సూపర్‌హిట్ కాంబినేషన్

స్వరబ్రహ్మగా పేరు గాంచిన మణిశర్మ స్టార్ హీరోలందరికీ అదిరిపోయే మ్యూజికల్ హిట్స్ అందించారు. ఆయన స్వరపరచిన పాటలు ఇప్పటికి ఎక్కడోచోట వినిపిస్తూనే ఉంటాయి. దశాబ్దకాలం పైగా టాలీవుడ్ లో మణిశర్మ తిరుగులేని సంగీత దర్శకుడిగా రాణించారు.

టాలీవుడ్ లో చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున ఇలా స్టార్ హీరోలందరికీ మణిశర్మ సూపర్ హిట్ మ్యూజిక్ ఆల్బమ్స్ అందించారు. మహేష్ కెరీర్ ఆరంభం నుంచి ఆయన సినిమాలకు సంగీతం అందించారు మణిశర్మ. ఆయనకు మహేష్‌ తో మంచి సాన్నిహిత్యం కూడా ఉంది.

మహేష్ సినిమాలకు సంగీతం సమకూర్చుతున్నప్పుడు మీరు ఎలా చేస్తారు అని మణిశర్మను ఒక ఇంటర్వ్యూలో అడిగితే ఇలా స్పందించారు. తాను నటిస్తున్న సినిమా కథకు ఎంత ప్రాధాన్యమిస్తాడో…సంగీతానికి కూడా అంతే విలువనిస్తాడట మహేష్ బాబు. ఈ మాట ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ అన్నారు. మహష్ బాబు సినిమాలకి సంగీతం అందించడాన్ని ఆయన చాలా ఎంజాయ్ చేసేవారట.

‘మహేష్ చిత్రానికి మ్యూజిక్ అంటే చాలా స్వాతంత్ర్యం ఉంటుంది. ట్యూన్లు విషయంలో ఆయన వేలు పెట్టరు. అంతేకాదు…తొందరగా ఇచ్చేయండని డెడ్ లైన్లు కూడా పెట్టరు. నిర్మాతనీ దర్శకుడిలతో కూడా మణిగారిని ఎక్కువగా డిస్ట్రబ్ చేయకండి. ఆయన్ని అలా వదిలేయండి. ఎలాంటి పాటలివ్వాలో ఆయనకి తెలుసు’ అని మహేష్ అనేవాడని తెలిపారు మణిశర్మ.

వీరి కాంబినేషన్లో వచ్చిన అన్ని సినిమాలు మ్యూజికల్ హిట్స్ గా నిలవడం విశేషం. అంతే కాకుండా అతడు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ని అయితే తెలుగు సినిమా చరిత్ర లోనే బెస్ట్ రీరికార్డింగ్ అని అందరు ఇప్పటికీ ప్రశంసిస్తునే ఉంటారు. వీరి కాంబినేషన్ అంటే అప్పట్లో సూపర్‌హిట్ అని అందరు ఫిక్స్ అయిపోయేవారంటే అతిశయోక్తి కాదు.

మధ్యలో కొంచేం మణిశర్మ గారి సినిమాలు తగ్గాయి కాని, రీరికార్డింగ్ మాత్రం అదరగొడుతూనే ఉన్నారు. మహేష్‌ – శ్రీకాంత్‌ అడ్డాల కాంబినేషన్‌లో వచ్చిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రానికి కూడా మణిశర్మ అద్బుతమైన బ్యాగ్రౌండ్‌ స్కోర్‌ను ఇచ్చి సినిమా విజయంలో తన వంతు పాత్ర పోషించాడు.

ఈ రోజు మణిశర్మ గారి పుట్టిన రోజు సందర్భంగా ఆయనికి మహేష్ అభిమానుల తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన మరిన్ని మంచి సినిమాలకి అదిరిపోయే స్వరాలు సమకూర్చాలి అని విష్ చేద్దాం.

Share

Leave a Comment