అదరగొట్టిన రిషిని కలిసారా

సూపర్‌స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆయన 25వ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఇప్పటికే విడుదలై అభిమానులకు కనువిందు చేసింది. మ‌హేష్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ఫ్యాన్స్‌కు చిత్ర‌బృందం డ‌బుల్ ధ‌మాకా అందించింది. గ‌త రాత్రి టైటిల్‌తోపాటు ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్ విడుద‌ల చేసిన చిత్ర‌యూనిట్ తాజాగా టీజ‌ర్‌ను రిలీజ్ చేసింది.

గురువారం ఉదయం 9.09 గంటలకు ‘మహర్షి’ టీజర్ రిలీజ్ చేశారు. టీజర్ ను మహేష్ తన ట్విట్టర్ ఎకౌంట్ ద్వారా షేర్ చేశారు. ‘మీ ప్రేమకు, దీవెనలకు చాలా సంతోషంగా ఉంది. రిషి గా నా ప్రయణాన్ని ఈ రోజు మొదలు పెడుతున్నాను. మీట్ రిషి’ అంటూ ట్వీట్ చేశారు సూపర్‌స్టార్.

స్టైలిష్‌గా నడుచుకుంటూ మహేష్ బాబు వెళుతున్న తీరు ఆయన కెరీర్లోనే ది బెస్ట్ అనేలా ఉంది. ఈ చిత్రంలో మహేష్ బాబు రిషి అనే పాత్రలో కనిపించబోతున్నారు. చేతిలో ల్యాప్ టాప్ పట్టుకుని ఉండటం, పక్కన అమ్మాయిలు నడుచుకుంటూ వెళ్లడం చూస్తుంటే ఆయన కాలేజీ స్టూడెంట్ పాత్రలో కనిపించబోతున్నారని స్పష్టమవుతోంది.

ఓ బ్యూటిఫుల్ కాలేజ్, అక్కడ ట్వంటీస్ లో ఉన్న ఓ కుర్రాడు (మనకి తెలుసు గానీ మహేష్ ఎవరో తెలీని వాళ్ళకు ఈ టీజర్ చూపించి అడగండి వయసెంతో అప్పుడు చెప్తారు) అలా స్టైల్ గా నడుస్తూ ఒక చేత్తో హెయిర్ ని అలా దువ్వుకుంటూ మరో చేత్తో ల్యాప్ టాప్ పట్టుకుంటే ఎదురుగా వచ్చే అమ్మాయిలు ఏం కావాలి?

ఓ అమ్మాయి అలా వెనక్కి తిరిగి చూస్తుంది మన మహేష్ కుడా వెనక్కి అలా తిరిగి చూస్తారు. బ్యాక్ గ్రౌండ్ లో తన మ్యుజిక్ తో సీన్ ఎలివేట్ చేసేలా దేవీ మ్యూజిక్, పిక్చరైజేషన్లో వంశీ మ్యాజిక్. టోటల్ గా ఆడియన్స్ క్లీన్ బౌల్డ్. మహేష్ బాబు పుట్టినరోజు కావడం, అందులోనూ ఆయన సినిమా ఫస్ట్ లుక్ , టీజర్ విడుదల చేయడంతో సోషల్ మీడియా మొత్తం మహేష్ మయం అయిపోయింది. తెలుగు సినిమా సెలబ్రిటీలతో పాటు అభిమానులు మహేష్ బాబును విషెస్‌తో ముంచెత్తారు.

మహేష్‌ని చూసిన అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఎందుకంటే సూపర్‌స్టార్ ఈ లుక్‌లో చాలా యంగ్‌గా కనిపిస్తున్నారు. అలాగే మహేష్ ఇప్పటి వరకు చేసిన 24 సినిమాల లుక్స్ ఒక ఎత్తు అయితే ఈ సినిమాలో లుక్ మాత్రం అదుర్స్ అంటూ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు. మొత్తానికి మహేష్ తన అభిమానులకు ఈ లుక్‌తో డబుల్ ట్రీట్ ఇచ్చేశారు.

Share

Leave a Comment