మహర్షి టైమ్ స్టార్ట్

టాలీవుడ్ మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీ ఆఫ్ ది ఇయర్ ‘మహర్షి’. ఈ సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకుడు. సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇదివరకే విడుదల చేసిన టీజర్, పాటలు ఇంట్రస్టింగ్ గా వుండి సినిమాపై అంచనాలని మరింత పెంచాయి. తాజాగా ఈ సినిమా షూటింగ్ పార్టు పూర్తి చేసుకుంది.

ఈ మేరకు మహేష్ బాబు ట్వీట్ చేశారు. ‘సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. థియేటర్స్ లో మే 9న కలుద్దాం’ అంటూ ఆయన ట్వీట్ చేశారు. దీంతో సూపర్ స్టార్ అభిమానులు సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదుచూస్తున్నారు. విడుదల దగ్గర పడటంతో సినిమా ప్రమోషన్స్ కూడా ఇప్పటికే చెప్పట్టారు. ఈ నేపథ్యంలో విడుదల చేసిన పాటలు ‘చోటి చోటి భాతే’, ‘నువ్వే సమస్తం’ పాటలు ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమా లోని మూడో సాంగ్ ‘ఎవరెస్ట్ అంచున’ ని ఏప్రిల్ 19న అంటే ఈ రోజు సాయంత్రం 4 గంటల 5 నిముషాలకు విడుదల చేస్తున్నారు. ప్రముఖ గాయకుడు రఘు దీక్షిత్ గారు తాను మహర్షి సినిమాలో ఒక డ్యూయట్ సాంగ్ పాడానని సోషల్ మీడియా ద్వారా తెలియజేసారు. ఈ పాట పాడినందుకు చాలా ఆనందంగా ఉన్నానని ఆయన తెలిపారు. బహుసా ఎవరెస్ట్ అంచున ఆ పాటే అయి ఉండవచ్చు.

ఈ సినిమాకి దేవిశ్రీ ప్ర‌సాద్ స్వ‌రాల‌ను అందిస్తున్న సంగ‌తి తెలిసిందే. మహర్షి సినిమా పాటలను మొత్తం శ్రీమణి గారే రాసారు. విడుదల చేసిన రెండూ సందర్భానుసారం వచ్చే పాటలే. దీంతో మహర్షి లో ఒక మంచి మాస్ బీట్ ఉన్న పాట కూడా ఉంటే బావుంటుందని అభిమానుల కోరిక. మహర్షి లో ఒక మంచి మాస్ సాంగ్ కూడా ఉన్నట్లు సమాచారం.

నిన్న అన్నపూర్ణ 7 ఏకర్స్ లో ఆ పాట చిత్రీకరణ పూర్తి అయిన తరువాతే మహర్షి సినిమాకు గుమ్మడికాయ కొట్టినట్లు సమాచారం. ఇది మాత్రం నిజమే అయితే థియేటర్లలో మహేష్ అభిమానులు రచ్చ మాత్రం మాములుగా ఉండదనే చెప్పాలి. ఇంకా మహర్షి లో ఎలాంటి జానర్ పాటలు ఉన్నాయో తెలియాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే.

మే 9న అంటే సరిగ్గా ఇంకో 21 రోజుల్లో మహర్షి వచ్చేస్తాడు. కౌంట్ డౌన్ లెక్కబెట్టుకోవడమే పెండింగ్. ఇప్పుడు అభిమానుల చూపు ప్రీ రిలీజ్ ఈవెంట్ తో పాటు ట్రైలర్ మీద ఉంది. వీటికి సంబంధించిన డేట్స్ ఇంకా ప్రకటించాల్సి ఉంది. నెలాఖరులో ఉండే ఛాన్స్ ఉంది. ఇప్పటి నుండి మహర్షి టైం స్టార్ట్ అనే చెప్పాలి. రోజుకు ఒక అప్డేట్ తో అభిమానులకు పండుగే.

శ్రీమంతుడు చిత్రంలో తిరిగి సమాజానికి ఇవ్వాలన్న మంచి కథలో నటించిన మహేష్‌ ఇప్పుడు తాజా సినిమా మహర్షితో గెలుపు ఓటముల మధ్య సాగే ఓ వ్యక్తి ప్రయాణాన్ని చూపించబోతున్నారు. ఈ చిత్రంలో పూజా హెగ్డే నాయికగా నటిస్తోంది. అల్లరి నరేష్ మహేష్ స్నేహితుడిగా కనిపించనున్నాడు. దిల్‌ రాజు, అశ్వనీదత్‌, పీవీపీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

మహర్షి గురించి దర్శకుడు వంశీ పైడిపల్లి మాటల్లో వింటే ఇందులో మీ కథ, నా కథ, ప్రతి ఒక్కరి జీవితంలో పోలే అంశాలుంటాయి. అందుకే ఈ చిత్రాన్ని రిషి జర్నీ అంటూ చెబుతున్నాం. ప్రతి ఒక్కరికీ ఓ జీవిత గమనం ఉంటుంది. రిషి ప్రయాణం ఎక్కడి నుంచి మొదలై ఎక్కడికి చేరింది అనేది కథాశం. సినిమాలో మూడు విభిన్న కాలాలు ఉంటాయి.

అందుకే, మహేష్ మూడు విభిన్న షేడ్స్‌లో కనిపిస్తారు. ఈ ప్రయాణంలో రిషి ఏం సాధించాడో ఏం కోల్పోయాడో రేపు విడుదల అయిన తరువాత తెలుస్తుంది.సినిమా చూసిన తర్వాత ఫ్రెండ్‌షిప్‌, లవ్‌, ఫ్యామిలీ ఎమోషన్స్‌ ఇలా అన్నింటికీ కనెక్ట్‌ అయ్యేలా ఉంటుంది. సినిమా అయిపోయే టైం కీ సొసైటీలో ఉండే మనమంతా ఫీల్ అవుతాం అన్నారు.

అంటే మహర్షిలో కూడా బలమైన సందేశం ఉంది అనమాట. మహేష్ సినిమాలన్నీ కాసేపు నవ్విస్తూ….కొంతైనా నేర్పిస్తూ అన్న చందంగా ముందుకు సాగిపోతున్నాయి. మ‌హేష్ కెరీర్‌లో 25వ చిత్రం కావ‌డంతో ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అంచనాలకి ఏ మాత్రం తగ్గకుండా అందరికీ నచ్చేలా సినిమా ఉండబోతుంది అని మహర్షి టీం కాంఫిడెంట్ గా ఉన్నారు.

ఈ మూవీకి కె.యు.మోహనన్‌ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. జగపతిబాబు, సాయికుమార్, ప్రకాష్‌ రాజ్‌, పోసాని, రావు రమేష్‌, మీనాక్షి దీక్షిత్‌ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. హరి, సాల్మన్‌, సునీల్‌బాబు, కె.ఎల్‌.ప్రవీణ్‌, రాజు సుందరం, శ్రీమణి, రామ్‌-లక్ష్మణ్‌ పనిచేస్తున్న ముఖ్య సాంకేతికవర్గం.

Share

Leave a Comment