కొత్త లుక్‌ అదరహో..!

కరోనా లాక్‌డౌన్‌ కారణంగా దొరికిన అనూహ్య సమయాన్ని టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేశ్‌ బాబు తన పిల్లలతో కలిసి సరదాగా గడుపుతున్నాడు. సాధారణంగానే సినిమా షూటింగ్‌ల సమయంలో ఏ కాస్త విరామం దొరికినా ఇంట్లో వాలిపోతాడు.

ప్రస్తుత లాక్‌డౌన్‌ సమయంలో తన పిల్లలతో కలిసి చేసే అల్లరి పనులను ఎప్పటికప్పుడు ఆయన సతీమణి నమ్రత శిరోద్కర్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తుంటారు. తాజాగా నమ్రత తన ఇన్‌స్టాలో షేర్‌ చేసిన ఓ ఫోటో చూపరులను తెగ ఆకట్టుకుంటోంది.

గౌతమ్‌, సితారలతో కలిసి మహేశ్‌ సెల్ఫీ దిగిన ఫోటోను నమ్రత తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్‌ చేశారు. ఈ ఫోటోలో సూపర్‌స్టార్‌ లుక్‌ ఎప్పటికంటే చాలా డిఫరెంట్‌గా ఉంది. కళ్ల జోడు పెట్టుకొని చాలా క్యూట్‌గా ఉన్న మహేశ్‌ లుక్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

మునుపటి కంటే కరింత యంగ్ ఆండ్ ఎనర్జిటిక్ గా కనిపిస్తున్నాడు మహేష్. ఇది మేకోవరా ఛేంజోవరా? లాక్ డౌన్ లో మరీ ఇంతగా మారిపోయాడు. అసలు వయసు సగానికి సగం తగ్గిపోయింది. జస్ట్ 19 ప్లస్ అంతే అన్నట్టుగా కనిపిస్తున్నాడు.

చూడగానే పాలబుగ్గల రాకుమారుడిలా షాకిస్తున్నాడు. రాజకుమారుడు సినిమాల్లో నటించేప్పటి కంటే ముందు ఎలా ఉండేవాడో అలా ఉన్నాడు. మరీ ఇంతగా యూత్ అయిపోయాడు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్‌ మీడియాలో తెగ చక్కర్లు కొడుకొడుతూ వైరల్ గా మారింది.

ఇప్పటికే గౌతమ్ టీనేజీలో అడుగు పెట్టేశాడు. అతడికి అన్న ఉంటే అచ్చం ఇలానే ఉంటాడేమో అన్నట్టుగా కనిపిస్తున్నాడు మహేష్. ఇంతలోనే ఎంత మార్పు. కేవలం 45 రోజుల లాక్ డౌన్ కే ఇంత మార్పు చూపించాడు. గౌతమ్ కి అన్నయ్యలా ఉన్నావు అంటూ మహేష్ కి కాంప్లిమెంట్లు ఇచ్చేస్తున్నారు.

భరత్ అనే నేను సినిమాతో పోలిస్తే మహర్షిలో ఇంకా యంగ్ గా కనిపించాడు. అందులో కాలేజ్ బోయ్ పాత్ర కాబట్టి మహేష్ దానికోసం చాలానే కసరత్తులు చేసి మారాడు. సరిలేరు నీకెవ్వరులో ఆర్మీ మేన్ గా కనిపించి ఆకట్టుకున్నాడు. ఇప్పుడు అంతకంటే యంగ్ గా కనిపిపిస్తున్నాడు.

అంతేకాకుండా మహేశ్‌ తన తదుపరి చిత్రం పరుశురామ్‌ డైరెక్షన్‌లో ఓ లవ్‌స్టోరీ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిలో భాగంగానే మీసాలు లేకుండా, కూల్‌గా, కాలేజీ స్టూడెంట్‌లా తన లుక్‌ను మార్చుకున్నాడని నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు.

మహేష్ గత కొంతకాలంగా సందేశాత్మక కథాంశాలతో సినిమాలు చేస్తున్నారు. ఆ పంథాకు పూర్తి భిన్నంగా పరుశురాం సినిమా సరికొత్త కధతో మంచి ఎంటర్టైనర్‌‌గా రానుందని సమాచారం. మహేష్ ఫ్యాన్స్ అందరూ గర్వపడేలా సినిమా ఉంటుంది. మహేష్ ను సరికొత్తగా ప్రెజంట్ చేయడానికి ప్రయత్నిస్తాను అని తెలిపాడు.

Share

Leave a Comment