మహర్షిలో ఎన్ని పాటలు?

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు హీరోగా వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న‌ సినిమా ‘మ‌హ‌ర్షి’. పూజా హెగ్డే క‌థానాయిక‌గా నటిస్తున్న‌ ఈ చిత్రంలో అల్ల‌రి న‌రేష్ ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు. మ‌హేష్ కెరీర్‌లో 25వ చిత్రం కావ‌డంతో ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ సినిమాకి దేవిశ్రీ ప్ర‌సాద్ స్వ‌రాల‌ను అందిస్తున్న సంగ‌తి తెలిసిందే.

మొదటగా విడుద‌ల చేసిన‌ ఫస్ట్ సింగిల్‌ ‘చోటీ చోటీ బాతే’ మ‌హేష్ ఫ్యాన్స్‌తో పాటు శ్రోత‌ల‌ను కూడా విశేషంగా అల‌రిస్తోంది. అలాగే సినిమాలో మ‌హేష్ క్యారెక్ట‌ర్ తాలూకు `స‌క్సెస్‌`ఫుల్ జ‌ర్నీని ఎలివేట్ చేస్తూ తాజాగా విడుద‌ల చేసిన సెకండ్ సింగిల్‌ ‘నువ్వే స‌మ‌స్తం’ కి కూడా మంచి రెస్పాన్స్ లభించింది.

ఇదిలా ఉంటే ఈ సినిమాలోని పాట‌ల‌కు సంబంధించి ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మొక‌టి టాలీవుడ్ స‌ర్కిల్స్‌లో చ‌క్క‌ర్లు కొడుతోంది. అదేమిటంటే ఈ సినిమాలో మొత్తంగా ఎన్ని పాట‌లు ఉంటాయో అని సినీ ప్రేక్షకులు ఆరాటపడుతున్నారు. మామూలుగా ఏ కమర్షియల్ సినిమా తీసుకున్నా ఆరు పాటలు ఉండడం సహజం.

టాలీవుడ్ స‌ర్కిల్స్‌లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం మహర్షి లో రెండు బిట్ సాంగ్స్ కు కూడా చోటు ఉందంట. మరి ఈ బిట్ సాంగ్స్ తో కలిపి సినిమాలో ఆరు పాటలు ఉంటాయా లేకపోతే వీటిని విడుదల చేయకుండా డైరెక్ట్ గా సినిమాలో వినిపిస్తారా అని వాళ్ళ సందేహం. ఇందులో ఎంత నిజ‌ముందో త్వ‌ర‌లోనే తెలుస్తుంది.

ఎందుకంటే ఈ నెలాఖ‌రులో మ‌హ‌ర్షి నుంచి ఫుల్ ఆల్బ‌మ్ వ‌చ్చే అవ‌కాశ‌ముంది. అంటే ఇంకా కొద్ది రోజులు ఓపిక పడితే మహర్షిలో ఎన్ని పాటలు అన్న సంగతి మనకు తెలుస్తుంది. ఇప్పటి వరకు విడుదల చేసిన మహర్షి రెండు పాటలు కూడా కథ తో పాటు వస్తాయని వాటిని వింటే మనకు తెలిసిపోతుంది. మొదటి పాటను స్నేహానికి సంబంధించిన అంశాలతో డిజైన్ చేశారు.

‘చోటి చోటి చోటి చోటి చోటి చోటి చోటి బాతే… మీటి మిటి మీటి మీటి మీటి మీటి యాదే.. ఓ పరిచయం ఎప్పుడూ చిన్నదే.. ఈ చెలిమికే కాలమే చాలలే… ఎన్నో వేల కథలు.. ఇంకో కథ మొదలు’ అంటూ సాగే లిరిక్స్ ఆకట్టున్నాయి. ‘నీ కష్టం తనదనుకుంటూ..నీ కలనే తనదిగా కంటూ… నీ గెలుపుని మాత్రం నీకే వదిలేస్తూ…ఎన్నో వేల కథలు… ఇంకో కథ మొదలు’ అంటూ స్నేహంలోని గొప్పతనాన్ని ఆవిష్కరించింది.

ఇక రెండో పాట ‘నువ్వే సమస్తం’ బహుసా హీరో పరిచయ గీతం అయి ఉండవచ్చు. మహర్షి వ్యక్తిత్వాన్ని వర్ణించిన తీరు హీరోయిజంకి నిజమైన డెఫినేషన్ లా ఉంది. ‘నువ్వే సమస్తం..నువ్వే సిద్ధాంతం..నువ్వే నీ పంతం..నువ్వేలే అనంతం.. ప్రతి నిసీ మసై.. నీలో కసే దిశై.. అడుగేసేయ్ మిసైలులా’ అంటూ మహర్షి లో హీరో క్యారెక్టర్ గురించి గొప్పగా రాసారు.

మహర్షి సినిమా పాటలను మొత్తం శ్రీమణి గారే రాసారు. గీత రచయిత శ్రీమణి ప్రాసతో ఆడుకున్న వైనం అతని కలంలో పెరుగుతున్న పరిణితిని సూచిస్తోంది. ఈ రెండు పాటలను వింటుంటే ఇవి కథకు ఏమాత్రం ఆటకం కలిగించకుండా కథను ముదుకు తీసుకుని వెలతాయని చెప్పవచ్చు. విడుదల చేసిన రెండూ సందర్భానుసారం వచ్చే పాటలే.

ప్రముఖ గాయకుడు రఘు దీక్షిత్ గారు తాను మహర్షి సినిమాలో ఒక డ్యూయట్ సాంగ్ పాడానని సోషల్ మీడియా ద్వారా తెలియజేసారు. ఈ పాట పాడినందుకు చాలా ఆనందంగా ఉన్నానని ఆయన తెలిపారు. ఇంకా మహర్షి లో ఎలాంటి జానర్ పాటలు ఉన్నాయో తెలియాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే.

ప్రస్తుతం మహర్షి టీం టాకీ పార్ట్ షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుని పాటల చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. పాటల చిత్రీకరణ ఈ నెలలోనే పూర్తి చేసి చివరి వారానికి ఫైనల్ కాపీ రెడీ చేయబోతున్నారు. ట్రైలర్ ప్లస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. సి.అశ్వ‌నీద‌త్‌, `దిల్‌` రాజు, ప్ర‌సాద్ వి.పొట్లూరి సంయుక్తంగా నిర్మిస్తున్న `మ‌హ‌ర్షి` మే 9న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల కానుంది.

ఎప్పటిలానే మహేష్ సినిమా అంటే భారీ అంచనాలు కూడా తప్పనిసరి. ఇదిలా ఉండగా ఇటీవల నిర్వహించిన ప్రెస్ మీట్లో తాను ప్రస్తుతం చేస్తున్న మహర్షి సినిమా విషయంలో సూపర్ కాన్ఫిడెంట్ గా ఉన్నానని తెలిపారు మహేష్. తన కెరీర్ లోనే మహర్షి సినిమా బిగ్గెస్ట్ హిట్ గా నిలవనుందని మహేష్ ఈ సందర్భంగా తెలిపారు. మహర్షి సినిమా చాలా స్పెషల్ నాకు.

25వ సినిమా నాకు. చిత్రాన్ని డైరెక్టర్ వంశీ పైడిపెల్లి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని రూపొందించారు. మేమంతా సినిమా విడుదల కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నాం’ అని తెలిపారు మహేష్. మహేష్‌బాబు పోషించిన రిషి పాత్ర ప్రయాణమే మహర్షి సినిమా. మనలో ప్రతి ఒక్కరి జీవితానికి ఒక ప్రయాణం ఉంది. ఇదీ అంతే.

సినిమాలో మూడు విభిన్న కాలాలు ఉంటాయి. అందుకే, మహేష్ మూడు విభిన్న షేడ్స్‌లో కనిపిస్తారు. మీనాక్షి దీక్షిత్, సోనాల్ చౌహాన్, జగపతి బాబు, సాయి కుమార్, ప్రకాష్ రాజ్, నరేష్, జయసుధ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. వేసవి సెలవులు కావడంతో భారీ కలెక్షన్లు సాధించడమే లక్ష్యంగా కనీవినీ ఎరుగని రీతిలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Share

Leave a Comment