నిజమే కదా అనిపిస్తుంది!

మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపెల్లి దర్శకతంలో రూపొందిన చిత్రం మహర్షి. మే 9 వ తేదీన విడుదలైన ఈ సినిమా ఇప్పటికే 30 రోజులు పూర్తిచేసుకుంది. విడుదలైన రోజు నుంచి నేటి వరకు కలెక్షన్స్ పరంగా దూసుకుపోతూనే ఉంది. కలెక్షన్ల పంట పండిస్తూ మహేష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలుస్తోంది మహర్షి. మహేష్ కెరీర్‌లో 25 వ సినిమాగా వచ్చిన మహర్షి ఈ 30 రోజులు ఇంప్రెసివ్ జర్నీ కొనసాగించింది.

ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో ఇంకా దుమ్మురేపే కలెక్షన్లను రాబడుతుంది మహర్షి. ముఖ్యమైన అన్ని సెంటర్లలో కొత్త రికార్డులను లిఖిస్తూ ముందుకు సాగిపోతుంది మహర్షి. ఈ వారాంతం కూడా అదిరే వసూళ్ళను కొల్లగొట్టడానికి సిద్ధంగా ఉంది. రంజాన్ పండుగ కారణంగా కలెక్షన్ల జోరు పెరిగింది. మహేష్ నటించే ప్రతి సినిమా సంథీంగ్ స్పెషల్ అనే విధంగా ఉంటాయి.

శ్రీమంతుడు చిత్రంలో ఊళ్ళను దత్తత తీసుకొని అక్కడి వారి కష్టాలు ఎలా తీర్చాలో అన్న కాన్సెప్ట్ అదిరిపోయింది. తర్వాత వచ్చిన భరత్ అనే నేను రాష్ట్రాభివృద్ది కోసం నిధులు ఎలా వినియోగించుకోవాలి, ప్రజల నమ్మకాన్ని డబ్బు తో కాదు అభివృద్ది చూపించి గెల్చుకోవాలన్న కాన్సెప్ట్ సూపర్ గా ఉంది. ఇక ఇప్పుడు మహర్షి.

ప్రపంచ వ్యాప్తంగా ఆడియన్స్ ఈ సినిమాకు బాగా కనెక్ట్ అయ్యారు. రైతంటే సింపథీ కాదు రెస్పెక్ట్ అనే సోషల్ మెసేజ్‌తో చాలా మందిలో చైతన్యం తీసుకువచ్చింది. సినిమా అంటే కేవలం వినోదం పంచడం మాత్రమే కాదు సమాజంలో మంచి మార్పు తెచ్చేలా ఉండాలని తపన పడే మహేష్ బాబు మహర్షి ద్వారా ఒక అద్భుతమైన కాన్సెప్టును ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు.

రైతు సమస్యలపై అద్భుతంగా ఆవిష్కరించారు. రైతులకు సరైన గౌరవాన్ని ఇవ్వాలని, వారిని దోచుకుంటున్న దళారీలను తరిమి కొట్టేది సామాన్య ప్రజలే అని ఎన్నో మంచి విషయాలు ఈ చిత్రంలో చూపించారు. వారాంతపు వ్యవసాయం, సామాజిక సమస్యల నేపథ్యంలో తెరకెక్కిన మహర్షి అందరి ప్రశంసలు అందుకుంటుంది.

ఒక సినిమా చూసి మహా అయితే ఎంజాయ్ చేస్తాం, బోర్ కొడితే ఫోన్ చూసుకుంటూ కూర్చుంటాం. కానీ ఒక సినిమా ఆలోజింపజేస్తే ఎలా ఉంటుంది. ఇది వరకు అలాంటి సినిమాలోచ్చాయి. కానీ ‘మహర్షి’లో సక్సెస్ యొక్క ఇంపార్టెన్స్ గురించి, మన సమాజానికి రైతు అవసరం గురించి సూపర్‌స్టార్‌ మహేష్ బాబు చెబుతుంటే నిజమే కదా అనిపిస్తుంది. అందుకే మహర్షిలోని కొన్ని అద్భుతమైన మరియు ఆలోజింపజేసే సంభాషణలు మీకోసం!!

1)

2)

3)

4)

5)

6)

7)

8)

9)

10)

11)

12)

13)

14)

15)

16)

17)

18)

19)

20)

21)

22)

23)

24)

ఇలాంటి ఆలోచింపజేసే ఎన్నో డైలాగులు ఉన్నాయి మహర్షి సినిమాలో. రైతులకు సంబంధించిన సన్నివేశాలు యూత్‌ని సైతం బాగా ఆకట్టుకున్నాయి. సినిమా చూసిన వారంతా వీకెండ్ వ్యవసాయం చేసి ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసారు. ఒక రకంగా ఇది సినిమా జనాల్లోకి ఎంతలా చేరువయ్యిందో తెలపడానికి ఎంతగానో ఉపయోగపడుతోంది.

‘వీకెండ్ వ్యవసాయం’ అనే కొత్త కాన్సెప్ట్‌ను మహర్షి చిత్రంలో చూపించారు. ఇప్పటికే సోషల్ మీడియాలో మహర్షి వీకెండ్ వ్యవసాయానికి అనూహ్య స్పందన లభించిన సంగతి తెలిసిందే. అనేక మంది యువత పంటపొలాల్లో వ్యవసాయం చేస్తూ ఫొటోలు దిగి వాటిని సోషల్ మీడియాలో ‘మహర్షి వీకెండ్ వ్యవసాయం’ పేరుతో ట్యాగ్ చేస్తున్నారు.

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన మహర్షి చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, వైజయంతి మూవీస్‌, పీవీపీ సినిమా సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. అల్లరి నరేష్‌, పూజా హెగ్డే, రావు రమేష్‌, ప్రకాష్‌ రాజ్‌, జయసుధ, సాయికుమార్ తదితరులు నటించారు. మహర్షి సక్సెస్‌ తర్వాత ఫ్యామిలీతో కలసి మహేష్ ఫారిన్‌ ట్రిప్‌ వెళ్లిన సంగతి తెలిసిందే. వెకేషన్ నుంచి తిరిగొచ్చాక అనీల్ రావిపూడితో క‌లిసి మ‌హేష్ త‌న 26వ సినిమా సరిలేరు నీకెవ్వరు షూటింగ్ లో పాల్గొననున్నారు.

Share

Leave a Comment