మ‌హ‌ర్షి ఎఫెక్ట్‌

భారీ అంచ‌నాల‌తో ప్రేక్ష‌కుల‌కి ముందుకు వ‌చ్చిన మ‌హ‌ర్షి చిత్రం అభిమానుల అంచ‌నాల‌కి త‌గ్గ‌ట్టే బాక్సాఫీస్ ద‌గ్గ‌ర భారీ వ‌సూళ్ళ వర్షం కురిపిస్తుంది. మే 9న విడుద‌లైన మ‌హ‌ర్షి కేవ‌లం నాలుగు రోజుల‌లోనే రూ.100 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.ఈ విష‌యాన్ని చిత్ర యూనిట్ పోస్ట‌ర్ ద్వారా తెలియ‌జేసింది. స్టూడెంట్‌గా, బిజినెస్ మేన్‌గా, రైతుగా మూడు పాత్ర‌ల‌లో మ‌హేష్ అద‌ర‌గొట్టారు.

ఈ చిత్రంలో రైతులకు సంబంధించిన సన్నివేశాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. అటు మహేష్ నటనపై ప్రశంసలు వెల్లువెత్తాయి. వీకెండ్ వ్య‌వ‌సాయం అను కాన్సెప్ట్‌కి మంచి ఆద‌ర‌ణ లభిస్తుంది. ద‌ర్శ‌కుడు వంశీ పైడిప‌ల్లి చిత్రాన్ని ప్రేక్ష‌కులకి న‌చ్చేలా తెర‌కెక్కించడంతో మూవీకి భారీ ఆద‌ర‌ణ ల‌భిస్తుంది. అల్ల‌రి న‌రేష్ కూడా మ‌హేష్ ఫ్రెండ్ పాత్ర‌లో అద‌రగొట్టేశాడు.

పూజా కూడా సినిమాకి స్పెష‌ల్ ఎట్రాక్ష‌న్ అని చెప్ప‌వ‌చ్చు. ఏదేమైన కేవలం నాలుగు రోజుల‌లోనే ఈ చిత్రం వందకోట్ల క్ల‌బ్‌లోకి చేర‌డం విశేషం. మ‌హ‌ర్షి చిత్రానికి దేవి శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందించ‌గా, దిల్ రాజు, అశ్విని ద‌త్‌, పీవీపి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. అల్లరి నరేష్ అన్నట్టు సినిమాలు ఎప్పుడూ చేస్తూనే ఉంటారు. హిట్ అయితే పేరు వస్తుంది.

కాని రెస్పెక్ట్ మాత్రం మాత్రం కొన్ని చిత్రాలతోనే వస్తుంది. మహర్షి చిత్రం హిట్టా, బ్లాక్ బస్టరా? సూపర్ డూపర్ హిట్టా? లాంటి విషయాలను పక్కన పెట్టేస్తే రైతంటే సింపథీ కాదు రెస్పెక్ట్ అనే సోషల్ మెసేజ్‌తో చాలా మందిలో చైతన్యం తీసుకువచ్చింది. సినిమా అంటే కేవలం వినోదం పంచడం మాత్రమే కాదు సమాజంలో మంచి మార్పు తెచ్చేలా ఉండాలని తపన పడే మహేష్ బాబు మహర్షి ద్వారా ఒక అద్భుతమైన కాన్సెప్టును ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు.

ఆయన చేసిన ఈ ప్రయత్నానికి తెలుగు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. రైతు అంటే చిన్నచూపు, వ్యవసాయానికి నిరాధరణ లాంటి సామాజిక సమస్యల్ని కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి ఎమోషనల్ జర్నీగా మహర్షి చిత్రాన్ని రూపొందించారు. దేశానికి అన్నం పెట్టే రైతుని మర్చిపోకూడదని అలాగే అందరికీ వ్యవసాయం అంటే ఏంటో తెలుసుకోవాల్సిన బాధ్యతను గుర్తుచేశారు.

ఇందుకోసం ‘వీకెండ్ వ్యవసాయం’ అనే కొత్త కాన్సెప్ట్‌ను మహర్షి చిత్రంలో చూపించారు. ఇప్పటికే సోషల్ మీడియాలో మహర్షి వీకెండ్ వ్యవసాయానికి అనూహ్య స్పందన లభిస్తోంది. అనేక మంది యువత పంటపొలాల్లో వ్యవసాయం చేస్తూ ఫొటోలు దిగి వాటిని సోషల్ మీడియాలో ‘మహర్షి వీకెండ్ వ్యవసాయం’ పేరుతో ట్యాగ్ చేస్తున్నారు.

నగరాల్లో జీవిస్తూ, కార్పొరేట్ ఉద్యోగాలు చేయడానికి అలవాటు పడిపోతున్న ఈ తరం యువత వ్యవసాయానికి క్రమక్రమంగా దూరం అవుతున్నారు. రైతులను, వ్యవసాయాన్ని చిన్నచూపు చూస్తున్నారు. పరిస్థితి ఇలాగే కొసాగితే దేశానికి అన్నం పెట్టే రైతు లేకుండా పోతాడని, అది మనుష్యుల ఆరోగ్యకరమైన జీవిన విధానంపై తీవ్ర ప్రభావం పడుతుందని ఈ సినిమా ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు.

‘నేను కూడా వ్యవసాయం వదిలేస్తే మీరేం తింటారు బాబూ’ అని ఓ ముసలి రైతు అడిగే ప్రశ్న అనేకమందిలో చలనం కలిగిస్తోంది. ఈ చిత్రంలోని సన్నివేశాలకు ప్రేక్షకుల నుండి అనూహ్య స్పందన వస్తుంది. మహేష్ బాబు గత మూవీ ‘శ్రీమంతుడు’ సైతం ప్రజల్లో మార్పు తెచ్చేందుకు దోహద పడిన సంగతి తెలిసిందే.

ఈ సినిమా చాలా మందిలో సొంతూరికి ఏదైనా సాయం చేయాలని, పల్లె అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలనే ఆలోచనకు బీజం వేశాయి. ఇపుడు ‘మహర్షి’ చిత్రం వ్యవసాయం వైపు ఆకర్షితులు అయ్యేలా చేస్తోంది. ఇలా ఎప్పటికప్పుడు సినిమాతో సమాజానికి ఏదైనా చెబుదాం అని మహేష్ ప్రయత్నిస్తున్న ప్రతీసారీ ప్రజలు కూడా ఆ సినిమాను బ్రహ్నరథం పడుతున్నారు.

ఇక కలెక్షన్ల విషయానికి వస్తే ఫస్ట్ వీకెండ్ అంటే నాలుగు రోజులకు తెలుగు రాష్ట్రాల్లో రూ.49 కోట్ల షేర్ వసూలు చేసి ట్రేడ్ వర్గాల్లో సంచలనం సృష్టించింది. సోమవారం నుంచి సినిమాకు అసలు పరీక్ష మొదలవుతుందని, ఈ రోజు టెస్ట్ పాసైతే ‘మహర్షి’కి తిరుగు ఉండదు అనేది విశ్లేషకుల వాదన. ఓవరాల్‌గా చూస్తే మహర్షి సోమవారం వసూళ్లు అదరగొట్టే స్థాయిలోనే ఉన్నాయి.

వీక్ డే సోమవారం టెస్ట్ కూడా పాసైంది. రైతులతో పాటు నగర వాసులకు, యువతకు కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్ కావడంతో ప్రతి ఒక్కరి నుంచి సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్‌తో పాటు ప్రశంసల దక్కుతున్నాయి. సోమవారం కూడా అదిరిపోయే కలెక్షన్లను రాబట్టడంతో మహర్షి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ దిశాగా దూసుకెల్తుందని ట్రేడ్ వర్గాలు అంచనాలు వేస్తున్నాయి.

Share

Leave a Comment