మ‌హేష్ కు న‌చ్చింది..మీ మనసుకూ నచ్చుతుంది!

సూప‌ర్ స్టార్ మహేష్ బాబు సోదరి మంజుల ద‌ర్శ‌కత్వంలో త్వరలో ‘మనసుకు నచ్చింది’ అనే సినిమా రాబోతోంది. సందీప్ కిష‌న్‌, అమైరా ద‌స్త‌ర్‌ ప్ర‌ధాన పాత్ర‌ల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం ట్రైలర్ మహేష్ బాబు విడుదల చేశారు.

మంగళవారం సాయంత్రం విడుదల చేసిన ‘మనసుకు నచ్చింది’ మూవీ ట్రైలర్ జాయ్ రైడ్ ఆఫ్ ఎమోషన్స్. చూడటానికి చాలా బావుంది.

నా సోదరికి బెస్ట్ విషెస్ తెలుపుతున్నాను అంటూ సూపర్ స్టార్ మహేష్ బాబు తన ట్విట్టర్ ద్వారా ఈ ట్రైలర్ విడుదల చేశారు.

పెళ్లి కూతురు (హీరోయిన్) పెళ్లి కొడుకు(హీరో)ను పెళ్లి పీటల మీద నుండి లేపుకుపోయే సీన్ తో ఈ ట్రైలర్ మొదలవుతుంది.

ఇలాంటి కాన్సెప్టుతో తెలుగులో ఇప్పటి వరకు సినిమా రాలేదు. ట్రైలర్ చూస్తుంటే మంజుల కథను చాలా కొత్తగా రాసుకున్నట్లు స్పష్టమవుతోంది.

ఓ అమ్మాయి, ఓ అబ్బాయిల మ‌ధ్య ఉండే స్నేహ‌బంధంతో పాటు ప్రేమ‌బంధాన్ని కూడా చూపుతూ ఎమోష‌న‌ల్ జ‌ర్నీగా ఈ సినిమాని తీర్చిదిద్దార‌ని అనిపిస్తోంది.

‘ఫాలో యువర్ హార్ట్’ అనే ట్యాగ్‌లైన్ తో తెరకెక్కుతున్న ఈ చిత్ర ట్రైలర్ అద్భుతంగా ఉంది. మంజుల ఎప్పటి నుండి తనను తాను నిరూపించుకోవాలని ఆశ పడుతోంది.

ఈ సినిమా ద్వారా ఆమె లక్ష్యం నెరవేరడం ఖాయం అనిపిస్తోంది. ఈ సినిమాను సొంత బేనర్లో సంజయ్ స్వరూప్, జెమిని కిరణ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ట్రైల‌ర్ ప్రామిసింగ్ ఉంద‌ని ప్ర‌శంసిస్తూనే.. త‌న సోద‌రికి, చిత్ర బృందంకి విషెస్ తెలియ‌జేశారు మ‌హేష్‌. ఈ నెల 26న ఈ సినిమా తెర‌పైకి రానుంది.

ఈ చిత్రానికి ర‌త‌న్ సంగీతం అందించ‌గా, త్వ‌ర‌లోనే పాటల‌ని విడుద‌ల చేయ‌నున్నారు. సాయిమాధవ్ బుర్రా డైలాగ్స్ రాశాడు.

మంజుల కూతురు జాన్వీ కూడా ఈ చిత్రంలో ముఖ్య పాత్ర పోషిస్తుండ‌గా, మ‌న‌సుకు న‌చ్చింది చిత్రం జాన్వీ డెబ్యూ మూవీ కానుంది.

క్యూట్‌ రొమాంటిక్‌ లవ్‌ స్టోరీగా తెరకెక్కుతోన్న ఈ చిత్రం అందరికీ ఖచ్చితంగా నచ్చుతుందని మంజుల నమ్మకం వ్యక్తం చేస్తోంది.

దర్శకురాలిగా మారి తెరకెక్కించిన ఈ చిత్రం ఆమెకు ఎంతో సంతృప్తినిచ్చిన చిత్రమనీ చెబుతోంది.

Share

Leave a Comment