మహర్షి ఆరవ రోజు రికార్డులు

స్టార్ క‌థానాయ‌కుల సినిమాలంటే ఇలానే ఉండాలి అనే నియ‌మాన్ని ఎప్పుడో పక్కన పెట్టి కొత్త రూల్స్ ను రాసిన స్టార్ సూపర్ స్టార్ మహేష్ బాబు. క‌మ‌ర్షియ‌ల్ చట్రాల్లో ఉంటూనే, సామాజిక నేప‌థ్యం ఉన్న క‌థ‌ల్ని ఎంచుకునే సాహ‌సం చేయడంలో ఎప్పుడూ ముందు ఉండే ఏకైక స్టార్ ఆయన. అభిమానుల్ని సంతృప్తిప‌రుస్తూనే ఏదో ఓ స‌మ‌స్య‌ని వేలెత్తి చూపిస్తూ ఉంటారు.

అందుకు త‌గిన ప‌రిష్కార మార్గాన్నీ సూచిస్తున్నారు. మ‌హేష్ బాబు ఈ దారిలోనే వెళ్లి ‘శ్రీ‌మంతుడు’, ‘భ‌ర‌త్ అనే నేను’ అనే సినిమాల్ని చేశారు. అవి క‌మర్షియ‌ల్ విజ‌యాల్ని అందుకుంటూనే మ‌హేష్‌కి మంచి పేరు తీసుకొచ్చాయి. ఈసారి త‌న 25వ సినిమాకీ అలాంటి ఒక మంచి కథను ఎంచుకుని ‘మ‌హర్షి’గా మారారు.

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం ‘మహర్షి’. ఈ నెల 9న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. విడుదలైన నాలుగు రోజుల్లోనే రూ.100 కోట్ల గ్రాస్ వసూలు చేసిన ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో అయిదు రోజులకు రూ.53 కోట్లకు పైగా డిస్ట్రిబ్యూటర్ షేర్ వసూలు చేసి ట్రేడ్ వర్గాల్లో హ్యాపీ మూడ్ క్రియేట్ చేసింది.

మహర్షి మంగళవారం వసూళ్లు అదరగొట్టే స్థాయిలోనే ఉన్నాయి. నైజాం ఏరియాలో మహర్షి మూవీ ముందు నుంచి అదరగొడుతోంది. ఆరో రోజు కూడా తన దూకుడు ను కొనసాగించింది. తొలి 5 రోజుల్లో రూ. 19.01 కోట్ల షేర్ వసూలు చేసి నాన్ బాహుబలి రికార్డ్ నెలకొల్పిన సంగతి తెలిసిందే. ఆరవ రోజు సైతం ప్రేక్షకుల ఆదరణ తగ్గలేదు.

మంగళవారం రూ. 1.53 కోట్ల షేర్ వసూలు చేసింది. దీంతో ఆరు రోజులకు నైజాంలో టోటల్ షేర్ రూ. 20.54 కోట్లకు రీచ్ అయింది. నైజాంలో ఆరు రోజుల కలెక్షన్లలో నాన్ బాహుబలి రికార్డ్ ను నెలకొల్పింది మహర్షి. కోట్ల కళ్ళు చెదిరే షేర్ తో నాన్ బాహుబలి రికార్డ్ ను సాధించింది. నైజాం ఏరియాలో సూపర్‌ స్టార్ కు ఏ రేంజ్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

నైజాంలో రూ.13కోట్లకు పైగా షేర్ ఉన్న సినిమాల సంఖ్య మహేష్ కు మహర్షితో కలిపి 7కు చేరింది. పోకిరి, దూకుడు, బిజినెస్‌మాన్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, శ్రీమంతుడు మరియు భరత్ అనే నేను ఇంతకు ముందు నైజాంలో రూ.13కోట్లకు పైగా షేర్ ను రాబట్టాయి. ఇప్పుడు ఈ మహర్షి తో ఏడు సినిమాలకు రూ.13కోట్లకు పైగా షేర్ ను సాధించిన ఏకైక హీరో అయ్యాడు సూపర్ స్టార్.

ఇంకా ఏ హీరోకి కూడా నైజాంలో రూ.13కోట్లకు పైగా షేర్ కలెక్ట్ చేసిన సినిమాలు అయిదు కూడా లేవు. ఇక రూ.20కోట్లకు పైగా షేర్ సినిమాలైతే మహేష్ కు మూడు ఉన్నాయి. అవి శ్రీమంతుడు, భరత్ అనే నేను మరియు మహర్షి. వేరే ఏ హీరోకు ఇన్ని రూ.20కోట్ల షేర్ సినిమాలు లేవు. తనను నైజాం నవాబ్ అని ఎందుకు అంటారో మరోసారి నిరూపించాడు సూపర్ స్టార్.

నైజాంలో హైదరాబాద్ లోని ఆర్.టి.సీ.క్రాస్ రోడ్స్ సినిమా కలెక్షన్లకు ఎంత ప్రత్యేకత ఉందో సినీ ప్రియులకు చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు మహర్షి తో ఇక్కడ కూడా రికార్డును నెలకొల్పాడు మన మహేష్. ఆర్.టి.సీ.క్రాస్ రోడ్స్ థియేటర్లలో ఒక వారం లో ఎక్కువ కలెక్ట్ చేసిన సినిమాగా బాహుబలి2 తరువాత స్థానాన్ని మహర్షి సొంతం చేసుకుంది. బాహుబలి1 ని వెనక్కు నెట్టడం విశేషం.

ఇంకా తెలుగు రాష్ట్రాలలోని మిగతా ఏరియాల్లో కూడా మంగళవారం మంచి వసూళ్ళను రాబట్టింది. వాటి అధికారిక లెక్కలు అందాల్సి ఉంది. ఈ రోజు ఏడో రోజు కావడంతో ఒకేసారి వారం కలెక్షన్లను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాలలో మొదటి వారం వసూళ్ళతో నాన్ బాహుబలి రికార్డును మహర్షి సొంతం చేసుకుంతుంది.

ఇక ఈ సినిమా చూసినవారందరూ సినిమాలో మహేష్ బాబు, అల్లరి నరేష్ ల అద్భుత నటనను విపరీతంగా ప్రశంసిత్తో పొగడ్తలు కురిపిస్తున్నారు. ఇక మరీ ముఖ్యంగా వారిద్దరి పాత్రల మధ్య స్నేహం గురించిన ఒక సాంగ్ సినిమాలో చూపించడం జరిగింది. నిజానికి సినిమాలో పదరా పదరా, అలానే ఇదే కదా ఇదే కదా అనే పాటలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.

వాటితో పాటు “నువ్వని, ఇది నీదని” అనే పల్లవితో సాగే మరొక పాట కూడా సినిమా చూసే ప్రతి ఒక్క ప్రేక్షకుడి మనసుని తాకుతుంది అనే చెప్పాలి. రిషి తాను అనుకున్న గోల్ ని రీచ్ అయ్యాక, అనుకోకుండా పూర్వ స్నేహితుల కలయిక సమయంలో తన ప్రాణ మిత్రుడిని మరిచిపోయిన సందర్భంలో వచ్చే ఈ పాటలో శ్రీమణి లిరిక్స్, దేవి శ్రీ అందించిన మంచి ట్యూన్ అందరిని ఎంతో కదిలిస్తుంది.

ఇక సినిమాలోని ఈ పాట ఆడియోలో విడుదల చేయకపోవడంతో ఈ పాటను కూడా ఆడియో రూపంలో విడుదల చేయాలనీ పలువురు ఫ్యాన్స్ మరియు ప్రేక్షకుల కోరికమేరకు ఈ రోజు సాయంత్రం 4.05 నిమిషాలకు యూట్యూబ్ లో విడుదల చేయడం జరుగుతుందని దర్శకుడు వంశీ, సంగీత దర్శకుడు దేవి తమ సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా కాసేపటి క్రితం పోస్ట్ చేసారు.

ఇక సినిమాలో బాగా ఆకట్టుకున్న ఈ పాట, నేడు ఆడియో రూపంలో విడుదలయ్యాక సినిమా విజయానికి మరింత హెల్ప్ అవుతుందని యూనిట్ సభ్యులు భావిస్తున్నారు. ఇక నేడు విడుదలవుతున్న ఈ పాట కోసం మహేష్ అభిమానులు మాత్రమే కాదు, సాధారణ ప్రేక్షకులు కూడా ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు.

మహేష్‌ బాబు గారి కెరీర్‌లో కొన్ని టాప్‌ ఫిలింస్‌ ఉన్నాయి. అలాగే ‘మహర్షి’ సినిమా కూడా వాటి సరసన చేరబోతుంది. నేను ఇది వరకు చెప్పినట్లు ఫ్యాన్స్‌ ఎన్ని ఎక్స్‌పెక్టేషన్స్‌ పెట్టుకొని వచ్చినా సరే మహర్షి అన్నింటినీ రీచ్‌ అవుతుంది అని ప్రెస్ మీట్ లో దిల్ రాజు గారు చెప్పిన మాటలు నిజమయ్యాయి. రైతులతో పాటు నగర వాసులకు, యువతకు కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్ కావడంతో ప్రతి ఒక్కరి నుంచి సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్‌తో పాటు ప్రశంసల దక్కుతున్నాయి.

Share

Leave a Comment