స్పెషల్ గా విష్ చేసిన మహేష్

ఈ సృష్టిలో విలువ కట్టలేనిది అంటూ ఏమైనా ఉంది అంటే…అది ఒక అమ్మ ప్రేమ మాత్రమే. ఈ సృష్టిలో అమ్మ లేకుండా ఏదీ లేదు. ఏమని చెప్పినా, ఎంత చెప్పినా.. అది తక్కువే అవుతుంది. ఎందుకంటే ‘అమ్మ’ కంటే గొప్ప మాట, గొప్ప కావ్యం , గొప్ప రాగం ఏముటుంది.? వుండదు.

ఎంత స్టార్ డమ్ వచ్చినా, పుట్టుకతోటే వారు స్టార్స్ కాదు కదా…ఎంతటి సినీ ప్రముఖులైనా తొలిసారి ప్రపంచాన్ని చూసేది అమ్మ కళ్లతోనే. అలాగే తొలి అడుగు వేసేది ఆమె వేలు పట్టుకొనే. ‘మదర్స్ డే ‘ సందర్భంగా మహేష్ బాబు ప్రత్యేకమైన ట్వీట్ చేసాడు.

“నేను, నా పిల్లలు గొప్ప అమ్మలను కలిగి ఉన్నందుకు పెట్టి పుట్టాము. వారిని అమితంగా ప్రేమించాలి.. అమ్మ..వేలుపట్టి నడకనే కాదు, మనసుపెట్టి నడతనూ నేర్పుతుంది పిల్లలకు..అందుకే సృష్టిలో అమ్మతనం కన్నా కమ్మదనం మరెందులోను లేదంటారు” అని తన తల్లిని స్మరిస్తూ ఓ ట్వీట్ చేశారు.

జీవితంలో ఇంపార్టెంట్ రోజున ఏదయినా మంచి సంఘటన జరిగితే అదో తియ్యని జ్ఞాపకంగా లైఫ్ లాంగ్ మిగిలిపోతుంది. మహేష్ బాబుకు ఈ ఏప్రిల్ 20వ తేదీ అలాంటి మంచి మెమొరీ నే మిగిల్చింది. అది భరత్ అనే నేను సినిమా రిలీజ్ కావడం..ఆ రోజు మహేష్ తల్లి ఇందిర జన్మదినం కావడం..ఆ సినిమా తన కెరీర్ బిగ్గెస్ట్ హిట్ కావడం..అంతకన్నా ఇంకేం కావాలి.

నేడు మాతృ దినోత్సవం. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ తల్లిని తలుచుకుంటారు. నిజానికి ఆమెకు ఒక్కరోజు కేటాయించడం దారుణమే. అయినా కూడా మనల్ని మనమే మరచిపోతున్న ఈ బిజీ లైఫ్‌లో తల్లిని స్మరించుకునేందుకు ఒకరోజు తప్పనిసరిగా కావాల్సిందే.

తరాలు మారినా తల్లీ బిడ్డల బంధంలో మాత్రం ఎటువంటి మార్పూలేదు. థ్యాంక్స్ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఇంకా కల్తీకాని బంధం ఈ ప్రపంచంలో ఏదయినా నూరు శాతం స్వచ్ఛంగా మిగిలి ఉందంటే అది ఒక్కటే. యుగాలు మారినా సృష్టిలో అమ్మ ప్రేమది మాత్రం ప్రత్యేక స్థానం. ఈ ప్రపంచంలో బిడ్డపై తల్లి చూపించే ఆత్మీయత వెలకట్టలేనిది.

ఈ సృష్టికి మూలం ఆ భగవంతుడు అవునో కాదు తెలియదు కాని, మానవ సృష్టికి మూలం మాత్రం అమ్మే. మనల్ని ఓ కొత్త ప్రపంచానికి పరిచయం చేసే ఆ మాతృ మూర్తికి మనసారా వందనాలు తెలియజేయటం మనందరి కర్తవ్యం.

Share

Leave a Comment