ఫ్యాన్స్‌కి రెండు గిఫ్ట్స్ ఇవ్వబోతున్నారా

బ్లాక్ బస్టర్ హిట్ భరత్ అనే నేను చిత్రం అద్భుత విజయంతో ఆ విజయానందాన్ని ఎంజాయ్ చేస్తున్న సూపర్ స్టార్ మహేష్, తదుపరి తన కెరీర్ లోని ప్రతిష్టాత్మక 25వ చిత్రాన్ని వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేస్తున్న విషయం తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, వైజయంతి మూవీస్ సంస్థలపై దిల్ రాజు, అశ్విని దత్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ షెడ్యూల్ ఇప్పటికే డెహ్రాడూన్ లో జరిగిన విషయం తెలిసిందే.

ఈ సినిమా షూటింగ్ డెహ్రాడూన్ పరిసర ప్రాంతాల్లోనూ, అక్కడి ఒక కాలేజ్ లోను శరవేగంగా జరుపుకుంది. మహేష్ బాబు, హీరోయిన్ పూజ హెగ్డే, ఈ సినిమాలో మరో మెయిన్ కేరెక్టర్ రోల్ చేస్తున్న అల్లరి నరేష్ లపై కీలక సన్నివేశాలను అంటే కాలేజ్ సన్నివేశాలను వంశీ పైడిపల్లి ఈ ఫస్ట్ షెడ్యూల్ లో చిత్రీకరించారు.

డెహ్రాడూన్ షెడ్యూల్ తర్వాత మహేష్ 25 మూవీ టీమ్ మొత్తం ఫారిన్ లో జరిగే షూటింగ్ కోసం ఫ్లైట్ ఎక్కనున్నారా లేక ఇక్కడే షూటింగ్ జరపనున్నారా తెలియాల్సి ఉంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లోనూ, ట్రేడ్ లోను భారీ అంచనాలే ఉన్నాయి. ఈ 25వ సినిమా మహేష్ కెరీర్ లో మరపురాని చిత్రంగా ఉండాలని దర్శకుడు, నిర్మాతలు భావిస్తున్నారు.

అందుకే ఈ సినిమాకి సంబంధించి ఎలాంటి విషయాలు బయటికి రాకుండా వంవంశీ పైడిపల్లి తో సహా నిర్మాతలు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ సినిమా టైటిల్ విషయంలో సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్నా మూవీ యూనిట్ ఎక్కడా నోరు మెదపడం లేదు. టైటిల్, కాన్సెప్ట్ లాంటివేమీ బయటపెట్టడం లేదు. కనీసం ఫస్ట్ లుక్ కూడా విడుదల చేయడం లేదు.

అయితే ఇంతగా మహేష్ 25 మూవీ విషయాలేమి బయటికి రాకుండా ఎందుకు చూసుకుంటున్నారంటే సూపర్ స్టార్ మహేష్ బర్త్ డే సందర్భంగా ఆగస్టు 9న అయన అభిమానులకు, ప్రేక్షకులకు సర్‌ప్రైజ్ గిఫ్ట్‌గా ఉండే విధంగా స్పెషల్ గా బర్త్ డే విషెస్ చెబుతూ మహేష్ 25వ సినిమాకు సంబంధించి టైటిల్ తోపాటు ఫస్ట్ లుక్ బయటపెట్టాలన్నది మేకర్స్ ఆలోచనగా తెలుస్తుంది.

ఆ లుక్ అండ్ టైటిల్ తోనే మహేష్ సినిమాపై మరిన్ని అంచనాలు పెంచాలనే యోచనలో నిర్మాతలు కూడా ఉన్నారు. అయితే ఈ వార్తను అధికారికంగా ప్రకటించాల్సి వుంది. ఇప్పటికే మహేష్ అభిమానులు ఆయన పుట్టినరోజును భారీ ఎత్తున నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఇప్పుడు ఈ వార్త కూడా నిజమైతే అభిమానులకు ఇంతకన్నా ఆనందం ఏముంటుంది.

Share

Leave a Comment