మహర్షి పది రోజుల రికార్డులు

సూపర్‌స్టార్ మహేష్ బాబు కెరీర్లో 25వ చిత్రంగా తెరకెక్కిన ‘మహర్షి’ రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో బాక్సాఫీసు వద్ద భారీ కలెక్షన్లు రాబడుతోంది. స్టూడెంట్‌గా, ఓ కంపెనీకి సీఈవోగా, ఫ్రెండ్‌ కోసం ఎంతకైనా తెగించే వ్యక్తిగా మూడు షేడ్స్ ఉన్న పాత్రల్లో మహేష్ ఇరగదీశాడు. ఈ చిత్రం మహేష్ కెరీర్లోనే అత్యధిక గ్రాస్ కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా నిలవబోతుంది.

పది రోజులు గడిచినా కూడా నైజాంలో స్టడీ కలెక్షన్లతో దూసుకుపోతుంది మహర్షి. నైజాంలో మహర్షి ఓవరాల్‌ షేర్ రూ.24 కోట్ల షేర్ ను అందుకుంది. కేవలం 10 రోజుల్లోనే ఈ మార్క్ ను అందుకుని నాన్ బాహుబలి రికార్డును సొంతం చేసుకుంది మహర్షి. నైజాం ఏరియాలో బాహుబలి, బాహుబలి-2 చిత్రాలు హయ్యెస్ట్ షేర్ కలెక్షన్లో టాప్లో ఉన్నాయి.

వాటి తర్వాతి స్థానంలో మహర్షి చేరడం పక్కాగా కనిపిస్తోంది. నైజాంలో మహేష్ రూ.20కోట్లకు పైగా షేర్ సినిమాల సంఖ్య మూడుకు చేరింది. అవి శ్రీమంతుడు, భరత్ అనే నేను మరియు మహర్షి. వేరే ఏ హీరోకు ఇన్ని రూ.20కోట్ల షేర్ సినిమాలు లేవు. ఈ మూడు మహేష్ సినిమాలు కూడా ఏకంగా రూ.22 కోట్లకు పైగా షేర్ వసూలు చేసాయి.

నైజాంలో రూ.13కోట్లకు పైగా షేర్ ఉన్న సినిమాల సంఖ్య మహేష్ కు మహర్షితో కలిపి 7కు చేరింది. పోకిరి, దూకుడు, బిజినెస్‌మాన్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, శ్రీమంతుడు మరియు భరత్ అనే నేను ఇంతకు ముందు నైజాంలో రూ.13కోట్లకు పైగా షేర్ ను రాబట్టాయి. ఇక హైదరాబాద్ లో తన జోరును కొనసాగించింది మహర్షి.

ఆర్.టి.సీ.క్రాస్ రోడ్స్, కె.పి.ఎహ్.బి తో పాటు సూపర్ స్టార్ మల్టీప్లెక్స్ ఏ.ఎం.బీసినిమాస్ లో కోటి రూపాయల గ్రాస్ ను క్రాస్ చేసింది మహర్షి. ఏ.ఎం.బీసినిమాస్ లో ఈ మ్యాగిక్ మార్క్ ను అందుకున్న తొలి సినిమా మహర్షి. మహర్షి తో ఆర్.టి.సీ.క్రాస్ రోడ్స్ మహేష్ కోటి గ్రాసర్ల సంఖ్య 9 కు చేరింది. వేరే ఏ హీరోకు ఈ రికార్డు లేదు.

ఇంకా తెలుగు రాష్ట్రాలలోని అనేక సెంటర్లలో మహర్షి పది రోజులకే కోటి రూపాయల గ్రాస్ ను వసూలు చేసింది. వాటిలోని కొన్ని సెంటర్లలో ఆల్ టైం రికార్డును నెలకొల్పాడు మహేష్. కాకినాడ, రాజమండ్రి లో మహర్షి కోటి రూపాయల గ్రాస్ కలెక్ట్ చేయడంతో అక్కడ ఈ మార్క్ అందుకున్న మహేష్ మూడో సినిమా అయ్యింది.

వేరే ఏ హీరోకి ఇక్కడ అన్ని కోటి గ్రాసర్లు లేవు. భీమవరంలో కూడా మహర్షి తో మహేష్ కోటి గ్రాసర్ సినిమాల సంఖ్య నాలుగు కి చేరింది. ఇది సిటీ ఆల్ టైం రికార్డ్. ఏలూరులో కూడా ఒక కొత్త రికార్డును నెలకొల్పాడు మహేష్. మహర్షితో తన కోటి రూపాయల గ్రాసర్ సినిమాల సంఖ్య ను మూడుకు చేర్చాడు. వేరే ఏ హీరోకి ఇక్కడ అన్ని కోటి గ్రాసర్లు లేవు.

అనంతపూర్ లో మహర్షి ఈ మ్యాగిక్ మార్క్ ను అందుకుంది. దీంతో భరత్ అనే నేను తరువాత మళ్ళీ మహర్షితో ఈ మార్క్ ను బ్యాక్ టు బ్యాక్ అందుకున్నట్లు అయ్యింది. ఇలాంటి ఎన్నో రికార్డులను నెలకొల్పుతూ దూసుకుపోతుంది మహర్షి. ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది రోజులకే రూ.80 కోట్లకు పైగా డిస్ట్రిబ్యూటర్ షేర్ వసూలు చేసింది మహర్షి.

మహర్షి మహేష్ కెరీర్ లో మూడో రూ.80 కోట్ల షేర్ సాధించిన సినిమా. ఇంతకు ముందు శ్రీమంతుడు, భరత్ అనే నేను రూ.80 కోట్ల షేర్ ను వసూలు చేసాయి. తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఏ హీరోకు కూడా ఇన్ని రూ.80 కోట్ల షేర్ సినిమాలు లేవు. మహర్షి తో ఈ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు మహేష్ బాబు.

మహర్షి విజ‌య‌యోత్స‌వం విజయవాడలోని సిద్ధార్థ కళాశాలలో శ‌నివారం ఘ‌నంగా నిర్వ‌హించారు. మహేష్‌బాబు, అల్లరి నరేష్‌, దర్శకుడు వంశీ పైడిపల్లి, పూజా హెగ్డే, నిర్మాతలు దిల్‌రాజు, అశ్విని దత్‌, ప్రసాద్‌ వి పొట్లూరి ఈవెంట్‌లో పాల్గొన్నారు. ఈ వేడుకలో దర్శకులు వైవీఎస్‌ చౌదరి, అనిల్‌ రావిపూడి, నిర్మాత ఘట్టమనేని ఆదిశేషగిరిరావు, నటులు పృథ్వీరాజ్, శ్రీనివాస్‌రెడ్డి, సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్, వైఎస్సార్‌సీపీ నేత భవకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

సినిమా రెండో వారంలో అడుగుపెట్టినా కూడా ఇంకా అదే రెస్పాన్స్ తో హౌస్‌ఫుల్స్ తో ప్రదర్శింపబడుతుంది. ఇప్పటికే అన్ని రికార్డులని తిరగరాస్తున్నా కూడా ఈ చిత్రం తనకి గొప్ప రెస్పెక్ట్ తెచ్చి పెట్టింది అని ఇప్పటికే అనేక ఇంటర్వ్యూలలో తెలిపాడు మహేష్‌. ఇటువంటి గొప్ప సినిమాలు చాలా అరుదుగా వస్తాయి కాబట్టి ప్రజల్లోకి ఈ సినిమా మరింత వెల్లడానికి చిత్ర యూనిట్ కృషి చేస్తున్నారు.

మహేష్ బాబు కెరీర్లో 25వ సినిమా కావడంతో మహర్షి మరింత ప్రత్యేకంగా మారింది. రైతుల గురించి, వ్యసాయం ప్రాముఖ్యత గురించి వివరిస్తూ ఒక మంచి సందేశాత్మక చిత్రంగా తెరకెక్కించడంతో చాలా మందికి కనెక్ట్ అవుతోంది. మహర్షి చూసిన ప్రతి ప్రేక్షకుడు కథకు బాగా కనెక్ట్ అవుతున్నారు. చూసిన ప్రతీ ఒక్కరూ 25వ సినిమా అంటే ఇలా ఉండాలి అని మహర్షి ని ప్రశంసిస్తున్నారు.

ముందు ముందు మహర్షి మరిన్ని కొత్త రికార్డులను నెలకొల్పడం ఖాయం. క‌మ‌ర్షియ‌ల్ చట్రాల్లో ఉంటూనే, సామాజిక నేప‌థ్యం ఉన్న క‌థ‌ల్ని ఎంచుకునే సాహ‌సం చేయడంలో ఎప్పుడూ ముందు ఉండే ఏకైక స్టార్ మహేష్ బాబు. అభిమానుల్ని సంతృప్తిప‌రుస్తూనే ఏదో ఓ స‌మ‌స్య‌ని వేలెత్తి చూపిస్తూ ఉంటారు.

మ‌హేష్ బాబు ఈ దారిలోనే వెళ్లి ‘శ్రీ‌మంతుడు’, ‘భ‌ర‌త్ అనే నేను’ అనే సినిమాల్ని చేశారు. అవి క‌మర్షియ‌ల్ విజ‌యాల్ని అందుకుంటూనే మ‌హేష్‌కి మంచి పేరు తీసుకొచ్చాయి. ఈసారి త‌న 25వ సినిమాకీ అలాంటి ఒక మంచి కథను ఎంచుకుని ‘మ‌హర్షి’గా మారారు. దీంతో సూపర్ స్టార్ పై ప్రశంసల వర్షంతో పాటు కలెక్షన్లు కూడా భారీగా కురుస్తున్నాయి.

Share

Leave a Comment