ఏమున్నాడ్రా బాబు

సాధారణ ప్రజలే కాకుండా సెలబ్రిటీలు కూడా సెల్ఫిలు తీసుకుని తమ అభిమానుల కోసం సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తూ ఉంటారు. మహేష్ చాలా తక్కువ సందర్భాలలో ఇలా చేస్తూ ఉంటాడు. కాని ఇప్పుడు తను తీసిన సెల్ఫీ టాక్ ఆఫ్ థి సోషల్ మీడియా గా మారింది.

ఈ సెల్ఫీ సోష‌ల్ మీడియాలో సంచ‌ల‌నం అయిపోయింది. అంత అందంగా ఉన్నాడు ఈ 44 ఏళ్ల రాజ‌కుమారుడు. చూస్తుంటే ఇంకా ఈయ‌న వయస్సు 20 ల్లోనే ఆగిపోయిందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఆయ‌న అలా ఉన్నాడు మ‌రి. రాను రాను మ‌రీ కుర్రాడిలా మారిపోతున్నాడు మ‌హేష్. ఆయన అందం యొక్క రహస్యం ఎంటా అని అందరూ ఆశ్చర్యపడుతున్నారు.

మహేష్ సెల్ఫి తీయడం.. నమ్రత ఆ సెల్ఫి ని తన ఇన్ స్టాగ్రామ్ ఖాతా ద్వారా పోస్ట్ చేయడం వెంటనే జరిగిపోయాయి. సెల్ఫీ లో మహేష్ వైట్ డ్రెస్ లో సేమ్ హాలివుడ్ స్టార్ లాగానే ఉన్నాడు. “మహేష్ అభిమానులకి గుడ్‌నైట్.. మహేష్ సెల్ఫీ లు తీసుకోడం లో చాలా పెర్ఫెక్ట్ అయిపోతున్నాడు కదా..మరి మీరేమంటారు” అని నమ్రత గారు షేర్ చేసారు.

పొరపాటున హాలీవుడ్ కు సంబంధించిన వాళ్ళు కనుక మహేష్ ను చూస్తే ఆయనను హైదరాబాద్ కు ఇక తిరిగిరానివ్వరేమో. చూస్తుంటే మహేష్ ను డామినేట్ చేసేందుకు హీరోయిన్‌లు చాలా కసరత్తులే చేయాల్సి వస్తుందని అనిపించడం లేదూ. ఎంతైనా సూపర్‌స్టార్ ను అందంతో ఎదుర్కోవటం ఎవరి వల్ల కాదు అని మరో సారి ఋజువు అయ్యింది. ఏం ఉన్నాడ్రా బాబూ అంటూ తెగ కామెంట్లు చేస్తున్నారు.

జర్మనీ నుంచి తిరిగి వచ్చిన వెంటనే అమెరికాలో జరిగే మహర్షి చిత్రీకరణలో పాల్గొంటారు. అక్కడ తీసే సన్నివేశాల్లో మహేష్‌ ఇలా హాలివుడ్ హీరో మాదిరిగా అందరిని కట్టి పడేసే చార్మ్ తో కనిపించనున్నట్టు సమాచారం. ఇంక ఈ నెలాకర్లో అమెరికా లో హీల్-ఎ-చైల్డ్ ఆండ్ గ్రామం ఫౌండేషన్ ఆద్వర్యం లో జరిగే ఫండ్ రైజర్ కి స్పెషల్ గెస్ట్ గా అక్కడి ప్రవాస భారతీయ కుటుంబాలతో కొద్ది సమయం గడపనున్నారు.

డబ్బుని మనసుతో ముడిపెట్టిన వాడు మనిషి. మనసుని తపస్సుతో జయించేవాడు మహర్షి. అలాంటి ఓ యువకుడి కథే ‘మహర్షి’. అంచనాలకి ఏ మాత్రం తగ్గకుండా అందరికీ నచ్చేలా సినిమా ఉండబోతుంది అని టీం కాంఫిడెంట్ గా ఉన్నారు. మొత్తానికి కాస్త బ్రేక్ ఇచ్చి మ‌ళ్లీ బ్యాక్ టూ షూటింగ్ అంటున్నాడు మ‌హేష్ బాబు. ఎప్రిల్ 5న ఈ చిత్రం విడుద‌ల కానుంది.

Share

Leave a Comment