బాలీవుడ్ ను వెనక్కినెట్టిన మహేష్

ప్రపంచ సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ ప్రతీ ఏటా తన ఫ్లాట్ ఫామ్ పై ఎక్కువగా వెతికిన పదాల గురించి ట్రెండింగ్ లను చెబుతుంటుంది. ట్విట్టర్ లో హ్యాష్ ట్యాగ్ లతో ట్రెండ్ అయిన పదం, వెతికిన పదాన్ని వెల్లడిస్తుంది. ఆ కోవలోనే ఈ సంవత్సరం కూడా భారతదేశ వ్యాప్తంగా వైరల్ అయిన పదాలేంటో చెప్పింది ట్విట్టర్.

దేశంలోనే నంబర్ 1 హ్యాష్ ట్యాగ్ గా తమిళ హీరో అజిత్ నటించిన విశ్వాసం మూవీ ఉండడం విశేషంగా చెప్పవచ్చు. ఇక రెండో స్థానంలో మేలో జరిగిన లోక్ సభ ఎలక్షన్స్ 2019 గురించి నెటిజన్లు వెతికారట. ఇక మూడో హ్యాట్ ట్యాగ్ క్రికెట్ వరల్డ్ కప్. నాలుగో స్థానంలో మన సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన మహర్షి మూవీ ఉండడం విశేషంగా చెప్పవచ్చు.

ఆశ్చర్యకరంగా ఇందులో బాలీవుడ్ లోని ఒక్క సినిమా, దర్శకుడు, హీరో లేకపోవడం షాక్ కు గురిచేస్తోంది. మహేష్ బాబు సినిమా విడుదలైతే సోషల్ మీడియాలో హంగామా ఎలా ఉంటుందో మరో సారి రుజువైంది. సూపర్ స్టార్ మహేష్ ఫాలోయింగ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మహేష్ బాబు నటించిన మహర్షి చిత్రం ఈ ఏడాది సమ్మర్ లో విడుదలై ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది.

ఈ చిత్రానికి వంశీపైడిపల్లి దర్శకుడు. వసూళ్ల పరంగా ఈ చిత్రం మహేష్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. వీకెండ్ అగ్రికల్చర్ పేరిట మహర్షి సినిమా గురించి సోషల్ మీడియాలో సామాన్య ప్రేక్షకులు కూడా పోస్ట్ లు పెట్టడంతో చేయడంతో ఇది వైరల్ అయ్యింది. ఐదవ స్థానంలో న్యూ ప్రొఫైల్ పిక్ అనే హ్యాష్ ట్యాగ్ నిలిచింది.

మొదటి ఐదు స్థానాల్లో ఒక్క బాలీవుడ్ చిత్రం కూడా కనిపించకపోవడం విశేషం. ఇలా తొలి నాలుగు స్థానాల్లో ఇద్దరు సౌత్ ఇండియన్ సినిమాల హీరోలు ఉండడం, బాలీవుడ్ కు సంబంధించిన ఏ సినిమా లేదా విషయం లేకపోవడం విశేషంగా చెప్పవచ్చు. దీన్ని బట్టి దేశంలో దక్షిణాది సినిమాలు హీరోల ప్రభావం ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఇటీవల ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సౌత్ చిత్రాల ప్రభావం పెరుగుతోంది. విశేషం ఏమిటంటే మహేష్ బాబు ఇంకా ఒక్క పాన్ ఇండియా సినిమా లో కూడా నటించ్లేదు. కేవలం తెలుగు సినిమాలు మాత్రమే చేస్తూ వస్తున్నారు. ఈ తెలుగు సినిమాలనే హిందీలోకి డబ్ చేసి అక్కడ టీవీల్లో ప్రదర్శిస్తున్నారు. ఆ విధం గానే మహేష్ కు అంత క్రేజ్ వచ్చింది.

ఇక మహేష్ ఒక పాన్ ఇండియా సినిమాలో నటిస్తే ఆయన పాపులారిటీ ఇంకా పెరుగుతుంది. ఇప్పటికే అనేక్స్ ఇతర రాష్ట్రాల వారు మహేష్ ఒక హిందీ సినిమా ఎప్పుడు చేస్తారు అని అడుగుతూనే ఉంటారు. కానీ మహేష్ మాత్రం తనకు తెలుగు సినిమాలు చేయడమే ఇష్టం అని చెప్తూ వస్తున్నారు. మరి భవిష్యత్ లో మహేష్ నుండి ఒక పాన్ ఇండియా సినిమా వస్తే దాని రెస్పాన్స్ భారీగా ఉంటుందని చెప్పడంలో సందేహం లేదు.

ఈ కాలంలో సోషల్ మీడియాలో ఎంత మంది ఫాలోవర్స్ ఉంటే అంతగా పాపులారిటీ ఉన్నట్టు. ఈ విషయంలో సూపర్ స్టార్‌ను బీట్ చేసే వారు లేరు సౌత్ ఇండియాలో లో ఎవరూ లేరు. ట్విట్టర్ లో హయ్యొస్ట్ ఫాలోవర్స్ ఉన్న స్టార్ మహేష్ అన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ సంఖ్య ఏకంగా ఎనిమిది మిలియన్లకు పైగా చేరింది.

సౌత్ ఇండియా వరకు ట్విటర్ లో టాప్ ఫాలోవర్లను కలిగిన హీరో ఈ రాజకుమారుడు. తెలుగు ఇండ‌స్ట్రీలో ఎంత‌మంది హీరోలైనా ఉండ‌ని సోష‌ల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ ఈయ‌నే ట్రెండింగ్. అస‌లు తెలుగు సినిమాకు ట్విట్ట‌ర్ అప్ డేట్స్ నేర్పించిందే మహేష్ బాబు. వైవిధ్యభరితమైన కథాంశం ఉన్న సినిమాలు చేయ‌డ‌మే కాదు, అటు తన అద్భుత నటన, అందంతో అభిమానులను సంపాదించుకోవడంలోనూ సూపర్‌స్టార్ మహేష్ బాబు ముందుటారు.

మహేష్ వరుస బ్లాక్ బస్టర్లతో స్పీడ్ మీదున్న సంగతి తెలిసిందే. భరత్ అనే నేను, మహర్షి చిత్రాలతో విజయాలు అందుకుని అదే స్పీడ్ లో సరిలేరు నీకెవ్వరు చిత్రంలో నటిస్తున్నారు. మహేష్ కెరీర్ 26వ చిత్రమిది. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను దిల్‌రాజు, అనిల్‌ సుంకరలతో కలిసి మహేష్ బాబు స్వయంగా నిర్మిస్తున్నారు. సరిలేరు నీకెవ్వరు ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో తెలియాలంటే 2020 సంక్రాంతి వరకు ఆగాల్సిందే.

Share

Leave a Comment