు చాలా స్పెషల్..చిత్రాన్ని డైరెక్టర్ వంశీ పైడిపెల్లి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని రూపొందించారు. మేమంతా సినిమా విడుదల కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నాం” అని తెలిపారు మహేష్.

మహేష్‌ బాబు పోషించిన రిషి పాత్ర ప్రయాణమే ‘మహర్షి’ సినిమా. మనలో ప్రతి ఒక్కరి జీవితానికి ఒక ప్రయాణం ఉంది. ఇదీ అంతే. సినిమాలో మూడు విభిన్న కాలాలు ఉంటాయి. అందుకే, మహేష్ మూడు విభిన్న షేడ్స్‌లో కనిపిస్తారు’ అని వంశీ పైడిపల్లి ఇటివల ఒక ఇంటర్వ్యూలో వెల్లడించిన విషయం తెలిసిందే.

అయితే ‘మహర్షి’పై తనకు పూర్తి నమ్మకం ఉందని వంశీ తెలిపారు. ‘సినిమాకు పనిచేస్తోన్న నటీనటులు, సాంకేతిక నిపుణుల నుంచి నాకు పూర్తి మద్దతు వస్తోంది. రేపు విడుదలైన తరవాత ‘మహర్షి’ని ప్రేక్షకులు కచ్చితంగా ఆదరిస్తారనే ఆత్మవిశ్వాసాన్ని వారు నాకు కలిగించారు’ అని వంశీ కొనియాడారు.

మహేష్ సినిమాలన్నీ కాసేపు నవ్విస్తూ….కొంతైనా నేర్పిస్తూ అన్న చందంగా ముందుకు సాగిపోతున్నాయి. మ‌హేష్ కెరీర్‌లో 25వ చిత్రం కావ‌డంతో ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అంచనాలకి ఏ మాత్రం తగ్గకుండా అందరికీ నచ్చేలా సినిమా ఉండబోతుంది అని మహర్షి టీం కాంఫిడెంట్ గా ఉన్నారు.

మనలోని ప్రతి ఒక్కరి కథ ఇదని, ఓ సామాన్య యువకుడు తన జీవన ప్రయాణంలో మహర్షిగా ఎలా మారాడన్నది కథ. చివరి వారానికి ఫైనల్ కాపీ రెడీ చేయబోతున్నారు. ట్రైలర్ ప్లస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. మరి అందరి అంచనాలను మహర్షి ఎంతవరకు నిలబెడుతాడో చూడాలి.

Share

Leave a Comment